Liquid Vs Powder detergent: రోజూ మనం ఉతికే.. బట్టలు తలతలా మెరిసిపోవాలంటే.. కేవలం మంచి వాషింగ్ మెషీన్ ఉంటే సరిపోదు, సరైన డిటర్జెంట్ ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. మార్కెట్లో రకరకాల డిటర్జెంట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. చాలా మందికి లిక్విడ్ వాడాలా లేక పౌడర్ వాడాలా అనే సందేహం ఉంటుంది. బట్టల రకం, మరకల స్వభావం , వాటర్ క్వాలిటీని బట్టి వీటి ఫలితాలు మారుతుంటాయి. నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఈ రెండింటిలో ఏది మీ లాండ్రికి బెస్ట్ ఆప్షనో ఇప్పుడు తెలుసుకుందాం.
సాంప్రదాయకంగా.. చాలా ఇళ్లలో బట్టలు ఉతకడానికి పౌడర్ డిటర్జెంట్‌నే.. ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా.. మట్టి, బురద, రోజు వారీ వాడకం వల్ల బట్టలపై పడే మొండి మరకలను వదిలించడంలో.. పౌడర్ డిటర్జెంట్ అద్భుతంగా పని చేస్తుంది. తక్కువ ఖర్చుతో.. ఎక్కువ రోజులు రావడంతో పాటు, ప్యాకింగ్ , నిల్వ చేయడం కూడా చాలా ఈజీ. అయితే.. దీనిలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. చల్లటి నీటిలో పౌడర్ సరిగ్గా.. కరగకపోవడం వల్ల బట్టలపై తెల్లటి మరకలు లేదా అవశేషాలు మిగిలిపోతాయి. అలాగే.. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లలో దీన్ని వాడటం వల్ల కొన్నిసార్లు పైపులు జామ్ అయ్యే సమస్యలు ఎదురవుతాయి.
ప్రస్తుత ట్రెండ్‌లో లిక్విడ్ డిటర్జెంట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీని ప్రధాన కారణం ఇది నీటిలో.. తక్షణమే కలిసిపోవడం. చల్లటి నీటితో బట్టలు ఉతికేటప్పుడు కూడా లిక్విడ్ డిటర్జెంట్ అద్భుతమైన.. ఫలితాలను ఇస్తుంది. బట్టలపై ఎలాంటి అవశేషాలు మిగల్చకుండా లోతుగా శుభ్రం చేస్తుంది. ముఖ్యంగా.. నూనె, గ్రీజు వంటి జిడ్డు మరకలపై నేరుగా లిక్విడ్‌ను అప్లై చేసి ఉతికితే మరకలు ఇట్టే మాయమవుతాయి. సిల్క్, ఊలెన్ వంటి సున్నితమైన బట్టల పాడవకుండా ఉండటంలో లిక్విడ్ డిటర్జెంట్ చాలా బాగా సహాయ పడుతుంది. అయితే.. పౌడర్‌తో పోలిస్తే.. దీని ధర కొంచెం ఎక్కువగా ఉండటం ఒక్కటే దీనిలో ఉండే చిన్న లోపం.
Also Read: ఇంతవరకూ ఏ టీవీలో లేని ఫీచర్లతో.. కొత్త మోడల్ లాంచ్
నీటి స్వభావాన్ని బట్టి ఎంపిక :
మీరు బట్టలకు వాడేది హార్డ్ వాటర్ అయితే.. పౌడర్ డిటర్జెంట్ కంటే లిక్విడ్ డిటర్జెంట్ ఎంచుకోవడం మంచిది. హార్డ్ వాటర్‌లో.. ఉండే మినరల్స్‌తో పౌడర్ రియాక్ట్ అయ్యి బట్టలను గరుకుగా.. మార్చే అవకాశం ఉంది. అదే లిక్విడ్ అయితే.. నీటితో త్వరగా కలిసిపోయి బట్టలకు మంచి సువాసనను, మృదుత్వాన్ని అందిస్తుంది. మరో వైపు, రోజువారీ కాటన్ బట్టలు, ఎక్కువ మురికి ఉండే బట్టలకు పౌడర్ మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీ వాషింగ్ మెషీన్ రకాన్ని బట్టి కూడా డిటర్జెంట్ ఎంపిక ఆధారపడి ఉంటుంది. ఆటోమేటిక్ మెషీన్లకు.. కూడా నేడు లిక్విడ్ వాడకాన్ని ఎక్కువగా సిఫార్సు చేస్తున్నారు.
ప్రస్తుతం బట్టలు ఎక్కువ కాలం పాడవకుండా ఉండటం గురించి చాలా మంది ఆలోచిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రెండింటికీ వాటి వాటి ప్రత్యేకతలు ఉన్నాయి. మీ అవసరాన్ని బట్టి రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే.. బెస్ట్. రోజూ వారీ ఉతికే సాధారణ బట్టలకు పౌడర్ వాడుతూ.. ఖరీదైన, సున్నితమైన బట్టలకు జిడ్డు మరకలకు లిక్విడ్ డిటర్జెంట్‌ను ఉపయోగిస్తే.. అవి కొత్తగా మెరుస్తాయి. సరైన డిటర్జెంట్ ఎంచుకోవడం ద్వారా మీ బట్టల నాణ్యతను కాపాడుకోవడంతో పాటు వాటిని ఎక్కువ రోజులు ఉపయోగించవచ్చు.