E-Paper
Advertisement

జియో చౌకైన 5G ప్లాన్.. దీనిని కొట్టేదే లేదు.. ఓటీటీ, కాల్స్, ఏఐ సేవలు అన్నీ ఫ్రీ!

జియో చౌకైన 5G ప్లాన్.. దీనిని కొట్టేదే లేదు.. ఓటీటీ, కాల్స్, ఏఐ సేవలు అన్నీ ఫ్రీ!
Advertisement

Jio Rs 859 Plan: దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. తన ప్రీపెయిడ్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను తీసుకొస్తూ ఉంటుంది. ముఖ్యంగా 84 వ్యాలిడిటీ విభాగంలో జియో తీసుకొచ్చిన రూ.859 ప్లాన్.. ప్రస్తుతం యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. జియోలో 3 నెలల వ్యాలిడిటీతో అపరిమిత 5G అందిస్తున్న చౌకైన ప్లాన్ ఇదేనని జియో వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు కస్టమర్ల నుంచి కూడా ఇది పక్కా ఆల్ రౌండర్ ప్లాన్ గా గుర్తింపు సంపాదించింది. ఈ నేపథ్యంలో ఈ ప్లాన్ కు సంబంధించి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఫ్రీ కాల్స్, ప్రతీ రోజూ 2GB డేటా

ఈ రూ. 859 ప్లాన్ రీఛార్జ్ చేసుకునే యూజర్లకు ప్రతీ రోజూ 2GB డేటా లభించనుంది. అంటే 84 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 168GB 4G డేటా పొందొచ్చు. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే ప్రతిరోజూ 100 ఉచిత SMSలు కూడా ఈ ప్లాన్‌లో భాగంగా అందించనున్నారు.

అన్‌లిమిటెడ్ 5G డేటా

Advertisement

ఈ ప్లాన్ కిందనే జియో ఉచితంగా అపరిమిత 5G డేటాను ఆఫర్ చేస్తోంది. రోజువారీ 2GB లేదా అంతకంటే ఎక్కువ డేటా ప్లాన్లతో రీఛార్జ్ చేసుకునే వారికి మాత్రమే ఉచిత 5G సేవలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి రూ. 859 ప్లాన్ పై వినియోగదారులు అన్‌లిమిటెడ్ 5G డేటాను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా వినియోగించుకోవచ్చు. అయితే మీ ఏరియాలో జియో 5G సేవలు అందుబాటులో ఉండి.. మీ స్మార్ట్ ఫోన్ కూడా 5G అయ్యుంటే ఈ సేవలను పొందొచ్చు.

Also Read: అమిత్ షా పర్యటన వేళ.. అరుణాచలంలో తీవ్ర కలకలం.. హైదరాబాద్ యువకులు అరెస్ట్!

ఉచితంగా ఓటీటీ, ఏఐ యాక్సెస్

Advertisement

రూ.859 ప్లాన్.. డేటా, కాలింగ్‌కే పరిమితం కాకుండా మరికొన్ని అడిషనల్ బెనిఫిట్స్ ను అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లకు 3 నెలల పాటు హాట్ స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ లభించనుంది. అలాగే రూ. 35,100 విలువైన గూగుల్ జెమిని ఏఐ ప్రో యాక్సెస్ 18 నెలల పాటు ఉచితంగా లభిస్తుంది. అలాగే జియో ఏఐ క్లౌడ్ కింద 50GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ అందనుంది. మెుత్తంగా ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో పాటు అపరిమిత 5G, ఫ్రీ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ కోరుకునేవారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ గా నిలవనుంది.

Also Read: భారత్‌కు అమెరికా బిగ్ షాక్.. రష్యా నుంచి చమురు కొంటే 100% ట్యాక్స్.. బిల్లుకు సెనేట్ ఆమోదం!

Tags

Related News

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

Big Stories

Advertisement
×