Jio New Router: రిలయన్స్ జియో దేశీయ మార్కెట్లోకి కొత్తగా ‘ఏఎక్స్ 3000 మెష్ రూటర్’ (AX3000 Mesh Router) ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో వచ్చిన AX6000 డిజైన్‌లోనే కనిపిస్తున్న ఈ కొత్త రూటర్.. దానికంటే తక్కువ ధరకే లభించనుంది. ప్రస్తుతం ఈ రూటర్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో పాటు జియోమార్ట్ (JioMart) అధికారిక వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్‌లో వేగవంతమైన వైఫై కావాలనుకునే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని జియో వర్గాలు పేర్కొంటున్నాయి.
భారత మార్కెట్లో జియో AX3000 మెష్ రూటర్ ప్రారంభ ధరను రూ.3,799 గా నిర్ణయించారు. అమెజాన్ పే, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి కొనుగోలు చేసే వారికి ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తున్నారు.
ఈ రూటర్.. నెట్‌వర్క్ కవరేజ్ పరంగా దాదాపు 1500 చదరపు అడుగుల ప్రాంతాన్ని సులభంగా కవర్ చేయగలదని జియో పేర్కొంది. వైఫై 6 (Wi-Fi 6) సపోర్ట్ తో వచ్చే ఈ డివైజ్.. 2.4 GHz, 5 GHz డ్యూయల్ బ్యాండులపై పనిచేయనుంది. ఇంటర్నెట్ వేగం తగ్గకుండా ఒకేసారి 100కి పైగా పరికరాలను (100+ devices) దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ గేమింగ్, హెచ్‌డీ స్ట్రీమింగ్ ప్రియులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.
డేటా రక్షణ కోసం ఇందులో డబ్ల్యూపీఏ3 (WPA3) అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీని అందించారు. దీనిలోని ‘పేరెంటల్ కంట్రోల్స్’ సాయంతో పిల్లలు చూసే కంటెంట్‌ను, పరికరాల యాక్సెస్‌ను తేలిగ్గా పర్యవేక్షించవచ్చు. ఈ రూటర్ కేవలం జియో ఫైబర్‌కే పరిమితం కాకుండా ఎయిర్‌టెల్ వంటి ఇతర ప్రముఖ టెలికాం ఆపరేటర్ల ఫైబర్ కనెక్షన్లతో కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
Also Read: బిగ్ టీవీ లోగోతో ‘DIG’ దందా.. సీఎం ఫ్యామిలీపై ఫేక్ ప్రచారం.. బీఆర్ఎస్ బడా నేత గుట్టురట్టు!
మరోవైపు జియోహోమ్ (JioHome) యాప్ ద్వారా ఈ రూటర్‌ను నిమిషాల్లో సెటప్ చేసుకోవచ్చు. వైఫై పాస్‌వర్డ్ మార్చడం, కనెక్ట్ అయిన డివైజ్‌లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వంటి ఫీచర్లను ఈ యాప్ ద్వారా సులభంగా చేయవచ్చు. కాగా జియో ఇటీవలే తక్కువ ధరకే ఒక కొత్త వైఫై ఎక్స్‌టెండర్‌ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ‘ఏఎక్స్ 3000 మెష్ రూటర్’ లాంచ్ చేయడం గమనార్హం.
Also Read: Airtel బంపరాఫర్.. ప్రతీ సిమ్‌పై ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్.. విదేశాలకు వెళ్లేవారికి పండగే!