E-Paper
Advertisement

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!
Advertisement

JioFiber: ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం, పిల్లల ఆన్‌ లైన్ క్లాసులు, ఓటీటీలలో సినిమాలు చూసే.. అలవాటు పెరిగిన తర్వాత వైఫై కనెక్షన్ అనేది ప్రతి ఇంటికి అత్యవసరంగా మారి పోయింది. ప్రతీ నెల రీఛార్జ్ చేయించుకునే.. తల నొప్పి లేకుండా ఒకే సారి ఇయర్ ప్లాన్ తీసుకునే వారికి ఇంటర్నెట్ కంపెనీలు ఎప్పుడూ కొన్ని ప్రత్యేక ఆఫర్లు ఇస్తుంటాయి. తాజాగా రిలయన్స్ జియో ఫైబర్ తన కస్టమర్ల కోసం ఒక అద్భుతమైన బొనాంజా ఆఫర్‌ను అనౌన్స్ చేసింది. దీని ద్వారా బ్రాడ్‌ బ్యాండ్ యూజర్లు భారీగా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు.

1. అసలు ఆఫర్ ఏంటి? లాభాలేంటి?

సాధారణంగా మనం బ్రాడ్‌ బ్యాండ్ కనెక్షన్ తీసుకున్నప్పుడు ప్రతి నెలా రీఛార్జ్ చేసుకోవడం లేదా ఏడాదికి ఒక సారి ఇయర్ ప్లాన్ తీసుకోవడం జరుగుతుంది. అయితే .. జియో ఫైబర్ అందిస్తున్న ఈ లేటెస్ట్ ఆఫర్ ప్రకారం..యూజర్లు 12 నెలల (ఒక ఏడాది) ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకుంటే.. కంపెనీ అదనంగా మరో 4 నెలల వ్యాలిడిటీని పూర్తిగా ఉచితంగా యాడ్ చేస్తోంది. అంటే.. మీరు 365 రోజులకు డబ్బులు చెల్లిస్తే.. ఏకంగా 480 రోజులకు పైగా (దాదాపు 16 నెలలు) ఎలాంటి ఇబ్బంద లేకుండా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు.

2. ప్లాన్ల ధరలు:

Advertisement

జియో ఫైబర్ అందించే ఈ ఇయర్ ప్లాన్ల ఆఫర్లు వివిధ స్పీడ్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. మీ అవసరానికి తగ్గట్టుగా బేసిక్ ప్లాన్ నుండి హై-ఎండ్ ప్లాన్ వరకు ఎంచుకోవచ్చు.

రూ. 6,999 + జీఎస్టీ ప్లాన్ (బేసిక్ స్పీడ్): తక్కువ డేటా పర్ఫామెన్స్ ఉన్న చిన్న ఫ్యామిలీలకు ఇది పర్ఫెక్ట్. ఇందులో సాధారణంగా 30 Mbps స్పీడ్‌తో అన్‍లిమిటెడ్ డేటా లభిస్తుంది. దీనిపై ఇప్పుడు 4 నెలల అదనపు వ్యాలిడిటీ వర్తిస్తుంది.

Advertisement

రూ. 9,999 + జీఎస్టీ ప్లాన్ (పాపులర్ స్పీడ్): రోజు వారీ హై-స్పీడ్ బ్రౌజింగ్, ఓటీటీ స్ట్రీమింగ్ చే సేవారికి ఇది బెస్ట్ ఛాయిస్. 100 Mbps స్పీడ్ ఇచ్చే ఈ ప్లాన్‌పై 12+4 నెలల ఆఫర్ అందుబాటులో ఉంది.

హెవీ యూజర్ల కోసం హై-స్పీడ్ ప్లాన్లు: 300 Mbps లేదా అంతకంటే.. ఎక్కువ స్పీడ్ కోరుకునే ఆఫీసులు లేదా పెద్ద కుటుంబాల కోసం ప్రత్యేకమైన ఇయర్ ప్లాన్లు ఉన్నాయి. వీటి ధరలు వేరియంట్‌ను బట్టి మారుతుంటాయి.ఈ ప్లాన్లతో పాటు ఫ్రీ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు కూడా వర్తిస్తాయి.

Also Read: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్..మార్షల్ స్పీకర్లపై అదిరిపోయే ఆఫర్లు

3. ఓటీటీ బెనిఫిట్స్, ఇతర లాభాలు:

కేవలం ఇంటర్నెట్ మాత్రమే కాకుండా.. ఈ ఇయర్ ప్లాన్లతో జియో సంస్థ ప్రముఖ ఓటీటీ యాప్స్ అయిన డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో (కొన్ని సెలెక్టెడ్ ప్లాన్లలో), నెట్‌ ఫ్లిక్స్, జీ5, సోనీలివ్ వంటి వాటిని ఫ్రీగా లేదా బండిల్ ఆఫర్‌గా అందిస్తోంది. అంటే ఎంటర్‌ టైన్‌మెంట్ కోసం విడిగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం ఒకే ఒక రీఛార్జ్‌తో ఏడాదికి పైగా వైఫై, ఎంటర్‌ టైన్‌మెంట్ రెండింటి టెన్షన్ వదిలిపెట్టొచ్చు.

4.  ఆఫర్‌ను ఎలా పొందాలి?

మీరు ఇప్పటికే జియో ఫైబర్ యూజర్ అయితే.. మీ మైజియో యాప్ ద్వారా ఈ ఇయర్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఒకవేళ కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకునే.. వారు కూడా కస్టమర్ కేర్ లేదా జియో అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ 12+4 నెలల ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

 

Related News

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్..మార్షల్ స్పీకర్లపై అదిరిపోయే ఆఫర్లు

దేశంలో భారీగా పెరిగిన ఈ-వేస్ట్.. పర్యావరణానికి పెరుగుతున్న పెను ముప్పు!

ఇల్లు భద్రంగా ఉండాలా? రూ.5 వేలలో టాప్-5 సెక్యూరిటీ కెమెరాలు.. ఇక దొంగల భయమే అక్కర్లేదు!

ఎయిర్‌టెల్ కస్టమర్లకు షాక్.. పెరిగిన ధరలు.. కానీ, ఫస్ట్ టైమ్ ఫ్రీగా ఆ సేవలు!

Big Stories

Advertisement
×