E-Paper
Advertisement

వాట్సాప్‌లో.. ఈ 5 సెట్టింగ్‌లను పొరపాటున కూడా మరవొద్దు!

వాట్సాప్‌లో.. ఈ 5 సెట్టింగ్‌లను పొరపాటున కూడా మరవొద్దు!
Advertisement

Important whatsapp settings: ఈ రోజుల్లో చాలా మంది ఫోన్‌లో వాట్సాప్ చూడనిది క్షణం ఉండదు. పర్సనల్ చాట్‌ల నుంచి బ్యాంకు వివరాల వరకు అన్నీ వాట్సాప్‌లోనే షేర్ చేసుకుంటుంటాం. అయితే.. ఇంత ముఖ్యమైన యాప్‌ను మనం వాడుతున్నప్పటికీ, దాని సేఫ్టీ విషయంలో కొన్ని పొర పాట్లు చేస్తుంటాం. చిన్న చిన్న సెట్టింగ్‌లను నిర్లక్ష్యం చేయడం వల్ల మన పర్సనల్ డేటా లీకయ్యే.. ప్రమాదం ఉంది. మీ వాట్సాప్‌ను ఎల్లప్పుడూ సేఫ్‌గా ఉంచుకోవడానికి.. మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడని ఆ అద్భుతమైన 5 సెట్టింగ్‌లు ఏమిటో ఇప్పుడు చూద్దాం!

1. టూ-స్టెప్ వెరిఫికేషన్ :

చాలా మంది వాట్సాప్‌లో.. కేవలం ఫోన్ నంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యి వదిలేస్తారు. కానీ.. ఇది పూర్తిగా సేఫ్టీ కాదు. మీ సిమ్ కార్డ్ హ్యాక్ అయితే.. ఎవరైనా మీ వాట్సాప్‌ను ఈజీగా యాక్సెస్ చేయగలరు. దీన్ని నివారించడానికి.. ‘టూ-స్టెప్ వెరిఫికేషన్’ఎనేబుల్ చేసుకోవడం అత్యంత ముఖ్యం. దీని వల్ల మీరు ఎప్పుడైనా కొత్త ఫోన్‌లో.. వాట్సాప్ ఇన్‌స్టాల్ చేస్తే, మీరు సెట్ చేసుకున్న 6 అంకెల పిన్ నంబర్ అడుగుతుంది.ఇది మీ అకౌంట్‌కు బలమైన కోటలా పని చేస్తుంది.

2. ప్రొఫైల్ పిక్చర్, లాస్ట్ సీన్ ప్రైవసీ :

Advertisement

మీ వాట్సాప్ డీపీ , అబౌట్, ‘లాస్ట్ సీన్’ వివరాలు అందరికీ కనిపిస్తున్నాయా? అయితే వెంటనే.. వాటిని మార్చుకోండి. సైబర్ నేరగాళ్లు మన ప్రొఫైల్ ఫోటోలను డౌన్‌లోడ్ చేసి ఫేక్ అకౌంట్ సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి ప్రైవసీ సెట్టింగ్‌లోకి వెళ్లి వీటిని ‘ఎవ్రీవన్’నుంచి ‘మై కాంటాక్ట్స్’ లేదా ‘నోబడీ’కి మార్చుకోవడం ఎప్పుడూ సేఫ్ .

3. డిస్అపియరింగ్ మెసేజెస్ :

మనం పంపే.. మెసేజ్‌లు లైఫ్‌ లాంగ్ చాట్ హిస్టరీలో ఉండిపోవాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన లేదా పర్సనల్ చాట్‌ల విషయంలో ‘డిస్అపియరింగ్ మెసేజెస్’ ఫీచర్‌ను ఆన్ చేయడం మంచిది. మీరు సెట్ చేసిన సమయాన్ని (24 గంటలు, 7 రోజులు లేదా 90 రోజులు) బట్టి ఆటోమేటిక్‌గా .. ఆ చాట్స్ డిలీట్ అయిపోతాయి. దీని వల్ల మీ ఫోన్ పోయినా.. లేదా ఎవరి చేతికి చిక్కినా పర్సనల్ డేటా లీక్ అయ్యే టెన్షన్ ఉండదు.

