ప్రపంచ వ్యాప్తంగా ఈవీ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటి వరకు వాహనాలు డీజిల్, పెట్రోల్, గ్యాస్ తో నడవగా, గత కొద్ది సంవత్సరాలుగా ఆటో మోబైల్ ఇండస్ట్రీ అంతా ఎలక్ట్రిక్ మూడ్ లోకి వెళ్లిపోయింది. అన్ని కంపెనీలు విద్యుత్ వాహనాల తయారీ వైపు ఫోకస్ పెట్టాయి. టూ వీలర్ నుంచి మొదలుకొని పెద్ద పెద్ద ట్రక్కుల వరకు ఈవీ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జపనీస్ కు చెందిన ఓ స్టార్టర్ కంపెనీ తయారు చేసిన సింగిల్ సీటర్ ఈవీ కారు అమ్మకాల్లో దుమ్మురేపుతోంది. ఇంతకీ, ఆ కంపెనీ ఏది? అది తయారు చేసిన సింగిల్ సీటర్ ఈవీ ప్రత్యేకత ఏంటి? అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఈవీ రంగంలో KG మోటార్స్ దూకుడు
జపనీస్ స్టార్టప్ అయిన KG మోటార్స్.. EV మార్కెట్ లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సరసమైన సింగిల్ సీటర్ కారును అభివృద్ధి చేస్తోంది. జపాన్ లోని ఇరుకైన వీధుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేసేలా ‘mibot’ అనే కారును తీసుకొస్తోంది. ఈ కారుకు వినియోగదారుల నుంచి ఊహించని స్పందన లభిస్తోంది. జపాన్ లో టయోటా EV అమ్మకాలను అధిగమించి ప్రీ-సేల్స్ కొనసాగుతున్నాయి. Mibot కారు అక్టోబర్ నుంచి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
చౌక ధరలో సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ కారు
హిరోషిమా శివారులలో ఉన్న జపనీస్ స్టార్టప్ కంపెనీ KG మోటార్స్ తయారు చేస్తున్న చౌకైన ఎలక్ట్రిక్ కారుతో దేశంలోని ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ను షేక్ చేస్తోంది. KG మోటార్స్ బ్యాటరీతో నడిచే సింగిల్-సీటర్‌ను అభివృద్ధి చేసింది. ఈ కారు ఆధునిక EV కంటే ప్యూచర్ గోల్ఫ్ కార్ట్ ను పోలి ఉంటుంది. ఇది సాంప్రదాయ కారు కాదు. 2027లో డెలివరీ చేయాలనుకుంటున్న 3,300 యూనిట్లలో సగానికి పైగా ఇప్పటికే వినియోగదారులు బుకింగ్ చేసుకున్నారు.
టయోటా కంపెనీకి మించి అమ్మకాలు
KG మోటార్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమేకర్ టయోటా మోటార్ కార్ప్ కంటే ఎక్కువ EVలను విక్రయించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఫ్యాక్టరీ 2024లో దాదాపు 2,000 వాహనాలను విక్రయించింది. జపాన్ లో ఇప్పుడు ట్రెండ్ సెట్టర్ గా కొనసాగుతోంది.
KG మోటార్స్ సింగిల్ సీటర్ ధర ఎంతంటే?
1.5 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో, KG మోటార్స్ ‘mibot’ సింగిల్ ఛార్జ్ తో 100 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. పూర్తిగా ఛార్జింగ్ అయ్యేందుకు 5 గంటల సమయం పడుతుంది. గంటకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంది. ఈ కారు ధరను $7,000(భారత కరెన్సీలో సుమారు రూ. 6 లక్షలు)గా కంపెనీ నిర్ణయించింది. జపాన్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన EV, నిస్సాన్ మోటార్ కో సాకురా ధరలో సగం ధర రావడం విశేషం. మొదటి 300 కార్లను వచ్చే ఏడాది మధ్య నాటికి వినియోగదారులకు డెలివరీ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఆ తర్వాత మిగతా 3,000 కార్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.
Read Also: ఒక్కొక్కటి కాదు షేర్ ఖాన్.. ఒకేసారి 10 వందేభారత్ స్లీపర్లు!