E-Paper
Advertisement

రోహిత్ వర్సెస్ వంశీ.. శాలిని పై నీతూ ఫైర్.. అసలేం జరుగుతోంది?

రోహిత్ వర్సెస్ వంశీ.. శాలిని పై నీతూ ఫైర్.. అసలేం జరుగుతోంది?
Advertisement

Bigg Boss 10:బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అప్పుడే ఐదు వారాలు పూర్తి చేసుకుంది. 5 వారాలకు గాను ఒక డబుల్ ఎలిమినేషన్, ఒక సెల్ఫ్ ఎలిమినేషన్ తో పాటు ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. అలా మొత్తం 6 మంది హౌస్ నుండి వెళ్ళిపోయారు. 5వ వారం ఏకంగా 5 మంది వైల్డ్ కార్డ్స్ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు వైల్డ్ ఫైర్ అంటూ హౌస్ లో జరుగుతున్న నామినేషన్ వార్ మరింత హీటెక్కింది. ఏకంగా శాలిని, వర్షిని గొడవ పడుతుంటే మధ్యలోకి రోహిత్ ఎంట్రీ ఇవ్వడం, ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలో రోహిత్ , వంశీ మధ్య గొడవ జరుగుతుంటే శాలిని, నీతూ ఎంటర్ అవ్వడం ఎపిసోడ్ పై ఆసక్తిని కలిగిస్తోంది.

ఓవరాక్షన్ ఆపు.. దేబ్జానీ పై రోహిత్ ఫైర్..

తాజాగా 37వ రోజుకు సంబంధించి రెండవ ప్రోమో ని నిర్వాహకులు విడుదల చేశారు. అందులో దేబ్జానీ , శాలినినీ నామినేట్ చేస్తూ.. నీ గేమ్ నువ్వు ఆడుతున్నావు కానీ వేరొక వ్యక్తి గేమ్ ను నువ్వు ఇంకా ఆడుతున్నావు.. గేమ్ లో కాన్సెంట్రేట్ చెయ్యి అంటూ నామినేట్ చేసింది. ఇక శాలిని మాట్లాడుతూ నీ నామినేషన్ లో పస ఎక్కడ ఉంది? అంటూ ప్రశ్నించగా.. దేబ్జానీ పస లేదు అమ్మ అంటూ వచ్చిరాని తెలుగులో చెబుతుంది. దీంతో రోహిత్ మధ్యలో కలుగజేసుకొని యాక్టింగ్ చేయడం ఆపు.. ఇంకా ఓవరాక్షన్ చెయ్యొద్దు అంటూ రోహిత్ అనడంతో.. దేబ్జానీ నా బెస్ట్ ఫ్రెండ్.. గుడ్డు.. అంటూ ఎక్స్ప్రెషన్ ఇచ్చి అక్కడ నుండి వెళ్లిపోయింది

కామనర్ అని టార్గెట్ చేస్తున్నారా – శాలిని

Advertisement

ఆ తర్వాత శాలిని శివ్ తో మాట్లాడుతూ.. కేవలం కామనర్స్ అని మీరందరూ అటాక్ చేస్తున్నారా? అని ప్రశ్నించగా.. శివ్ మాట్లాడుతూ… ఇక్కడ ఎవరూ కామనర్స్ లేరు. ఎవరు సెలబ్రిటీ లేదు.. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కంటెస్టెంటే అంటూ చెప్పాడు. ఇక శాలిని మాట్లాడుతూ..” నేను ప్రతి ఒక్క ఆటలో నా వంద శాతం ఎఫర్ట్ పెట్టానా లేదా అంటూ ప్రశ్నించింది. నాకు కనిపించలేదు అని శివ్ అంటే.. మీరు సరిగ్గా చూడలేదు అంటూ శాలిని కౌంటర్ వేసింది. ఇక తర్వాత శివ్ మాట్లాడుతూ మీరు సరిగ్గా ఆడలేదు కాబట్టే మేము చూడలేదు అంటూ తనదైన శైలిలో స్పందించారు.

also read:రామాయణ నుండి బిగ్ అప్డేట్.. జటాయువు పాత్రలో స్టార్ సెలబ్రిటీ!

