E-Paper
Advertisement

రూ.599కే..50 గంటల బ్యాటరీ లైఫ్,డ్యూయల్ పేరింగ్ ఇయర్‌బడ్స్!

రూ.599కే..50 గంటల బ్యాటరీ లైఫ్,డ్యూయల్ పేరింగ్ ఇయర్‌బడ్స్!
Advertisement

Navo Buds X1 earbuds: తక్కువ బడ్జెట్‌లో.. అదిరిపోయే ఫీచర్లు కలిగిన వైర్‌లెస్ ఇయర్‌ బడ్స్ కోసం చూస్తున్నారా? అయితే.. మార్కెట్లో ట్రెండ్ అవుతున్న Navo Buds X1 మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.కేవలం రూ.599 ధరకే లభిస్తున్న.. ఈ ఇయర్‌బడ్స్ 50 గంటల లాంగ్ బ్యాటరీ లైఫ్, ఈఎన్‌సీ, లో లేటెన్సీ వంటి అద్భుతమైన ఫీచర్లతో వస్తున్నాయి. మ్యూజిక్ లవర్స్ ను,బడ్జెట్ యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయ్యి

సాధారణంగా తక్కువ ధరకు ఇయర్‌బడ్స్ దొరికితే సౌండ్ క్వాలిటీ లేదా బ్యాటరీ బ్యాకప్ బాగోలేకపోవచ్చు అనే అపోహ ఉంటుంది. కానీ.. దానిని పటాపంచలు చేస్తూ అత్యంత తక్కువ ధరకు Navo Buds X1 పవర్ ఫుల్ ఫీచర్లను అందిస్తోంది.ఈ ఇయర్‌బడ్స్ ఫర్మామెన్స్, స్పెసిఫికేషన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

Navo Buds X1 earbuds ఫీచర్లు:

1.డిజైన్, లుక్:

Advertisement

ఈ ఇయర్‌బడ్స్ ‘బ్లాక్ మూన్’కలర్ ఆప్షన్‌లో స్టైలిష్‌గా కనిపిస్తాయి. చెవుల్లో.. సౌకర్యంగా ఇమిడిపోయేలా ‘ఇన్ ది ఇయర్’డిజైన్‌తో వీటిని రూపొందించారు. క్కువ సేపు చెవుల్లో పెట్టుకున్నా.. ఎలాంటి నొప్పిగా అనిపించదు. చూడటానికి చాలా ప్రీమియం లుక్‌ను ఇస్తూ.. ఎక్కడికైనా ఈజీగా జేబులో లేదా బ్యాగ్‌లో పెట్టుకుని తీసుకెళ్లడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటాయి.

2.సౌండ్ క్వాలిటీ :

Advertisement

బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ ఆడియో విషయంలో ఈ ఇయర్‌బడ్స్ ఏమాత్రం రాజీ పడవు. ఇందులో.. 13mm స్పీకర్ డ్రైవర్లు ఉన్నాయి. దీని వల్ల పాటలు వింటున్నప్పుడు క్లియర్ అయిన వోకల్స్ , డీసెంట్ బేస్ ఫీల్ కలుగుతుంది. మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి కూడా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

3.గేమింగ్, కనెక్టివిటీ:

గేమింగ్ దృష్టిలో ఉంచుకుని ఇందులో.. అద్భుతమైన 45ms లో లేటెన్సీ ఫీచర్‌ను యాడ్ చేసారు. దీని వల్ల గేమింగ్ ఆడేటప్పుడు ఆడియో, వీడియో మధ్య ఎలాంటి లేట్ లేకుండా పర్ఫెక్ట్ సింక్ అవుతుంది. అలాగే ..ఇందులో డ్యూయల్ పేరింగ్ సపోర్ట్ ఉండటం వల్ల ఒకే సారి రెండు డివైజెస్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. కాల్స్ మాట్లాడుతున్నప్పుడు.. అవతలి వారికి క్లియర్ వాయిస్ వినిపించేలా EN టెక్నాలజీ కూడా ఇందులో పని చేస్తుంది.

Also Read: ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో.. టాప్ 5 ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు!

4.బ్యాటరీ బ్యాకప్,ఛార్జింగ్:

ఈ ఇయర్‌ బడ్స్ అతి పెద్ద హైలైట్ వీటి బ్యాటరీ లైఫ్ అనే చెప్పాలి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 50 గంటల పాటు నిరంతర ప్లే టైమ్ లభిస్తుంది. ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రోజంతా బ్యాటరీ టెన్షన్ లేకుండా వాడొచ్చు.

5.ధర :

మార్కెట్లో అనేక రకాల బడ్జెట్ ఇయర్‌ బడ్స్ ఉన్నప్పటికీ..మంచి ఫీచర్లతో ఈ వస్తున్న మోడల్ ధర కేవలం రూ.599 మాత్రమే ఉండటం విశేషం. అతి తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ కాలం పాడవకుండా పని చేసే మంచి వైర్‌లెస్ హెడ్‌సెట్ కావాలనుకునే వారికి ఇది నిజంగా ఒక సూపర్ డీల్.

Also Read: మైక్రోవేవ్ ఓవెన్లలపై భారీ డిస్కౌంట్లు..ఆఫర్ పోతే రాదు వెంటనే కొనేయండి

Related News

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Big Stories

Advertisement
×