Fake Accounts: సోషల్ మీడియాలో నకిలీ బతుకుల హవా నడుస్తోంది. ఫేక్ అకౌంట్లతో గలీజు దందా చేస్తున్న ఈ గబ్బు బతుకులపై బిగ్ టీవీ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నకిలీ అకౌంట్లు మెుత్తం దుబాయి నుంచి నడుస్తున్నాయన్న సంచలన విషయం బయటపడింది. సోషల్ మీడియాలో కాలకేయులను వదిలిన ఓ బీఆర్ఎస్ బడా నేత.. చివరికి బిగ్ టీవీ లోగోను సైతం వదల్లేదు. బిగ్ టీవీని లోగోను కాపీ కొట్టి సోషల్ మీడియాలో ఏకంగా ఓ పెరడీ ఖాతానే ఓపెన్ చేశారు. దాని ద్వారా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఫేక్ ప్రచారాన్ని మెుదలు పెట్టారు.
డిగ్ టీవీ పేరడీ (DIG TV Parody) పేరుతో నడుస్తున్న బీఆర్ఎస్ ఫండెండ్ ఖాతా నుంచి సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా సంచలన పోస్ట్ వెలువడింది. ‘నువ్వు సీఎంవేనా? కూతురు వ్యాపారాలు బయటకు రాకుండా చూడలేవా? సీఎంగా ఎలా ఉన్నావ్’ అంటూ రేవంత్ రెడ్డి భార్య గీత ఫైర్ అయినట్లుగా డిగ్ టీవీ పోస్ట్ పెట్టింది. దీంతో తననే అంత మాట అంటావా? అంటూ భార్యపై రేవంత్ చేయిచేసుకోబోయారని పోస్ట్ లో రాసుకొచ్చింది. ఈ సమయంలో కూతురు నైమిశ రెడ్డి, అల్లుడు సత్యనారాయణ రెడ్డి అడ్డుకోగా.. ఇదంతా మీ వల్లే జరిగిందంటూ రేవంత్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారని అబద్దపు ప్రచారానికి ఆజ్యం పోసింది.
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨
నువ్వు సీఎంవేనా..? రేవంత్ ఇంట్లో ఫ్యామిలీ పంచాయితీ
కూతురు వ్యాపారాలు బయటకు రాకుండా చూడలేవా.. సీఎంగా ఎలా ఉన్నావంటూ రేవంత్ రెడ్డిపై భార్య గీత ఆగ్రహం
నన్నే అంత మాట అంటావా అంటూ భార్యపై చేయి చేసుకోబోయిన రేవంత్‌ను అడ్డుకున్న కూతురు నైమిశ రెడ్డి, అల్లుడు సత్యనారాయణ రెడ్డి
అంతా మీ వల్లే అంటూ కూతురు, అల్లుడిపై రేవంత్ ఆగ్రహం
— DIG TV Parody (@DigtvTelugu) October 6, 2026
అయితే ‘డిగ్ టీవీ పేరడీ’ ఖాతా నిజస్వరూపాన్ని, దాని వెనకున్న బీఆర్ఎస్ మూలాలను బిగ్ టీవీ బట్టబయలు చేయడంతో సదరు ఖాతా నిర్వాహకుల్లో టెన్షన్ మెుదలైంది. దీంతో బిగ్ టీవీపై ఎక్స్ వేదికగా ఆ ఖాతా విషం చిమ్మింది. అయితే ఇక్కడ బిగ్ టీవీ ఒక విషయాన్ని సదరు ఖాతా నిర్వాహకులు, వారి వెనుక ఉన్న బీఆర్ఎస్ బడా నేతకు స్పష్టంగా చెప్పదలుచుకుంది. తాము అధికార పార్టీ సహా ఏ పార్టీకి కొమ్ముకాసే ప్రసక్తే లేదు. ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను, విధానాలను, ప్రజాసమస్యలను నిర్భయంగా ప్రసారం చేయడంలో బిగ్ టీవీ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను బిగ్ టీవీ వరుస కథనాల ద్వారా ప్రజల ముందు ఉంచుతోంది. ప్రభుత్వ అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగడుతోంది. అటువంటి బిగ్ టీవీని కూడా పేరడి చేస్తూ సోషల్ మీడియా ఖాతాతో విషం చిమ్మడం ప్రజలు ఏమాత్రం స్వాగతించరన్న విషయాన్ని ఖాతాదారులు గుర్తుంచుకోవాలి. నకిలీ ఖాతాలో తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల విపక్ష పార్టీకే చెడ్డపేరు తీసుకొస్తుందని అర్థం చేసుకోవాలి.
సోషల్ మీడియా ఖాతాల్లో మహిళలను అవమానించేలా పోస్టులు పెట్టడం, నాయకులకు సంబంధాలు అంటగట్టడం, ఏదో ఉందన్నట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయించడం అది ఎవరు చేసినా తప్పే. మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తున్న పార్టీ.. ఈ రకమైన విష ప్రచారాలను నెట్టింట ప్రోత్సహిస్తే ప్రజలు ఏమాత్రం హర్షించరు. నేతల వ్యక్తిగత జీవితాలపై ఫేక్ ప్రచారంతో బురద చల్లడం వల్ల ప్రజలకు ఎలాంటి లాభం ఉండదని సదరు పార్టీ తెలుసుకోవాలి. అధికార పార్టీ ప్రజా సమస్యలపై ఇచ్చిన హామీలను లేవనెత్తితే ప్రజలు హర్షిస్తారన్న విషయాన్ని విపక్ష పార్టీ గుర్తిస్తే మంచిది. అది కూడా ప్రజల పక్షాన నిలబడ్డ బిగ్ టీవీని డీఫేమ్ చేసేలా నకిలీ ఖాతాను సృష్టించి.. తప్పుడు ప్రచారాలు చేయడం అస్సలు వర్కౌట్ కాదన్న విషయాన్ని ప్రతిపక్ష పార్టీ గుర్తించాలి.
Also Read: అధికారం పోయాక హీరోయిన్లను కూడా వదల్లేదు.. బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు బట్టబయలు: దయాకర్ గౌడ్