Addanki Dayakar: ఎర్రవల్లిలో అమరవీరుల కాలనీ నిర్మించాలన్న సీఎం నిర్ణయం పై ఉధ్యమకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. భూములు, ఫామ్ హౌస్‌లు, స్టార్ హోటళ్లు, బినామీల పేరుతో ఆస్తులు సంపాదించిన వారు ఒక వైపు. ప్రభుత్వ భూములు, పేదల భూములు, అసైన్డ్, భూదాన్, వక్ఫ్ భూములను ఆక్రమించిన వారి నుంచి తిరిగి తీసుకుని అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి మరో వైపు ఉన్నారని అన్నారు. తెలంగాణ సంపదను దోచుకున్న కుటుంబం ఒక వైపు ఉన్నారు. తెలంగాణ సంపదను దోచుకున్న కుటుంబం నుంచి ఆస్తులు తీసుకుని అమరవీరుల కుటుంబాలకు పంచాలనుకున్న సీఎం మరో వైపని అన్నారు.
ఎర్రవల్లిలో సర్వే నంబర్ 325లో 45 ఎకరాల భూమి ఎక్కడుంది..? తన ఫామ్ హౌస్‌లో భూములు ఉన్నాయో లేదో కేసీఆర్ చెప్పాలని అద్దంకి దయాకర్ అన్నారు. గత ప్రభుత్వంలో అన్ని రకాల భూములను తమ పేర్లపైకి చేసుకున్నారు. గతంలో దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను బీఆర్‌ఎస్ వాళ్లు లాక్కున్నారు. సీబీఐ, ఈడీ అటాచ్ చేసిన భూముల్లో ఒక నేత ఫామ్ హౌస్ కట్టుకున్నాడని అన్నారు. అసైన్డ్ భూముల్లో బంగ్లాలు కట్టుకున్నారని, ఒకాయ భూసేకరణ నుంచి భూములను మినహాయించి తన పేరు మీద చేసుకున్నాడని ఫైర్ అయ్యారు.
విలాసవంతమైన హోటళ్లు నిర్మించుకున్నారు. అధికారం ఇస్తే కేసీఆర్ ఏం చేశాడు.. అధికారం ఇస్తే రేవంత్ రెడ్డి ఏం చేశాడో చూడాలని అద్దంకి దయాకర్ తెలిపారు. ఉద్యమకారులకు కేసీఆర్ టీ కూడా తాగించలేదు. ఉద్యమకారులను కేసీఆర్ జైళ్లలో పెట్టించాడని కోదండరాం, అద్దంకి దయాకర్, మందకృష్ణ మాదిగ ఇందుకు ఉదాహరణ అని అన్నారు. ఉద్యమ ద్రోహులను ఇంట్లో కూర్చోబెట్టి బిర్యానీ తినిపించాడని, తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు మేలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని అన్నారు.
Also read: మీ ఇంటి పెరట్లో ఈ మొక్కలు ఉన్నాయా? అయితే, పాములు, దోమలతో నో టెన్షన్!
తెలంగాణ భూములను ఇతర రాష్ట్రాల వారికి కేసీఆర్ కట్టబెట్టాడు. తెలంగాణ పైసలను పంజాబ్ రైతులకు పంచి పెట్టాడు. కేసీఆర్ కుటుంబం స్వచ్ఛందంగా తమ భూముల వివరాలు బయటపెట్టాలని అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. మా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బండారాన్ని బయటపెట్టకముందే కేసీఆర్ ఫ్యామిలీ తమ భూముల వివరాలు చెప్పాలన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ 3,000 మందిని కలిసి వారి ఆవేదన విన్నది.. తెలంగాణ ఉద్యమకారులను చూసి కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలని, తెలంగాణ అన్న పదం ఉచ్ఛరించే నైతిక హక్కు బీఆర్‌ఎస్ పార్టీకి లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీ నుంచి తెలంగాణ పేరు తొలగించిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది.. తెలంగాణ కోసం చావు నోట్లో తలకాయ పెట్టామని సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారు. పేదలకు దక్కాల్సిన భూములు బీఆర్‌ఎస్ నాయకులకు, కేసీఆర్ బినామీలకు ఎందుకు దక్కాయి.. తెలంగాణ ఉద్యమకారులకు, పేదలకు ఎందుకు భూములు దక్కలేదు..? కేసీఆర్‌కు తెలియకుండా ఎర్రవల్లిలో 45 ఎకరాల భూమి ఎక్కడికి పోయిందని అన్నారు. ఎర్రవల్లిలో అమరవీరుల స్థూపం నిర్మించాలని, అమరవీరుల కాలనీని నిర్మించాలని అదిచూస నిరంతరం కేసీఆర్‌కు అమరవీరులు గుర్తుకు రావాలని అద్దంకి దయార్ రావు అన్నారు.
Also read: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆశా కార్యకర్తలకు భారీ గుడ్ న్యూస్?