E-Paper
Advertisement

బిగ్ బాస్ 10: మారిన ఓటింగ్.. ఎలిమినేషన్ దిశగా మరో లేడీ?

బిగ్ బాస్ 10: మారిన ఓటింగ్.. ఎలిమినేషన్ దిశగా మరో లేడీ?
Advertisement

Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10 లో మూడవ వారం జరిగిన నామినేషన్ రచ్చ ఏ రేంజ్ లో హీటెక్కిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్షిణి వర్సెస్ షాలిని, ముఖేష్, త్రిగుణ్ , వంశీ ఇలా ఎవరికివారు తమ నామినేషన్ పాయింట్లతో హీటెక్కించారు. అంతేకాదు నిన్నటి ఎపిసోడ్లో టెంటేషన్ వర్సెస్ టెన్షన్ టాస్క్ లో భాగంగా ముఖేష్ గౌడ తన తండ్రితో కలిసి దిగిన ఫోటోని సొంతం చేసుకోవడం కోసం.. దెబ్జానీ కోసం ప్రేమగా తన తల్లిదండ్రులు పంపిన లేఖను ముఖేష్ స్పాయిల్ చేయడం, ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం అన్ని హైలైట్ గానే నిలిచాయి . ఇకపోతే ఓటింగ్ లైన్ ఓపెన్ అయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఇప్పటివరకు నామినేషన్ లో ఉన్న సెలబ్రిటీల ఓటింగ్స్ బట్టి చూస్తే టాప్ అలాగే లీడ్ లో ఉన్న పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మారిపోయిన ఓటింగ్ లెక్కలు..

ఇకపోతే తాజాగా విడుదలైన అనధికారిక ఓటింగ్ పోల్ ఫలితాల ప్రకారం ప్రేక్షకులలో కూడా ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. మంగళవారం జరిగిన ఒక్క ఎపిసోడ్ తో ఓటింగ్ పూర్తిగా మారిపోయింది. ఇన్ని రోజులు అడుగున ఉన్న సుధీర్ ఒక్కసారిగా విన్నర్ రేసులోకి దూసుకొచ్చారు. దీనికి కారణం ఆయన సృష్టిను ఫ్లర్ట్ చేయడం ఒక ఎత్తైతే.. ముఖ్యంగా సృష్టి – సుధీర్ మధ్య జరిగిన గొడవ మరో ఎత్తు.. సృష్టి ఏకంగా గుద్దితే పళ్ళు రాలిపోతాయి అంటూ అతడిపై చేసిన కామెంట్లు అన్నీ కూడా సుధీర్ కి ఫేవర్ గానే నిలిచాయి. అలా గత వారం ఎలిమినేట్ దిశగా అడుగులు వేసిన సుధీర్.. ఇప్పుడు ఏకంగా 24.41% ఓట్లతో మొదటి స్థానంలో కొనసాగుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు.

Advertisement

also read:కయాదు లోహర్ పేరుకి పురాణాలతో ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

సేఫ్ జోన్ లో ఉన్నది వీరే..

24.25% ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు త్రిగుణ్. ప్రస్తుతం వీరిద్దరి మధ్య పోటీ హోరా హోరీగా సాగుతోంది. ఇప్పటివరకు జరిగిన ఓటింగ్ ను బట్టి చూస్తే వీళ్లిద్దరూ సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఇక మిగిలిన 6 మంది విషయానికి వస్తే.. చరణ్ 14.16% ఓట్లతో మూడో స్థానంలో నిలవగా.. 9.84% ఓట్లతో షాలిని నాలుగవ స్థానంలో, 9.14% ఓట్లతో వంశీ ఐదవ స్థానంలో దూసుకుపోతున్నారు. మొత్తానికి అయితే ఈ ఐదు మంది ఎలిమినేషన్ ప్రమాదం నుండి కాస్త దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.. మరోవైపు అమన్, వర్షిణి, ఝాన్సీ ఎలిమినేషన్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆరవ స్థానంలో అమన్, ఏడవ స్థానంలో వర్షిణి నిలవగా.. ఇప్పుడు డేంజర్ జోన్ లో ఝాన్సీ నిలిచింది .

ఎలిమినేషన్ దిశగా అడుగులు ఎవరివి..

Advertisement

దీనికి కారణం ఆమె కెప్టెన్ అయినప్పటికీ.. వీక్ ఆఫ్ ది స్టార్ గా నిలిచిన ముఖేష్ కారణంగా నామినేషన్ లోకి వచ్చిన ఈమె.. చరణ్ కారణంగా నామినేట్ అయ్యింది. ముఖ్యంగా నామినేషన్ వచ్చేసరికి రైతుబిడ్డ అనే ట్యాగ్ తగిలించుకొని మెడలో కండువా వేసుకొని, షర్ట్ వేసుకోవడం తనకు నచ్చలేదంటూ చరణ్ చేసిన కామెంట్లు ఆడియన్స్ కు బాగా రీచ్ అయ్యాయి. అలా చరణ్ చేసిన కామెంట్స్ బాగా వర్కౌట్ కావడం వల్లే ఝాన్సీ డేంజర్ జోన్ దిశగా అడుగులు వేస్తోంది. ఒకవేళ శుక్రవారం వరకు పోలింగ్ ఇదే స్థాయిలో జరిగింది అంటే ఈ వారం ఝాన్సీ ఎలిమినేట్ కాక తప్పదు అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి చూద్దాం ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో..

Related News

గణేష్ నిమజ్జనం స్పెషల్ ఈవెంట్.. సందడి చేసిన సెలబ్రిటీస్!

సరిగమపలో అదరగొడుతున్న దైవిక్.. అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే!

బిగ్ బాస్ 10లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న భల్లాల దేవ?

బిగ్ బాస్ త్రిగుణ్ సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారా? ఈయన భార్య ఎవరంటే?

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు మైండ్ బ్లాక్.. పార్వతి మాటతో షాక్.. పాపం ప్రభా..

Karthika Deepam 2 Serial Today Episode September 23rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన దీప, కార్తీక్           

Big Stories

Advertisement
×