E-Paper
Advertisement

సౌత్ ఇండియన్ కాశ్మీర్ ‘మున్నార్’.. హైదరాబాద్ నుంచి ఈ హిల్ స్టేషన్ కు వెళ్లాలంటే?

సౌత్ ఇండియన్ కాశ్మీర్ ‘మున్నార్’.. హైదరాబాద్ నుంచి ఈ హిల్ స్టేషన్ కు వెళ్లాలంటే?
Advertisement

Munnar Travel Guide 2026:  ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి కేరళలోని మున్నార్ అద్భుతమైన పర్యాటక కేంద్రం. పచ్చని తేయాకు తోటలు, పొగమంచుతో కప్పబడిన కొండలు, అందమైన జలపాతాలు, చల్లని వాతావరణం కారణంగా ఈ ప్రాంతాన్ని సౌత్ ఇండియన్ కాశ్మీర్ గా పిలుస్తున్నారు. ఏడాదంటా పర్యాటకులను ఆకర్షించే ఈ హిల్ స్టేషన్, కుటుంబంతో, స్నేహితులతో విహారయాత్రకు వెళ్లాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.సముద్ర మట్టానికి సుమారు 1,600 మీటర్ల ఎత్తులో ఉన్న మున్నార్, ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రఫీ అభిమానులు, ట్రెక్కింగ్ ఇష్టపడేవారికి మంచి ఎక్స్ పీరియెన్స్ అందిస్తోంది.

మున్నార్‌ లో చూడాల్సిన ప్రదేశాలు

మున్నార్‌కు వెళ్లిన వారు తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాల్లో మొదటగా తేయాకు తోటలే ఉంటాయి. కొండలంతా పచ్చగా పరుచుకున్న టీ గార్డెన్స్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. టీ ప్రియులు టీ మ్యూజియంను సందర్శించి టీ తయారీ ప్రక్రియను తెలుసుకోవచ్చు. అక్కడే తాజాగా తయారైన టీని తాగే అవకాశం ఉంటుంది.

Advertisement

వన్యప్రాణులను ఇష్టపడేవారు ఎరవికులం నేషనల్ పార్క్ తప్పక చూడాలి. అరుదైన నీలగిరి తహర్ జంతువుకు ఇది ప్రధాన నివాస ప్రాంతం. అలాగే టాప్ స్టేషన్, ఎకో పాయింట్, మట్టుపెట్టి డ్యామ్, అట్టుకాడ్ జలపాతం, లక్కం జలపాతం, చీయప్పర జలపాతం, కుండల సరస్సు లాంటి ప్రాంతాలు కూడా ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటాయి. మున్నార్‌లో మరో ప్రత్యేక ఆకర్షణ నీలకురింజి పువ్వులు. ఇవి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూస్తాయి. ఆ సమయంలో కొండలన్నీ నీలం, ఊదా రంగులతో కళకళలాడుతూ అద్భుతంగా ఆకట్టుకుంటాయి.

ఈ ఫుడ్ తప్పకుండా టేస్ట్ చేయండి!  

మున్నార్‌కు వెళ్లినప్పుడు కేరళ సంప్రదాయ వంటకాలను తప్పకుండా ఆస్వాదించాలి. కేరళ సద్య, అప్పం స్టూ, మలబార్ పరోటా, స్థానిక మసాలా కూరలు, తాజాగా తయారైన టీ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. తిరిగి వచ్చే సమయంలో అక్కడి మసాలా దినుసులు, హోమ్‌ మేడ్ చాక్లెట్లు, అరటిపండు చిప్స్ వంటి వస్తువులను కొని తెచ్చుకోవచ్చు.

ఎక్కడ స్టే చేయాలంటే?   

Advertisement

మున్నార్‌ లో బడ్జెట్‌ కు తగ్గట్టుగా వసతి లభిస్తుంది. లగ్జరీ రిసార్ట్‌ లు, టీ తోటల మధ్య ఉన్న కాటేజీలు, బడ్జెట్ హోటళ్లు, హోమ్‌ స్టేలు, గెస్ట్ హౌస్‌ లు అందుబాటులో ఉంటాయి. వీకెండ్, హాలీడేస్ లో ఎక్కువ రద్దీ ఉండే అవకాశం ఉంటుంది. అందుకే, ముందుగానే బుకింగ్ చేసుకోవడం మంచిది.

హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?

విమానంలో వెళ్లాలనుకుంటే, హైదరాబాద్ నుంచి కొచ్చికి విమానంలో వెళ్లొచ్చు. అక్కడి నుంచి మున్నార్‌కు సుమారు 125 కిలోమీటర్లు. టాక్సీ, బస్సులో దాదాపు నాలుగు గంటల్లో చేరుకోవచ్చు. రైల్లో వెళ్లాలనుకుంటే.. ఎర్నాకులం, అలువ వరకు రైలులో వెళ్లి, అక్కడి నుంచి బస్సు, టాక్సీలో మున్నార్ చేరుకోవచ్చు.రోడ్డు మార్గంలో అయితే, హైదరాబాద్ నుంచి మున్నార్ దూరం సుమారు 900 నుంచి 950 కిలోమీటర్లు. సొంత వాహనంలో ప్రయాణిస్తే సుమారు 15 నుంచి 17 గంటలు పడుతుంది.

Read Also: మాన్సూన్ గోవా ట్రిప్.. అస్సలు మిస్ కాకూడని 7 క్రేజీ స్పాట్స్ ఇవే!

Related News

అక్కడ హోటళ్లకు ఉద్యోగులు దొరక్క.. రోబోలతో పని కానిచ్చేస్తున్నారు!

కక్కుర్తిగాళ్ల చేతివాటం.. బెడ్ రోల్స్ నొక్కేయడం వల్ల రైల్వేకు ఎన్ని కోట్ల నష్టమో తెలుసా?

ఇప్పుడంటే బిర్యానీ ఫేమస్.. పూర్వం హైదరాబాదీలు ఇష్టంగా తిన్న ఫుడ్ ఏది? మీ ఊహకు సైతం అందదు!

నల్లగొండలో ఆర్జాలబావి.. ఈ పేరు వెనుక ఇంత ఆసక్తికరమైన చరిత్ర ఉందా?

మాన్సూన్ గోవా ట్రిప్.. అస్సలు మిస్ కాకూడని 7 క్రేజీ స్పాట్స్ ఇవే!

వర్షాకాలంలో మేఘాలయకు వెళ్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

ఇండియన్ బుల్లెట్ రైలు లాంచ్ డేట్ ఫిక్స్.. స్పీడ్ ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×