E-Waste India: చేతిలో స్మార్ట్‌ఫోన్ ఇంట్లో స్మార్ట్ టీవీ.. రోజుకో కొత్త గ్యాడ్జెట్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ పాత ఎలక్ట్రానిక్ వస్తువుల చెత్తా పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం భారత్‌లో 2023–24లో 12 లక్షల 54 వేల టన్నుల ఈ-వేస్ట్ ఉత్పత్తైంది. 2024–25లో ఈ పరిమాణం 13 లక్షల 98 వేల టన్నులకు చేరింది. అంటే ఒక్క ఏడాదిలోనే దాదాపు 11.5 శాతం పెరుగుదల కనిపించింది. మరోవైపు, 2024–25లో ఈ-వేస్ట్‌లో 70.71 శాతం సేకరణ, సపరేషన్ రీసైక్లింగ్ జరిగినట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే ఇదంతా పూర్తిగా రీసైకిల్ అయిందని అర్థం కాదు.
పాత మొబైళ్లు, కంప్యూటర్లు, టీవీలను సాధారణ చెత్తలో కలిపేస్తే వాటిలోని హానికర పదార్థాలు నేల, నీటిని కలుషితం చేసే ప్రమాదం ఉంది. బ్యాటరీలను నిర్లక్ష్యంగా పారవేయడం అగ్ని ప్రమాదాలకూ దారితీయొచ్చు. పనిచేసే వస్తువులను మళ్లీ వాడాలి పాడైనవాటిని రిపేర్ చేయించాలి.. పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులను గుర్తింపు పొందిన రీసైక్లర్లకు అప్పగించాలి.
పాత గ్యాడ్జెట్ పనికిరాని చెత్త కాదు! సరిగ్గా సేకరిస్తే విలువైన వనరు. బాధ్యతగా వినియోగిద్దాం.. సరైన పద్ధతిలో పారవేద్దాం.. ఈ-వేస్ట్ తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకుందాం!
Also read: కొత్త కలర్, సరికొత్త ఫీచర్లు.. MG విండ్సర్ EV కొత్త ఎడిషన్ వచ్చేసింది!