E-Paper
Advertisement

మార్కెట్లోకి కొత్త సూపర్ కార్ ఎడిషన్ ఫోన్.. ఈ లుక్ చూస్తే ఐఫోన్ కూడా దిగదుడుపే!

మార్కెట్లోకి కొత్త సూపర్ కార్ ఎడిషన్ ఫోన్.. ఈ లుక్ చూస్తే ఐఫోన్ కూడా దిగదుడుపే!
Advertisement

Infinix Note 60 Pro: ఇన్ఫినిక్స్ తమ వినియోగదారులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ప్రముఖ ఇటాలియన్ లగ్జరీ కార్ డిజైన్ సంస్థ Pininfarina భాగస్వామ్యంతో సరికొత్త ‘ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో పినన్‌ఫరినా ఎడిషన్’ ను భారత్‌లో లాంచ్ చేసింది. ఏప్రిల్‌లో వచ్చిన స్టాండర్డ్ మోడల్‌కు ఇది ఒక స్పెషల్ రేసింగ్ కార్ లుక్ వర్షన్ అని చెప్పొచ్చు. స్పోర్ట్స్ కార్ల డిజైన్‌ను ఇష్టపడే వారికి ఈ ఫోన్ ఒక విజువల్ ట్రీట్.

రేసింగ్ కార్ లాంటి రాయల్ డిజైన్:

ఈ ఫోన్ వెనుక భాగంలో రేసింగ్ ట్రాక్‌లపై కనిపించే కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ ఇచ్చారు. ఫోన్ చుట్టూ ఉండే ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ దీనికి మంచి పట్టును, మన్నికను ఇస్తుంది. కెమెరా చుట్టూ, ఫోన్ అంచుల వెంబడి ఇచ్చిన ఎరుపు రంగు లైన్లు దీనికి పక్కా స్పోర్ట్స్ కార్ లుక్‌ని తీసుకొచ్చాయి. అన్నింటికంటే ముఖ్యంగా వెనుక వైపు నోటిఫికేషన్లు, టైమ్ చూసుకోవడానికి ఒక చిన్న సెకండరీ డిస్‌ప్లేను కూడా అమర్చడం విశేషం.

Advertisement

Also Read: బడ్జెట్ ధరలో గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్.. Samsung Galaxy M47 5G ఫీచర్లు చూశారా?

బాక్స్ తెరిస్తే లగ్జరీ ఫీలింగ్:

ఈ ఫోన్ అన్‌బాక్సింగ్ అనుభవం చాలా ప్రీమియంగా ఉంటుంది. బాక్స్‌లోనే టైప్-సి బ్రెయిడెడ్ కేబుల్, ఫాస్ట్ ఛార్జింగ్ బ్రిక్, ఒక మ్యాగ్‌ప్యాడ్ వైర్‌లెస్ ఛార్జర్, మాగ్నెటిక్ రింగ్ ఉన్న ఒక కేస్, కార్ డిజైన్‌తో కూడిన సిమ్ ఎజెక్టర్ టూల్ వంటి ఎన్నో యాక్సెసరీస్‌ను కంపెనీ ఉచితంగా అందిస్తోంది.

పవర్‌ఫుల్ ఫీచర్లు:

Advertisement

ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్ గల 6.78 ఇంచుల 1.5K అమోలెడ్ స్క్రీన్ ఉంది. ఇది ఎండలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16 సాఫ్ట్‌వేర్ ఉంది. రేసింగ్ థీమ్‌కు తగ్గట్టుగా లోపల ఐకాన్స్, వాల్‌పేపర్స్ అన్నీ ఎరుపు, నలుపు రంగుల్లో డిజైన్ చేశారు. ఇన్ఫినిక్స్ ఏఐ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇక 50MP ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ దీని సొంతం.

ధర, ఆఫర్ల వివరాలు:

సింగిల్ 8GB + 256GB వేరియంట్‌లో లభించే ఈ లిమిటెడ్ ఎడిషన్ ధర రూ.37,999గా ఉంది. జూన్ 29 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, ఇన్ఫినిక్స్ స్టోర్లలో ఇది అందుబాటులోకి వస్తుంది. లాంచ్ ఆఫర్ కింద ప్రముఖ బ్యాంక్ కార్డులపై లేదా ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.2,000 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు.

Also Read: Telegram మళ్లీ వచ్చేసింది.. కానీ, ఇలా చేస్తేనే పని చేస్తాది!

Related News

పిల్లల ఆన్‌లైన్ క్లాసులకు బెస్ట్..రూ.18 వేలలోపు అదిరిపోయే లెనోవా స్మార్ట్ ట్యాబ్!

రూ.1,100లోపే అదిరిపోయే స్మార్ట్‌వాచ్ డీల్..వెంటనే కొనేయండి

ఇండియాలో.. పోవా ఏఐ బడ్స్ ప్రో లాంచ్ డేట్ ఫిక్స్! ఫీచర్స్ మాములుగా లేవుగా..

మధ్యతరగతి కుటుంబాలకు పర్ఫెక్ట్ టీవీ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!

జియో బిగ్ ఆఫర్.. కొత్తగా రూ.550, రూ.2000 ప్లాన్లు.. ఫ్రీగా 15 ఓటీటీలు, 1000+ ఛానెళ్లు!

జస్ట్ రూ.2,000కే 4G ఫోన్లా? UPI, టైప్-సి ఛార్జింగ్‌తో లభించే టాప్ 5 ఆప్షన్లు ఇవే!

వర్షాకాలంలో ఫ్రిజ్ టెంపరేచర్ ఎంత ఉండాలి ? కరెంట్ ఆదా చేసే టిప్స్!

ఇయర్‌బడ్స్ వాడుతున్నారా? అయితే ఈ 5 సీక్రెట్ ట్రిక్స్ మీకు కచ్చితంగా తెలిసి ఉండాలి!

Big Stories

Advertisement
×