E-Paper
Advertisement

గూగుల్‌లో ఈ విషయాలను అసలు వెతకొద్దు..సెర్చ్ చేస్తే నేరుగా జైలుకే!

గూగుల్‌లో ఈ విషయాలను అసలు వెతకొద్దు..సెర్చ్ చేస్తే నేరుగా జైలుకే!
Advertisement

Things you should never search on google: ప్రపంచాన్ని అరచేతిలో.. చూపించే ఇంటర్నెట్, గూగుల్ సెర్చ్ ఇంజన్ మన జీవితంలో ఒక భాగమైపోయాయి. మనకు తెలియని సమాచారాన్ని క్షణాల్లో అందించే గూగుల్, ఒక్కో సారి మన కొంప ముంచేయగలదు. ఎందుకంటే కొన్ని ప్రభుత్వ శాఖలు , సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్లు ఇంటర్నెట్ యూజర్ల కదలికలను నిరంతరం గమనిస్తుంటాయి. మీరు గూగుల్‌లో చేసే కొన్ని రకాల ప్రమాదకరమైన సెర్చ్‌లు మిమ్మల్ని నేరుగా పోలీసుల విచారణకు లేదా జైలుకు తీసుకువెళ్లే.. అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండటానికి మనం ఏయే విషయాలను అసలు గూగుల్‌లో వెతకకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

1.చట్టవిరుద్ధమైన, నేరపూరిత విషయాలు:

బాంబులు ఎలా తయారు చేయాలి, విషం ఎలా తయారు చేయాలి లేదా హ్యాకింగ్ ఎలా చేయాలి వంటి అంశాలను గూగుల్‌లో ఎప్పుడూ వెతకకూడదు. ఇలాంటి పదాలను సెర్చ్ చేసిన వెంటనే.. ఆ యూజర్ ఐపీ అడ్రస్ ,లొకేషన్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీల ఆటోమేటిక్ అలర్ట్ సిస్టమ్‌కు చేరుకుంటాయి. ఉగ్రవాద సంబంధిత లేదా చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచే సంస్థలు ఇలాంటి సెర్చ్‌లను తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటాయి.

2. అశ్లీలత, అక్రమ కంటెంట్:

Advertisement

గూగుల్ , ఇతర సెర్చ్ ఇంజన్లు చైల్డ్ అబ్యూజ్ కంటెంట్.. పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తాయి.ఇలాంటి అనైతిక, చట్ట విరుద్ధమైన వీడియోలు లేదా ఫోటోల కోసం గూగుల్‌లో సెర్చ్ చేయడం లేదా డౌన్‌ లోడ్ చేయడానికి ప్రయత్నించడం దేశంలోనే ..అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. పోక్సో చట్టం కింద ఇది నాన్-బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి.. క్షణాల్లోనే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది.

3.పైరసీ ,కాపీరైట్ ఉల్లంఘన:

ఇటీవల విడుదలైన కొత్త సినిమాలను లేదా పేరొందిన సాఫ్ట్‌ వేర్‌లను టోరెంట్స్, ఇల్లీగల్ వెబ్‌సైట్ల నుంచి డౌన్‌ లోడ్ చేయడానికి గూగుల్‌లో లింక్స్ వెతకడం నేరం. పైరసీని.. అరి కట్టడానికి ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను అమలు చేస్తున్నాయి. పైరేటెడ్ కంటెంట్‌ను ప్రచారం చేయడం లేదా డౌన్‌లోడ్ చేయడం వల్ల భారీ జరిమానాలు, జైలు శిక్ష అనుభవించాల్సి రావచ్చు.

Advertisement

Also Read: ఫ్రిజ్ క్లీనింగ్ కష్టమా? ఈ అల్యూమినియం ఫాయిల్ ట్రిక్‌తో మీ పని ఈజీ!

4.ప్రమాదకరమైన మందులు,డ్రగ్స్ తయారీ:

నిషేధించిన సింథటిక్ డ్రగ్స్, మత్తు పదార్థాలు లేదా నకిలీ మందులను ఇంట్లోనే.. ఎలా తయారు చేయాలో గూగుల్‌‌లో వెతకడం వల్ల మీ పై డ్రగ్ కంట్రోల్ బోర్డు, పోలీసులు నిఘా పెడతారు. అలాగే.. కొన్ని మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ కోసం వెతకడం మీ ఆరోగ్యాన్నే కాకుండా మీ సేఫ్టీని కూడా ప్రమాదంలో పడేస్తుంది.

ఇంటర్నెట్ అనేది మనకు జ్ఞానాన్ని పంచే అద్భుతమైన వేదిక. కానీ.. దానిని దుర్వినియోగం చేయడం లేదా చట్ట వ్యతిరేక విషయాల కోసం ఉపయోగించడం మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేసే ముందు అది ఎంత వరకు చట్టబద్ధమైందో ఒకటికి రెండు సార్లు ఆలోచించడం చాలా ముఖ్యం. మీ డిజిటల్ సేఫ్టీ మీ చేతుల్లోనే ఉంది జాగ్రత్త!

Related News

110 ఇంచుల భారీ స్క్రీన్.. 6,000 నిట్స్ బ్రైట్‌నెస్.. హువావే కొత్త టీవీలు వచ్చేశాయ్!

చలికాలంలో వేడి నీళ్ల కోసం ఏ గీజర్ కొనాలి? గ్యాస్ Vs ఎలక్ట్రిక్ పూర్తి గైడ్!

వైర్డ్ vs వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. ఈ రెండింటిలో ఏది ఎక్కువ కాలం మన్నుతుంది?

ఫ్రిజ్ క్లీనింగ్ కష్టమా? ఈ అల్యూమినియం ఫాయిల్ ట్రిక్‌తో మీ పని ఈజీ!

వన్‌ప్లస్ కొత్త ఇయర్ బడ్స్‌పై భారీ డిస్కౌంట్.. ఫీచర్లు తెలిస్తే కొనకుండా ఉండలేరు!

అబ్బా ఏం ఐడియా భయ్యా.. నెట్‌వర్క్ లేకపోయినా వాకీటాకీలా వాడుకునే వన్‌ప్లస్ సీక్రెట్ ఫీచర్!

వింటర్ వచ్చేసింది..గీజర్ సర్వీసింగ్ చేయించకుండా ఆన్ చేస్తే భారీ మూల్యం తప్పదు!

Big Stories

Advertisement
×