Zaheer Khan As CSK Coach : 2027 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ గా టీమిండియా మాజీ దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్ ను నియామకం చేసింది. 2027 ఐపిఎల్ నుంచి హెడ్ కోచ్ గా కొనసాగబోతున్నాడని తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది చెన్నై యాజమాన్యం. అయితే ఈ ప్రకటన నేపథ్యంలో సోషల్ మీడియాలో మహేంద్రసింగ్ ధోని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి గెంటేసేందుకే జహీర్ ఖాన్ ను (Zaheer Khan) తెరపైకి తీసుకువచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. గతంలో టీమిండియా తరఫున జహీర్ ఆడకుండా ధోని కుట్రలు చేశాడని ప్రచారం జరిగింది. అయితే అప్పటి రివేంజ్ ఇప్పుడు జహీర్ ఖాన్ తీర్చుకుంటాడని ధోని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు హెడ్ కోచ్ గా జహీర్ ఖాన్ ను నియామకం చేశారు. స్టీఫెన్ ఫ్లెమింగ్ రాజీనామా చేసిన నేపథ్యంలో జహీర్ ఖాన్ కు అవకాశం వచ్చింది. 2027 ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ బాధ్యతలను జహీర్ ఖాన్ నిర్వర్తించనున్నాడు. 2018 నుంచి 2024 వరకు ముంబై ఇండియన్స్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం జహీర్ ఖాన్ కు ఉంది. ఆ పిరియడ్ లో ముంబై ఇండియన్స్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. ఇక లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరఫున 2025 నుంచి 2026 వరకు మెంటార్ గా కూడా పనిచేశాడు. ముఖ్యంగా టీమిండియా తరఫున ఆడి ఎన్నో విజయాలను జట్టుకు అందించిన అనుభవం కూడా జహీర్ ఖాన్ కు ఉంది. ఈ తరుణంలోనే జహీర్ ఖాన్ కు అవకాశం ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం.
చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ బాధ్యతలను జహీర్ ఖాన్ తీసుకోబోతున్న నేపథ్యంలో మహేంద్రసింగ్ ధోని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీనికి ప్రత్యేకమైన కారణం ఉంది. ధోని కెప్టెన్సీ లో గతంలో జహీర్ ఖాన్ చాలా మ్యాచ్ లు ఆడాడు. 2011 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా కూడా… ధోని కెప్టెన్సీ లోనే జహీర్ ఖాన్ ఆడడం జరిగింది. అయితే, ఆ సమయంలో జహీర్ ఖాన్ కు సరిగ్గా ధోని అవకాశాలు ఇవ్వలేదని ప్రచారం జోరుగా సాగింది. ఏజ్ పై పడిందని, బిసిసిఐ అధికారులు కూడా చాలాసార్లు ధోని ఫిర్యాదు చేశాడని ఆరోపణలు ఉన్నాయి.
అందుకే 2007 టి20 వరల్డ్ కప్ సందర్భంగా అతడిని తీసుకోలేదట. అయితే ఇప్పుడు ధోని ఏజ్ కూడా పైబడింది. అతడిని చెన్నై తరపున ఆడకుండా జహీర్ ఖాన్ కుట్రలు పన్నే ప్రమాదం ఉందని ధోని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే దీనిపై క్రీడా విశ్లేషకులు భిన్నంగా స్పందిస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోని అలాగే జహీర్ ఖాన్ మధ్య మంచి బంధము ఉందని… వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు గొడవలు జరగలేదని చెబుతున్నారు. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి కూడా ఈ ఇద్దరి అవసరం ఎంతో ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.