Kodak 49 Inch 4K Smart TV: ప్రస్తుతం పెద్ద స్క్రీన్ మీద 4K క్లారిటీతో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడటం ప్రతీ ఒక్కరికీ ఇష్టమే. అయితే తక్కువ బడ్జెట్‌లో.. థియేటర్ లాంటి బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ కోసం చూస్తున్నారా? మీ కోసమే.. ప్రముఖ బ్రాండ్ కోడ్యాక్ తీసుకొచ్చిన Kodak 49 Inch LED Ultra HD ఒక బెస్ట్ ఆప్షన్. కేవలం రూ. 28,499 ధరలోనే అద్భుతమైన కలర్స్, పవర్‌ఫుల్ సౌండ్, స్మార్ట్ ఫీచర్లతో.. వస్తున్న ఈ టీవీ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీ హాల్ లేదా లివింగ్ రూమ్‌లో సిటీ స్క్రీన్ థియేటర్ వైబ్‌ని తెచ్చేందుకు ఈ కొడాక్ మోడల్ చక్కగా సరి పోతుంది. బడ్జెట్ ధరలోనే.. ప్రీమియం ఫీచర్లు అందిస్తున్న ఈ టీవీ వివరాలు.
1. క్రిస్టల్ క్లియర్ డిస్‌ప్లే:
ఈ టీవీకి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని రెసొల్యూషన్. సాధారణ ఫుల్ హెచ్‌డీ టీవీల కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువ క్లారిటీని ఇది ఇస్తుంది. నాణ్యమైన ప్యానెల్, లైటింగ్ ఉండటం వల్ల రంగులు చాలా సహజంగా, బ్రైట్‌గా కనిపిస్తాయి. పెద్ద స్క్రీన్ కావడం వల్ల ప్రతీ సీన్ చాలా డిటైల్డ్‌గా స్పష్టంగా కనిపిస్తుంది.
2. సౌండ్ ఎక్స్‌పీరియన్స్:
విజువల్స్ ఎంత బాగున్నా సౌండ్ క్వాలిటీ లేకపోతే.. ఆ సినిమా ఫీల్ నెరవేరదు. ఈ కొడాక్ 49 ఇంచ్ టీవీలో 20W ఇన్-బిల్ట్ స్పీకర్లు అమర్చారు. దీనికి తోడు విభిన్నమైన ఆడియో ఈక్వలైజర్ మోడ్స్ ఉండటం వల్ల డీప్ బేస్, స్పష్టమైన వాయిస్ వినబడతాయి. చిన్న లేదా మీడియం సైజ్ రూమ్‌లలో.. అదనపు స్పీకర్లు లేకపోయినా ఈ ఆడియో అవుట్‌పుట్ చక్కగా సరి పోతుంది.
ఇది స్మార్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. దీని వల్ల మీరు వైఫై.. లేదా ల్యాన్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ కనెక్ట్ చేసి YouTube, Netflix,Prime Video వంటి పాపులర్ ఓటీటీ యాప్‌లను నేరుగా ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా.. మీ ఫోన్ స్క్రీన్‌ను టీవీపై క్యాస్ట్ చేసే ఆప్షన్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.
స్మూత్ గేమింగ్ , యాప్స్ వేగంగా ఓపెన్ అవ్వడానికి ఇందులో క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఇచ్చారు. దీనికి తోడు తగినంత ర్యామ్, స్టోరేజ్ అందుబాటులో ఉండటం వల్ల యాప్‌లు మధ్యలో.. హ్యాంగ్ అవ్వకుండా ఈజీగా రన్ అవుతాయి. ఆన్‌లైన్ బ్రౌజింగ్ లేదా సోషల్ మీడియా వాడకం కూడా.. టీవీలోనే పూర్తి చేయవచ్చు.
5. కనెక్టివిటీ పోర్ట్‌లు:
సెట్-టాప్ బాక్స్, గేమింగ్ కన్సోల్‌లు, పెన్ డ్రైవ్‌లు లేదా సౌండ్‌బార్స్ కనెక్ట్ చేయడానికి ఇందులో.. అన్ని రకాల పోర్ట్‌లను ఇచ్చారు.
HDMIపోర్ట్‌లు: గేమ్స్, సెట్-టాప్ బాక్స్ కోసం వివిధ పోర్ట్‌లు ఉన్నాయి.
USBపోర్ట్‌లు: మీ దగ్గర ఉన్న సినిమాలు, పాటలు ప్లే చేయడానికి యూఎస్‌బీ పోర్ట్‌లు సపోర్ట్ చేస్తాయి.
ఇతర కనెక్టివిటీలు: హెడ్‌ఫోన్ జాక్, ఈథర్నెట్ పోర్ట్, ఇన్-బిల్ట్ వైఫై లభిస్తాయి.
దేశంలో ఈ టీవీ ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్ స్టోర్లలో రూ.28,499 కి అందుబాటులో ఉంటుంది.
వారంటీ: ప్రాడక్ట్‌పై 1 ఏడాది కాంప్రహెన్సివ్ కంపెనీ వారంటీ లభిస్తుంది.
మీరు రూ.30వేల లోపు బిగ్ స్క్రీన్, 4K పిక్చర్ క్వాలిటీ, మంచి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్న బ్రాండెడ్ టీవీని కొనాలంటే ఈ మీకు ఖచ్చితంగా బెస్ట్ ఆప్షన్ అవుతుంది.