E-Paper
Advertisement

7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సరికొత్త Moto G Max.. లాంచ్ ఎప్పుడంటే?

7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సరికొత్త Moto G Max.. లాంచ్ ఎప్పుడంటే?
Advertisement

Moto G Max: ప్రముఖ టెక్ సంస్థ మోటరోలా భారత్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ నెల 14వ తేదీన Moto G Max పేరిట ఓ పవర్‌ఫుల్ హ్యాండ్ సెట్‌ను ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో హల్‌చల్ చేస్తోంది. రోజంతా ఫోన్ వాడే వారికి, వినోదాన్ని కోరుకునే వారికి ఇదొక మంచి ఆప్షన్‌గా నిలవనుంది.

వాటర్ టచ్ 2.0 ఫీచర్:

ఈ Moto G Maxలో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. 120Hz రీఫ్రెష్ రేట్ ఉండటం వల్ల యాప్స్ స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1050 నిట్స్ బ్రైట్‌నెస్‌ ఇచ్చారు. చేతులు తడిగా ఉన్నా ఫోన్ వాడేలా వాటర్ టచ్ 2.0 ఫీచర్ ఉంది. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సెరామిక్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్‌తో పాటు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉంది.

Advertisement

Also Read: ఓరి నాయనో.. రూ.57,000 శాంసంగ్ ట్యాబ్ రూ.28,000కే వచ్చేస్తోంది.. ఇదంతా కలా? నిజమా?

మూడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్:

Moto G Max ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6s Gen 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వర్చువల్ ర్యామ్‌తో కలిపి ఇందులో 18GB వరకు ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు ఇది బాగా సెట్ అవుతుంది. వేగవంతమైన డేటా ప్రాసెసింగ్ కోసం UFS 3.1 స్టోరేజ్ అందించారు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తున్న ఈ ఫోన్‌కు 2 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇస్తామని కంపెనీ తెలిపింది.

భారీ బ్యాటరీ సామర్థ్యం:

Advertisement

ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ దీని 7000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ. ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ గంటలు ఛార్జింగ్ నిలుస్తుంది. అలాగే వేగంగా ఛార్జింగ్ అయ్యేందుకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఆగస్టు 14 మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ ధర, సేల్ వివరాలను మోటరోలా అధికారికంగా వెల్లడించనుంది. తక్కువ బడ్జెట్‌లో మంచి బ్యాటరీ, పనితీరు కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక కానుంది.

Also Read: UPI యూజర్లకు బిగ్ రిలీఫ్.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆఫీషియల్ క్లారిటీ వచ్చేసింది!

Tags

Related News

ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. రేట్లు ఇలా తగ్గించేశారేంటీ!

రూ.13,000 బడ్జెట్‌లో ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో హాట్‌కేక్‌లా అమ్ముడవుతున్న Moto G06 Power!

వర్షాకాలంలో ఇళ్లలోని నీరు, బురదను క్షణాల్లో.. క్లీన్ చేసే వాక్యూమ్ క్లీనర్స్!

ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో.. టాప్ 5 ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు!

ఓరి నాయనో.. రూ.57,000 శాంసంగ్ ట్యాబ్ రూ.28,000కే వచ్చేస్తోంది.. ఇదంతా కలా? నిజమా?

UPI యూజర్లకు బిగ్ రిలీఫ్.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆఫీషియల్ క్లారిటీ వచ్చేసింది!

నాయిస్ ఐకాన్ బజ్ స్మార్ట్‌వాచ్‌పై భారీ డిస్కౌంట్..వెంటనే కొనేయండి

Big Stories

Advertisement
×