AI Karaoke Speakers: పార్టీ అంటే మ్యూజిక్.. మ్యూజిక్ అంటే ఫుల్ ఎంజాయ్‌మెంట్. ఇలాంటి మ్యూజిక్ లవర్స్ కోసం ప్రముఖ ఆడియో బ్రాండ్ JBL భారత మార్కెట్లోకి సరికొత్త పార్టీబాక్స్ స్పీకర్లను లాంచ్ చేసింది. మొత్తం ఆరు పవర్‌ఫుల్ స్పీకర్లతో పాటు ప్రత్యేక ఈజీసింగ్ మైక్రోఫోన్‌ను కూడా తీసుకొచ్చింది. అదిరిపోయే సౌండ్, గంటల తరబడి ప్లేబ్యాక్ ఇచ్చే బ్యాటరీ, రంగుల లైటింగ్‌తో పాటు ఏఐ ఆధారిత కరోకే ఫీచర్లు ఈ కొత్త JBL PartyBox లైనప్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఇంట్లో పార్టీ అయినా, అవుట్‌డోర్ ఈవెంట్ అయినా.. మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లేలా ఈ కొత్త స్పీకర్లు వచ్చేశాయి.
ఈ కొత్త లైనప్‌లో విభిన్న బడ్జెట్లకు తగ్గట్టుగా మోడళ్లను రూపొందించారు. అత్యంత ప్రీమియం మోడల్ పార్టీబాక్స్ 720 ధర రూ.99,999 కాగా.. పార్టీబాక్స్ 330 ధర రూ.64,999గా నిర్ణయించారు. అలాగే పార్టీబాక్స్ 130 మోడల్ రూ.46,999కి లభిస్తోంది. ఆన్-ది-గో 2 ప్లస్ వేరియంట్ రూ.44,999 ధరకు, ఆన్-ది-గో 2, ఎన్‌కోర్ 2 ప్లస్ మోడళ్లు రెండూ ఒక్కొక్కటి రూ.39,999 ధరకు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆఫీషియల్ జేబీఎల్ వెబ్‌సైట్, ఈ-కామర్స్ సైట్లు, ప్రముఖ రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Also Read: ఫోన్ అప్‌డేట్ చేయకపోతే వాట్సప్ గోవిందా.. సీక్రెట్‌గా టెస్టింగ్ మొదలుపెట్టిన మెటా సంస్థ!
ఈ సిరీస్‌లోనే టాప్ మోడల్ అయిన పార్టీబాక్స్ 720 ఏకంగా 800 వాట్ల అవుట్‌పుట్‌తో భారీ సౌండ్ ఇస్తుంది. దీనిలో రెండు 9 ఇంచుల వూఫర్లు, 30 ఎమ్ఎమ్ ట్వీటర్లు ఉంటాయి. మోసుకెళ్లడానికి చక్రాలు, హ్యాండిల్ కూడా ఇచ్చారు. ఇక పార్టీబాక్స్ 330 మోడల్ 280 వాట్ల అవుట్‌పుట్‌తో 18 గంటల వరకు, పార్టీబాక్స్ 130 మోడల్ 200 వాట్ల అవుట్‌పుట్‌తో 15 గంటల వరకు నాన్-స్టాప్ ప్లేబ్యాక్ అందిస్తాయి. గిటార్, మైక్ కనెక్ట్ చేయడానికి ఎక్స్‌ఎల్ఆర్ పోర్టులు, గాలివాన నుంచి రక్షణ కోసం ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి.
ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లేలా ఆన్-ది-గో 2 సిరీస్, ఎన్‌కోర్ 2 ప్లస్ మోడళ్లు వచ్చాయి. ఇవి 100 వాట్ల ఆడియో అవుట్‌పుట్‌ను, 15 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయి. పాటల మ్యూజిక్‌కు తగ్గట్టు మారే లైటింగ్, మైక్, గిటార్ ఇన్ పుట్ పోర్టులు వీటిలో ఉన్నాయి. రీఛార్జ్ చేసుకోవడానికి వీలుగా మార్చుకోగలిగే బ్యాటరీలు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా వీటి ప్రధాన విశేషాలు.
సింగింగ్ ఇష్టపడే వారి కోసం ఈజీసింగ్ మైక్రోఫోన్లను పరిచయం చేశారు. ఏఐ ఆధారిత టెక్నాలజీతో పనిచేసే ఈ మైక్స్ ద్వారా పాటల్లోని వాయిస్‌ను తీసివేసి కేవలం ట్రాక్ మాత్రమే ప్లే చేసుకోవచ్చు. అంతేకాకుండా వాయిస్ బూస్ట్, ఎకో కంట్రోల్, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ తగ్గించే ఫీచర్లు ఉన్నాయి. ఈ మైక్స్ 10 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తాయి. పాటలు పాడుతూ ఎంజాయ్ చేసే వారికి ఇవి గొప్ప అనుభూతినిస్తాయి.
Also Read: అమెజాన్ పండగు సేల్ షురూ.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై కళ్లుచేదిరే డిస్కౌంట్లు!