E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్.. Samsung Galaxy M47 5G ఫీచర్లు చూశారా?

బడ్జెట్ ధరలో గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్.. Samsung Galaxy M47 5G ఫీచర్లు చూశారా?
Advertisement

Samsung Galaxy M47 5G: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి శాంసంగ్ సరికొత్త మిడ్‌రేంజ్ ఫోన్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. ‘గెలాక్సీ M47 5G’ పేరుతో రానున్న ఈ మోడల్ జూన్ 29న ఇండియాలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ వేదికగా శాంసంగ్ అధికారికంగా ప్రకటించింది. గతంలో వచ్చిన M44 గ్లోబల్ మార్కెట్‌కే పరిమితం కాగా, ఇప్పుడు ఈ సిరీస్‌ను భారీ అప్‌డేట్స్‌తో భారత్‌లో విడుదల చేస్తుండటం విశేషం.

బైపాస్ ఛార్జింగ్ ఫీచర్:

ఈ సరికొత్త ఫోన్‌లో శాంసంగ్ స్నాప్‌డ్రాగన్ ప్రొసెసర్‌ను ఉపయోగించనుంది. దీనికి తోడు LPDDR5X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీలను ఇస్తుండటంతో మల్టీటాస్కింగ్, గేమింగ్ చాలా స్మూత్‌గా సాగుతాయి. అంతేకాదు.. దీనిలో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు ‘బైపాస్ ఛార్జింగ్’ ఫీచర్‌ను కూడా ఇస్తున్నారు. దీనివల్ల గేమ్స్ ఆడేటప్పుడు బ్యాటరీ వేడెక్కకుండా నేరుగా ఫోన్‌కు పవర్ అందుతుంది.

Advertisement

Also Read: Telegram మళ్లీ వచ్చేసింది.. కానీ, ఇలా చేస్తేనే పని చేస్తాది!

ఆరేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్:

మిడ్‌రేంజ్ విభాగంలో ఈ ఫోన్‌కు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్. గెలాక్సీ M47 5G కొనుగోలు చేసిన వారికి ఏకంగా 6 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్, 6 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. సుదీర్ఘ కాలం పాటు కొత్త ఫోన్ లాంటి ఫీలింగ్‌ను ఇది యూజర్లకు అందిస్తుంది.

డిస్‌ప్లే, కెమెరా అద్భుతం:

Advertisement

ఈ ఫోన్‌లో 120Hz రీఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఇస్తున్నారు. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా దీనిని డిజైన్ చేశారు. స్క్రీన్ రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ ఉంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనుక వైపు OIS సపోర్ట్ ఉన్న 50MP ప్రధాన కెమెరా, 5MP అల్ట్రావైడ్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ప్రత్యేకత ఏంటంటే.. ముందు, వెనుక కెమెరాలతో 4K వీడియోలను రికార్డ్ చేయవచ్చు.

ధర ఎంత ఉండొచ్చు?

రోగ్ రెడ్, బ్లేజ్ బ్లూ రంగుల్లో లభించే ఈ ఫోన్ ధరను శాంసంగ్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. మార్కెట్లో ఉన్న రెడ్‌మీ, రియల్‌మీ, ఐకూ, పోకో వంటి బ్రాండ్లకు గట్టిపోటీ ఇచ్చేలా దీని ధర ఉండే అవకాశం ఉంది. మంచి ఫీచర్లు, లాంగ్ టర్మ్ అప్‌డేట్స్ కోరుకునే వారు జూన్ 29 వరకు వేచి చూడటం మంచిది.

Also Read: రూ.లక్షన్నర పెట్టి Vivo X Fold 6 కొనాలా? 7000mAh బ్యాటరీతో వచ్చిన ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో అంతలా ఏముంది?

Related News

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

ఏఐ మోసాలకు చెక్ పెట్టే టెక్నాలజీ..గూగుల్,ఆపిల్ ఫోన్లలోని అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు!

వాట్సాప్‌లో.. ఈ 5 సెట్టింగ్‌లను పొరపాటున కూడా మరవొద్దు!

Big Stories

Advertisement
×