E-Paper
Advertisement

Airtelలో ఇంత మంచి ప్లాన్ ఉందా? ఏడాదంతా అపరిమిత 5G, కాల్స్, ఫ్రీ ఓటీటీ.. వర్త్ వర్మా వర్త్!

Airtelలో ఇంత మంచి ప్లాన్ ఉందా? ఏడాదంతా అపరిమిత 5G, కాల్స్, ఫ్రీ ఓటీటీ.. వర్త్ వర్మా వర్త్!
Advertisement

Airtel Annual Plan: దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లతో తన యూజర్లకు సర్ ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది. నాణ్యమైన కాల్స్, వేగవంతమైన డేటాకు కేరాఫ్ గా ఎయిర్ టెల్ నిలుస్తోందంటూ కస్టమర్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే రతినెలా రీఛార్జ్ చేసుకునే తిప్పలు లేకుండా ఒకే రీఛార్జ్‌తో ఏడాది పొడవునా అపరిమిత సేవలు పొందాలనుకునే వారి కోసం ఎయిర్‌టెల్ రూ. 3,999 అందుబాటులో ఉంచింది. ఈ ప్లాన్ కింద భారీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లను ఉచితంగా అందిస్తోంది.

రూ.3,999 ప్లాన్ వివరాలు..

ఎయిర్‌టెల్ ఈ రూ. 3,999 రీఛార్జ్ ప్లాన్ ను 365 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద వినియోగదారులకు ప్రతిరోజూ 2.5 GB హై స్పీడ్ డేటా లభించనుది. ఒకవేళ రోజూవారి డేటా లిమిట్ అయిపోతే 64 kbps వేగంతో ఇంటర్నెట్ ను అపరిమితంగా వాడుకోవచ్చని ఎయిర్ టెల్ వర్గాలు చెబుతున్నాయి. ఇక దీంతో పాటు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత లోకల్, ఎస్‌టీడీ, రోమింగ్ ఉచిత వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌ల ఫ్రీగా పంపుకోవచ్చు.

ఫ్రీ హాట్‌స్టార్, అన్‌లిమిటెడ్ 5G

Advertisement

ఈ ప్లాన్ లో అడిషనల్ బెనిఫిట్స్ కింద అనేక ఫ్రీ సబ్ స్క్రిప్షన్లను ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తోంది. ఈ రూ.3,999 రీఛార్జ్‌తో వినియోగదారులు 1 సంవత్సరం పాటు ఉచితంగా డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందొచ్చు. మీ ప్రాంతంలో ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్ సదుపాయం ఉండి.. మీ వద్ద 5G స్మార్ట్‌ఫోన్ ఉంటే అపరిమిత 5G డేటాను ఉచితంగా వినియోగించుకోవచ్చు. వీటితో పాటు ‘ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే’ యాక్సెస్, ఉచిత హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్ సభ్యత్వం లభిస్తాయి.

ఈ ప్లాన్ ఎవరికి ఎక్కువ లాభం?

ప్రతినెలా రీఛార్జ్ డేట్ గుర్తుపెట్టుకోవడం కష్టంగా భావించేవారికి ఈ వార్షిక ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు, రోజువారీ ఇంటర్నెట్ వినియోగం ఎక్కువగా ఉండే విద్యార్థులు, లైవ్ క్రికెట్ మ్యాచ్‌లు, సినిమాలు ఓటీటీలో ఎక్కువగా చూసేవారికి ఈ ప్లాన్ బెస్ట్. అంతేకాకుండా 5G స్మార్ట్‌ఫోన్ ఉండి, మీ ఏరియాలో ఎయిర్ టెల్ 5G నెట్ వర్క్ ఉన్నవారికి పరిమిత డేటాను వాడుకునే వెసులుబాటు ఎయిర్ టెల్ కల్పిస్తోంది.

Advertisement

Also Read: మందుబాబులకు బిగ్ షాక్.. బోనాల వేళ వైన్ షాపులు క్లోజ్.. ఆ రెండ్రోజులు చుక్క లేనట్లే!

ఎలా రీఛార్జ్ చేసుకోవాలి?

ఎయిర్‌టెల్ రూ. 3,999 ప్లాన్‌ను చాలా ఈజీ పద్దతుల్లో రీఛార్జ్ చేసుకోవచ్చు. మొబైల్‌లోని ‘Airtel Thanks App’ ఓపెన్ చేసి.. రీఛార్జ్ విభాగంలో రూ. 3,999 ప్లాన్‌ను ఎంచుకుని యూపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు. లేదంటే ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా గానీ.. ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్, రిటైల్ షాప్‌ సాయంతో కూడా రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంది.

Also Read: కాపు వ్యూహం ఫెయిల్.. జగన్ ప్లాన్ బి ఇదే.. అనిల్ యాదవ్‌తో బిగ్ గేమ్!

Tags

Related News

వాల్ క్లాక్ ఆగిపోయిందని పారేస్తున్నారా? ఈ చిన్న పని చేస్తే.. మళ్ళీ నడుస్తుంది!

ప్రొడక్ట్ బాగోలేదని టెన్షన్ పడుతున్నారా? రిటర్న్ చేయకుండానే ఫుల్ రీఫండ్

ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే..99 % మందికి తెలియని విషయాలు!

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Big Stories

Advertisement
×