Mi 3i 20000 mAh power bank Flipkart deal: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ చేతిలో లేకపోతే క్షణం గడవదు. ఆఫీస్ పని, రీల్స్ చూడటం, గేమ్స్ ఆడటం.. ఇలా దేనికైనా ఫోన్ కావాల్సిందే. అయితే ఎక్కువసేపు వాడితే.. ఫోన్ ఛార్జింగ్ అయిపోవడం కామన్ సమస్య. ముఖ్యంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఛార్జింగ్ సాకెట్ వెతుక్కోవడం పెద్ద తలనొప్పి. మరి మీ ఫోన్‌ను నాలుగైదు సార్లు ఫుల్ ఛార్జ్ చేయగల పవర్‌ఫుల్ గ్యాడ్జెట్ తక్కువ ధరకే వస్తే? అవును, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం Mi 3i 20000 mAh Power Bank పై క్రేజీ డీల్ నడుస్తోంది. దీని ఫీచర్లు, ఆఫర్ ధరపై ఒక లుక్కేద్దాం.
ప్రస్తుత డిజిటల్ జనరేషన్‌లో పవర్‌బ్యాంక్ అనేది లగ్జరీ కాదు. ప్రతి ఒక్కరికీ కనీస అవసరం. మార్కెట్లో ఎన్నో కంపెనీల పవర్‌బ్యాంకులు ఉన్నప్పటికీ.. నమ్మకానికి, మన్నికకు కేరాఫ్ అడ్రస్ అంటే షియోమి అనే చెప్పాలి. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో భారీ కెపాసిటీతో వచ్చే Mi 3i 20000 mAh Power Bank (Black) పై ఫ్లిప్‌కార్ట్ సరి కొత్త డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది.
భారీ బ్యాటరీ.. కొండంత అండ:
ఈ పవర్‌బ్యాంక్ యొక్క మెయిన్ హైలైట్ దీని 20000 mAh భారీ కెపాసిటీ. ఇందులో అడ్వాన్స్‌డ్ లిథియం పాలిమర్ బ్యాటరీని ఉపయోగించారు. ఇది సాధారణ లిథియం అయాన్ బ్యాటరీల కంటే.. చాలా సేఫ్, ఎక్కువ కాలం మన్నిక ఇస్తుంది. ఒకసారి ఈ పవర్‌బ్యాంక్‌ను ఫుల్ ఛార్జ్ చేసుకుంటే చాలు.. మీ 4500mAh లేదా 5000mAh బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను హ్యాపీగా 3 నుండి 4 సార్లు పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు.
టైమ్ సేవ్ చేసే 18W ఫాస్ట్ ఛార్జింగ్:
చాలా పవర్ బ్యాంకులు ఫోన్‌ను చాలా స్లోగా ఛార్జ్ చేస్తాయి. కానీ Mi 3i లో 18W టూ-వే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే ఇది మీ ఫోన్‌ను వేగంగా ఛార్జ్ చేయడమే కాకుండా.. పవర్‌బ్యాంక్ స్వయంగా ఛార్జ్ అవ్వడానికి కూడా తక్కువ టైమ్ తీసుకుంటుంది.
ట్రిపుల్ అవుట్‌పుట్ పోర్ట్స్ : ఇందులో రెండు USB-A పోర్ట్‌లు , ఒక టైప్-సి పోర్ట్ ఉన్నాయి. దీనివల్ల మీరు ఒకే సమయంలో మూడు డివైజ్‌లను (మొబైల్, స్మార్ట్ వాచ్, ఇయర్‌బడ్స్) ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు.
స్మార్ట్ పవర్ మేనేజ్‌మెంట్ : బ్లూటూత్ ఇయర్‌బడ్స్ లేదా ఫిట్‌నెస్ బ్యాండ్స్ లాంటి చిన్న గ్యాడ్జెట్స్‌ను ఛార్జ్ చేయడానికి తక్కువ పవర్ అవసరం అవుతుంది. దీని కోసం పవర్‌బటన్‌ను రెండుసార్లు ప్రెస్ చేస్తే చాలు.. ఇది ‘లో పవర్ ఛార్జింగ్ మోడ్’ లోకి మారుతుంది. దీని వల్ల చిన్న గ్యాడ్జెట్స్ పాడవకుండా సేఫ్‌గా ఛార్జ్ అవుతాయి.
12 లేయర్స్ అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్: షార్ట్ సర్క్యూట్, ఓవర్-ఛార్జింగ్, ఓవర్-వోల్టేజ్, హీటింగ్ సమస్యల నుంచి రక్షణ కల్పించడానికి ఇందులో 12 రకాల సేఫ్టీ లేయర్స్ ఇచ్చారు. కాబట్టి ఇది పూర్తిగా సురక్షితం.
ప్రీమియం మ్యాట్ బ్లాక్ డిజైన్: ఇది క్లాసిక్ బ్లాక్ కలర్‌లో, చేతిలో పట్టుకుంటే జారకుండా ఉండే మంచి గ్రిప్ టెక్స్చర్‌తో వస్తుంది. చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది.
టెక్ లవర్స్ అందరూ వాల్యూ ఫర్ మనీ, మల్టీ-పోర్ట్ కనెక్టివిటీ ఉన్న గ్యాడ్జెట్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఆ కేటగిరీలో ఈ Mi పవర్‌బ్యాంక్ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది.
Also Read: రెడ్ డాట్ డిజైన్ అవార్డ్ గెలుచుకున్న.. నోయిస్ సరికొత్త గ్యాడ్జెట్ ఇదే !
సాధారణంగా Mi 3i 20000 mAh పవర్‌బ్యాంక్ ఒరిజినల్ ఎంఆర్‌పీ (MRP) రూ. 2,199 గా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఫ్లిప్ కార్డ్ డీల్ లో భాగంగా దీనిపై భారీ తగ్గింపు లభిస్తోంది.
ఆఫర్ ధర: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇది కేవలం రూ. 1,699 కే అందుబాటులో ఉంది.
బ్యాంక్ ఆఫర్స్: ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించే వారికి అదనంగా 5% అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీని వల్ల నెట్ ప్రైస్ మరింత తగ్గుతుంది. కంపెనీ దీనిపై 6 నెలల డొమెస్టిక్ వారంటీని కూడా ఇస్తోంది.
ఆఫీస్ గోయర్స్, గేమర్స్, ముఖ్యంగా ఎప్పుడూ ప్రయాణాల్లో ఉండే ట్రావెల్ వ్లాగర్స్, స్టూడెంట్స్‌కి ఈ Mi 3i 20000 mAh Power Bank ఒక పర్ఫెక్ట్ లైఫ్ సేవర్‌గా మారుతుంది. తక్కువ బడ్జెట్‌లో, బ్రాండెడ్ క్వాలిటీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న బెస్ట్ పవర్‌బ్యాంక్ కావాలనుకుంటే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న ఈ క్రేజీ డీల్‌ను అస్సలు మిస్ చేసుకోకండి.