4. చాట్ లాక్ :

Advertisement

మన ఫోన్‌ను ఫ్రెండ్స్ లేదా పిల్లలు తీసుకున్నప్పుడు కొన్నిసార్లు సీక్రెట్ చాట్‌లు ఎక్కడ కనిపిస్తాయోనని భయం ఉంటుంది. ఈ సమస్యకు వాట్సాప్ అద్భుతమైన పరిష్కారంగా ‘చాట్ లాక్’ ఫీచర్‌ను తెచ్చింది. మీకు నచ్చిన వ్యక్తిగత చాట్‌లను లాక్ చేసి పెట్టుకోవచ్చు. దీని వల్ల ఆ చాట్‌లు ఓపెన్ చేయాలంటే .. మీ ఫింగర్‌ ప్రింట్ లేదా పాస్‌కోడ్ తప్పనిసరిగా అవసరమవుతుంది. ఇది మీ ప్రైవసీని మరింత పటిష్టం చేస్తుంది.

Also Read: ఫోన్‌లో 2 సిమ్‌లు వాడితే బ్యాటరీ త్వరగా పాడవుతుందా? అసలు నిజమిదే!

5. అన్-నోన్ కాల్స్ సైలెన్సింగ్:

ఈ మధ్య కాలంలో విదేశీ నంబర్ల నుంచి వాట్సాప్ స్పామ్ కాల్స్, లాటరీ ఫ్రాడ్ కాల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. వీటిని క్లిక్ చేయడం వల్ల సైబర్ మోసాల బారిన పడే అవకాశం ఉంది. దీన్ని అరికట్టడానికి వాట్సాప్ సెట్టింగ్స్‌లో ‘ప్రైవసీ’ -> ‘కాల్స్’ ఆప్షన్‌లోకి వెళ్లి ‘సైలెన్స్ అనౌన్ కాలర్స్’ఆన్ చేయండి. దీనివల్ల మీకు పరిచయం లేని ..నంబర్ల నుంచి కాల్ వస్తే రింగ్ కాదు, కానీ కాల్ హిస్టరీలో కనిపిస్తుంది.

టెక్నాలజీ మన జీవితాలను ఈజీ చేసినప్పటికీ, దాంతో పాటు కొన్ని ముప్పులు కూడా వస్తుంటాయి. వాట్సాప్ వంటి ప్లాట్‌ ఫారమ్‌లను వాడేటప్పుడు చిన్న చిన్న సేఫ్టీ టిప్స్ పాటించడం ద్వారా పెద్ద ప్రమాణాల నుంచి ఈజీగా బయటపడొచ్చు. ఇప్పుడే మీ వాట్సాప్ ఓపెన్ చేసి.. ఈ 5 సెట్టింగ్‌లను చెక్ చేసుకోండి, మీ డిజిటల్ లైఫ్‌ను సేఫ్ చేసుకోండి!

Related News

వైర్డ్ ఇయర్‌ఫోన్లు, MP3 ప్లేయర్లు మళ్లీ ట్రెండ్‌లోకి.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!

పెన్ డ్రైవ్‌పై ఈ రంధ్రాల సీక్రెట్ తెలుసా? దీనివల్ల ఇన్ని లాభాలా? ఇన్నాళ్లు తెలియలేదే!

ఫోన్‌లో 2 సిమ్‌లు వాడితే బ్యాటరీ త్వరగా పాడవుతుందా? అసలు నిజమిదే!

శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఏంటి? అంతరిక్షం నుంచి మీ ఇంటికి నెట్‌వర్క్ ఎలా వస్తుంది?

ఎల్జీ కొత్త వాషింగ్ మిషన్లు.. బుర్ర బద్దలయ్యే క్రేజీ ఫీచర్లు.. మార్కెట్‌ షేక్ అవ్వడం పక్కా!

అమెజాన్ Vs ఫ్లిప్‌కార్ట్ సేల్..వస్తువులు కొనడానికి ఏది బెస్ట్?

ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే అందే అద్భుతమైన లాభాలు!

Big Stories

Advertisement
×