Samsung Galaxy Watch Ultra 2 review: టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి స్మార్ట్ వాచ్ మార్కెట్‌ను షేక్ చేయడానికి మరో అద్భుతమైన డివైజ్ వచ్చేసింది. అదే “శాంసంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా 2”. చూడటానికి చాలా రగ్గడ్ లుక్‌లో, భారీ సైజులో కనిపిస్తున్న ఈ వాచ్ కేవలం స్టైల్ కోసమే కాదు.. అడ్వెంచర్స్ చేసేవాళ్లకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. సాధారణ స్మార్ట్ వాచ్‌లకు భిన్నంగా ఇది ఎక్స్ ట్రీమ్ కండిషన్స్‌లో కూడా అద్భుతంగా పని చేస్తుంది. మరి ఈ కొత్త వాచ్ మనకు ఏమేం ఆఫర్ చేస్తోంది? దీని పని తీరు ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం!
స్మార్ట్‌వాచ్ రంగంలో శాంసంగ్ ఎప్పుడూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటూనే ఉంది. తాజాగా కంపెనీ విడుదల చేసిన ‘శాంసంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా 2’ టెక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బిగ్,బోల్డ్ ,ఎక్స్‌ట్రీమ్ డ్యూరబిలిటీ మెయింటైన్ చేసే ఈ వాచ్, ప్రీమియం గ్యాడ్జెట్స్ కోరుకునే వారికి మొదటి ఆప్షన్‌గా నిలుస్తోంది. మార్కెట్లో దీని డిజైన్, పని తీరుపై ఇప్పటికే చర్చ జరుగుతోంది.
డిజైన్, బిల్డ్ క్వాలిటీ:
ఈ వాచ్‌ను మొదటిసారి చేతికి పెట్టుకున్నప్పుడు దీని గ్రాండ్ లుక్ వెంటనే.. మన దృష్టిని ఆకర్షిస్తుంది.టైటానియం బాడీ , రౌండ్ కుషన్ డిజైన్‌తో ఇది చాలా స్ట్రాంగ్‌గా కనిపించడమే కాకుండా..చూడటానికి చాలా రాయల్‌గా ఉంటుంది. ఎక్స్‌ట్రీమ్ వర్కవుట్లు చేసేవారు, ఈత కొట్టేవాళ్ల కోసం ఇది పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. వాటర్ ,డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్లు ఉండటం వల్ల ఎంత కఠినమైన వాతావరణంలోనైనా దీనికి ఎలాంటి డ్యామేజ్ కాదు.
శాంసంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా 2లో అత్యంత అద్భుతమైన అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. మండుతున్న ఎండలో లేదా రాత్రి సమయంలో కూడా స్క్రీన్ పై ఉన్న అక్షరాలు, ఫిట్‌నెస్ డేటా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం బలమైన గ్లాస్ వాడటం వల్ల గీతలు పడే అవకాశం చాలా తక్కువ. నోటిఫికేషన్లు చదవడానికి, మ్యాప్స్ చూడటానికి ఈ పెద్ద డిస్‌ప్లే ఎంతగానో ఉపయోగ పడుతుంది.
ఇది కేవలం టైమ్ చూపే గడియారం మాత్రమే కాదు.. మన హెల్త్‌ను నిరంతరం పర్యవేక్షించే ఒక పర్సనల్ డాక్టర్ లా పని చేస్తుంది. హార్ట్ రేట్ మానిటరింగ్, ఈసీజీ , బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ , స్లీప్ క్వాలిటీని ఇది అత్యంత కచ్చితత్వంతో కొలుస్తుంది. రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్ దీనిలో ఉన్నాయి. మీరు చేసే.. ప్రతి వర్కవుట్ వివరాలను ఇది చాలా పర్ఫెక్ట్‌గా ట్రాక్ చేసి ఫోన్‌లోని యాప్‌కి సింక్ చేస్తుంది.
Also Read: ల్యాప్ టాప్ కొనే ఆలోచన ఉందా? ఇప్పుడే..కొనడం బెటర్
ఇలాంటి హెవీ స్మార్ట్ వాచ్‌లలో బ్యాటరీ బ్యాకప్ చాలా ముఖ్యం. శాంసంగ్ ఇందులో పవర్ ఫుల్ బ్యాటరీని అందించింది. సాధారణ మోడ్‌లో వాడితే ఇది ఈజీగా రెండు నుంచి మూడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల తక్కువ సమయంలోనే.. బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. దీని లోని లేటెస్ట్ ప్రాసెసర్ కారణంగా వాచ్ ఎక్కడా లాగ్ అవ్వకుండా చాలా స్మూత్‌గా పని చేస్తుంది.
మొత్తానికి.. శాంసంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా 2 అనేది సాధారణ యూజర్ల కంటే అడ్వెంచర్ లవర్స్, ఫిట్‌నెస్ ఫ్రీక్స్, టెక్ లవర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక అద్భుతమైన స్మార్ట్‌వాచ్. ధర కొంచెం ఎక్కువగా అనిపించినప్పటికీ.. ఇది అందించే ప్రీమియం ఫీచర్లు, రగ్గడ్ బిల్డ్ క్వాలిటీ దానికి పూర్తిగా న్యాయం చేస్తాయి. మీ చేతికి ఒక బోల్డ్ , స్టైలిష్ లుక్ రావాలంటే ఈ గెలాక్సీ వాచ్ అల్ట్రా 2 బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు!