BigTV English

iPhone 17: ఇండియాలో ఐఫోన్ 17 అమ్మకాలు.. యాపిల్ స్టోర్ల వద్ద క్యూలైన్, యువకుల మధ్య ఫైటింగ్

iPhone 17: ఇండియాలో ఐఫోన్ 17 అమ్మకాలు.. యాపిల్ స్టోర్ల వద్ద క్యూలైన్, యువకుల మధ్య ఫైటింగ్

iPhone 17: ఐఫోన్ అంటే యువతకు మహా పిచ్చి. వాటికి సంబంధించి కొత్తగా ఈ సిరీస్ వచ్చినా ఆ ఫోన్లను సొంతం చేసుకునేందుకు యువత ఎగబడుతోంది. తాజాగా శుక్రవారం అనగా సెప్టెంబర్ 19 నుంచి ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల అమ్మకాలు దేశంలో మొదలయ్యాయి. వాటిని సొంతం చేసుకునేందుకు అర్థరాత్రి నుంచి యువత యాపిల్ స్టోర్ల వద్ద పడిగాపులు కాసింది. ఫలితంగా యువత మధ్య ఫైటింగ్ కు దాని తీసింది.


యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నయాపిల్ కంపెనీకి సంబంధించి ఐఫోన్-17 సిరీస్ ఫోన్ల అమ్మకాలు దేశంలో మొదలయ్యాయి. కొత్త ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు యువత భారీగా ఎగబడ్డారు. దేశంలోని ప్రధాన నగరాల్లోని యాపిల్ స్టోర్ల వద్ద అర్థరాత్రి నుంచి మొబైల్ లవర్స్ బారులు తీరారు.

ముఖ్యంగా ముంబైలోని బీకేసీ యాపిల్ స్టోర్ వద్ద వినియోగదారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు ముష్టిఘాతాలకు దిగారు. చివరకు పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. చివరకు జ‌నాల‌ను చెదరగొట్టారు. ఈ ఘటనకు కారణమైన కొందన్ని అదుపులోకి తీసుకున్నారు.


ఐఫోన్ అమ్మకాల విషయంలో నిర్వాహకులు ఏర్పాట్లు సరిగా చేయలేకపోవడం వల్ల గందరగోళానికి దారి తీసిందని అంటున్నారు. ఎవరికీ గాయాలు కానప్పటికీ చాలా మంది కస్టమర్లు నిరాశ వ్యక్తం చేశారు. ఆపిల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించినప్పటికీ, ముంబై స్టోర్ వద్ద జరిగిన ఘర్షణను నివారించడంతో విఫలమైందని కొందరు ఎత్తి చూపారు. నిర్వాహకులు ఎలాంటి ఏర్పాటు చేయకపోవడంపై పెదవి విరిస్తున్నారు.

ALSO READ: 1700 కిలోమీటర్ల దూరంగా ఉన్న శిశువుకు ఆన్ లైన్‌లో సర్జరీ చేసిన డాక్టర్లు

శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ఐఫోన్ 17 అమ్మకాలు ప్రారంభమయ్యాయి. యాపిల్ స్టోర్ల వద్ద గురువారం రాత్రి నుంచే వందలాది మంది క్యూ కట్టారు. కొత్తగా విడుదలైన ఐఫోన్-17 ప్రో మ్యాక్స్ ఆరెంజ్ కలర్‌కు విపరీతమైన క్రేజ్ యువతలో కనిపించింది. ఈ కలర్ కోసమే గంటల తరబడి లైన్లో ఉండాల్సి వచ్చిందని చెబుతున్నారు.

ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఎయిర్‌ పాడ్స్ 3, వాచ్ సిరీస్ 11, వాచ్ SE3, వాచ్ అల్ట్రా 3 వంటివి ఉన్నాయి. సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు మొదలుకాగా, భారత్‌లో 10 రోజులు ఆలస్యంగా అమ్మకాలు మొదలయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో యాపిల్ స్టోర్ల వద్ద మొబైల్ లవర్స్ బారులు తీరారు. ఐఫోన్ 17 సిరీస్ ధర రూ. 82,900 నుంచి రూ. 2,29,900 మధ్య ఉంది.

 

Related News

Youngest Telesurgery: అద్భుతం.. 1700 కిమీల దూరంలో ఉన్న శిశువుకు ఆన్‌లైన్‌లో సర్జరీ చేసిన డాక్టర్.. అదెలా?

Meta Ray Ban Glasses: మెటా రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్ లాంచ్.. చేతి వేళ్లతోనే కెమెరా కంట్రోల్

Flipkart Amazon Scam: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్ పేరుతో సైబర్ స్కామ్.. ఈ జాగ్రత్తలు పాటించండి

Airbags For Planes: విమానాలకు కూడా ఎయిర్ బ్యాగ్స్.. ఇక ప్లేన్ క్రాష్ లు ఉండవా?

ThumbPay: ఫోన్ పే, గూగుల్ పే కంటే వేగంగా చెల్లింపులు.. కేవలం వేలిముద్ర వేస్తే చాలు

Redmi 15R: కేవలం రూ.15000 ధరలో 6.9 ఇంచ్ డిస్‌ప్లే.. రెడ్‌మి కొత్త ఫోన్ అదరహో

iOS 26 Battery drain: ఐఫోన్ లో కొత్తగా బ్యాటరీ సమస్యలు.. కారణం ఇదే

Big Stories

×