Man vs Robot Fight: సాంకేతికత ఏ స్థాయిలో మారిపోయిందో చెప్పడానికి ఈ వింత పోరాటమే ఒక ఉదాహరణ. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించే ‘మనిషి వర్సెస్ రోబోట్’ పోరు నిజ జీవితంలోకి వచ్చేసింది. అమెరికాలోని శాన్ ప్రాన్సిస్కోలో 6 అడుగుల ఎత్తున్న ఒక హ్యూమనాయిడ్ రోబోట్, ఓ మనిషితో రింగ్ లోకి దిగి ఫైట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రెక్ (REK) అనే అమెరికన్ రోబోటిక్స్ సంస్థ ఈ వినూత్న పోరాటాన్ని ఏర్పాటు చేసింది. వర్చువల్ రియాలిటీ (VR) ద్వారా మనుషులు రిమోట్ కంట్రోల్ సాయంతో రొబోట్లను నడిపిస్తూ వాటితో ఫైటింగ్ గేమ్స్ ఆడించే ప్రాజెక్టులో భాగంగా ఈ మ్యాచ్ నిర్వహించారు. ఈ పోరులో నెటిజన్లకు బాగా పరిచయమున్న ప్రముఖ కంటెంట్ క్రియేటర్, ఇన్ఫ్లూయెన్సర్ ఫ్రాంకీ లాపెన్నా ఈ రోబోట్‌ను ఎదుర్కొన్నాడు. అయితే బరిలో నిలిచిన రోబోట్ డిజైన్ చూడటానికి ఒక ఫ్యూచరిస్టిక్ కాంబ్యాట్ మిషిన్ లా ఉంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇది సాధారణ బాక్సర్‌లా రింగ్‌లో వార్మప్ చేస్తూ కనిపించింది.
ఫైట్ మొదలైన వెంటనే ఫ్రాంకీ లాపెన్నా రోబోట్‌పై వరుస పంచ్‌లు విసిరాడు. అయితే రిమోట్ కంట్రోల్ సాయంతో నడిచే ఆ రోబోట్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. లాపెన్నా వైపు దూసుకొస్తూ బలమైన పంచ్‌లు, పవర్‌ఫుల్ కిక్స్ ఇచ్చే ప్రయత్నం చేసింది. రోబో దెబ్బల ధాటికి ఓ దశలో లాపెన్నా కేజ్ ఒకవైపు నుంచి మరొక వైపునకు పడిపోయాడు. ఈ మ్యాచ్ కు సంబంధించి రెక్ సంస్థ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘ఈ మ్యాచ్‌తో మేము ఒక కొత్త చరిత్ర సృష్టించాం’ అనే క్యాప్షన్ తో ఫైటింగ్ వీడియోను పంచుకుంది.
We just made history with the first Human VS Terminator robot fight.
Frankie LaPenna gave it his all 🥊 More fight footage coming soon! pic.twitter.com/iADpv9d8Wg
— REK (@REK) September 20, 2026
రోబో vs మ్యాన్ ఫైటింగ్ దృశ్యాలు.. నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. త్వరలోనే రోబోట్ల పోరాటాలు కూడా ప్రొఫెషనల్ స్పోర్ట్స్‌లో భాగమవుతాయేమోనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ‘ఒక వేళ ప్రొఫెషనల్ ఫైటర్ ఈ రోబోట్‌తో తలపడితే ఎలా ఉంటుందో చూడాలని ఉంది. ప్రొఫెషనల్స్ దీనిని సమర్థవంతంగా ఎదుర్కోగలరు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘ఏఐ క్రేజ్ చూస్తుంటే రాబోయే 5 ఏళ్లలో యూఎఫ్ సీ లాంటి పోటీల్లో మనుషులు, రోబోట్ల ఫైట్లు చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అని మరొకరు వ్యాఖ్యానించారు.
Also Read: అయోధ్య రామమందిరం కేసులో సంచలనం.. 105 సార్లు విరాళాల చోరీ.. బయటపెట్టిన సిట్!
హ్యూమనాయిడ్ రోబోట్లు మనుషుల పట్ల దూకుడు వ్యవహరించడం ఇదే మెుదటిసారి కాదు. గతంలో కూడా ఒక ఎలక్ట్రానిక్స్ స్టోర్‌లో కస్టమర్ తనను తోసివేయడంతో కోపంతో ఊగిపోయిన ఒక రోబోట్ అతని వైపు దూసుకొచ్చి దాడికి ప్రయత్నించింది. అప్పట్లో అందుకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ సమయంలో స్టోర్ సిబ్బంది వెంటనే స్పందించి రోబోట్‌ను స్విచ్ ఆఫ్ చేయడంతో ఎలాంటి ఇబ్బంది కలుగలేదు.
Also Read: చిన్న రూమ్.. తక్కువ బడ్జెట్.. రూ. 10,000 లోపే లభించే టాప్-5 మినీ ఫ్రిడ్జ్‌లు!