వంశీ – రోహిత్ మధ్య కొట్టుకునేంత వార్..

Advertisement

వంశీ.. శాలినీ ని నామినేట్ చేస్తూ.. వీళ్లు అలా చేశారు.. వాళ్ళు ఇలా చేశారు అని చెప్పడం ఎందుకు అని అడుగుతుండగానే.. మీకు కళ్ళు కనిపించట్లేదు కదా అంటూ శాలిని రెచ్చిపోయింది. ఇక వంశీ మాట్లాడుతూ.. శాలినీకి దండం పెడుతూ ప్లీజ్ అమ్మ నువ్వు మాట్లాడకు అంటూ కామెంట్ చేశాడు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుపుకున్నట్లు అన్నిట్లోకి దూరేస్తాం అంటూ శాలినికి కౌంటర్ ఇచ్చారు. అయితే మధ్యలో రోహిత్ కలుగజేసుకొని వంశీతో ముందు మీరు మర్యాదగా మాట్లాడండి . ఆ తర్వాత మర్యాద ఎక్స్పెక్ట్ చేయండి అంటూ తనదైన శైలిలో మండిపడ్డారు. వంశీ మాట్లాడుతూ మనిషి ఉన్నప్పుడే నువ్వు ఇన్ని మాట్లాడుతుంటే.. మనిషి లేనప్పుడు నువ్వు ఇంకెన్ని మాట్లాడతావని అన్నాడు. రోహిత్ మాట్లాడుతూ.. రెండు వారాలు నువ్వు నోరు మూసుకొని కూర్చున్నావు అంటూ ఇద్దరూ ఒకరికొకరు వారించుకుంటూ కొట్టుకునే వరకు వెళ్లారు.

మనుషులంటే విలువ లేదంటూ శాలిని పై నీతూ ఫైర్..

వీళ్లు గొడవ పడుతుంటే.. నీతూ శాలినీని పిలుస్తుంది. శాలిని మిమ్మల్ని ఎవరండీ పిలిచింది అంటూ కాస్త చిరాకుగా పక్కకు వెళ్ళింది. ఇక నీతూ మాట్లాడుతూ .. అసలు నీకు మనుషులంటే విలువే లేదు అంటూ తన అభిప్రాయాన్ని చెప్పగా.. శాలిని మాత్రం నీకు క్రాక్ అంటూ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. దీంతో నీతూ మండిపడిపోయి.. నాకు క్రాక్ అంటావా అంటూ ఫైర్ అయ్యింది. అందటితో ఆగకుండా రోహిత్ ని తోసేసింది . ఇక మొత్తానికైతే ఈ ప్రోమో చూస్తుంటే నువ్వెంత అంటే నువ్వు ఎంత అన్నట్టు కంటెస్టెంట్స్ మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

 

Related News

కార్తీకదీపం 2 సీరియల్ లో జోత్స్న మిస్సింగ్… ఎందుకు తప్పుకున్నారో తెలుసా?

నువ్వింకా శీలవతివేనా.. అదిరిపోయే సమాధానం ఇచ్చిన వేణుస్వామి భార్య!

వేలల్లో సబ్స్క్రైబర్స్..లక్షల్లో సంపాదన.. విష్ణు ప్రియ నెల సంపాదన తెలిస్తే మతి పోవాల్సిందే!

నామినేషన్ హీట్ మధ్య నరేష్ రిలీఫ్ వర్డ్స్.. లవ్ స్టోరీ అదుర్స్?

నామినేషన్స్ లో పెద్ద గొడవ.. ఈ వారం వారికి రెడ్ కార్డ్ తప్పదా?

విడాకులు తీసుకున్న నవ్య స్వామి వదిన.. పోస్ట్ వైరల్!

Gundeninda GudiGantalu Today episode: ఇదేం ట్విస్ట్ స్వామి.. అడ్డంగా బుక్కయిన విల్లా విజయ్.. రోహిణికి షాక్..

Big Stories

Advertisement
×