E-Paper
Advertisement

మహ్మద్ సిరాజ్ బ్యాట్ లో స్ప్రింగులు..చెక్ చేసిన లంక క్రికెట‌ర్లు

మహ్మద్ సిరాజ్ బ్యాట్ లో స్ప్రింగులు..చెక్ చేసిన లంక క్రికెట‌ర్లు
Advertisement

Sri lankan Players Check Siraj Bat: శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా (Sri Lanka Cricket XI vs India) మధ్య వార్మ‌ప్ మ్యాచ్ నిన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) బ్యాటింగ్ లో ఇరగదీశాడు. భారీ సిక్సర్లతో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ లో ఏకంగా నాలుగు సిక్సర్లు బాది, ఫుల్ మీల్స్ అందించాడు మహమ్మద్ సిరాజ్. అయితే భారీ సిక్సర్లు కొట్టిన మహమ్మద్ సిరాజ్ ను లంక ప్లేయర్లు అవమానించారు. బౌలర్ సిక్సర్లు కొట్టడం ఏంటని.. బ్యాట్ తీసుకొని చెక్ చేశారు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

సిరాజ్ భారీ సిక్సులు..బ్యాట్ చెక్ చేసిన లంక ప్లేయర్లు!

శ్రీలంక ఎలెవన్ జట్టుతో జరిగిన వార్మ‌ప్ మ్యాచ్ సందర్భంగా మొత్తంగా మహమ్మద్ సిరాజ్ ( Siraj Sixes) నాలుగు సిక్సర్లు కొట్టాడు. ఇందులో హ్యాట్రిక్ సిక్సర్లు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెవిలియన్ కు వెళ్తున్న సమయంలో శ్రీలంక క్రికెటర్లు… మహమ్మద్ సిరాజ్ ను అవమానించారు. అతని బ్యాట్ తీసుకొని.. చెక్ చేశారు. అందులో స్ప్రింగులు పెట్టాడా ? అనే అనుమానంతో వివాదానికి తెర లేపారు శ్రీలంక ప్లేయర్లు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన లంక క్రికెటర్లు దారుణంగా కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శ‌క్తి, టీమిండియాకు లేదు

మహమ్మద్ సిరాజ్ ( Md Siraj) బ్యాట్ లో చిప్పులు లేదా స్ప్రింగులు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారు. లేకపోతే ఓ బౌలర్ ఇలా భారీ సిక్సర్లు కొట్టడం నమ్మలేకపోతున్నామని ఫైర్ అవుతున్నారు. దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇండియన్ ఫాన్స్ మాత్రం మహమ్మద్ సిరాజ్… గతంలో కూడా ఇలా బ్యాటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయని చెబుతున్నారు. లంక బౌలర్లు సరిగ్గా బౌలింగ్ చేయకపోతే… ఎవరైనా ఇలాగే బ్యాటింగ్ చేస్తారని శ్రీలంకకు కౌంటర్ ఇస్తున్నారు.

వార్మ‌ప్ మ్యాచ్ లో శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా

Advertisement

టీమిండియా వర్సెస్ శ్రీలంక ( IND VS SL ) జట్ల మధ్య వార్మ‌ప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 363 పరుగులు సాధించింది. ఆ తర్వాత టీమ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో 357 పరుగులు సాధించడం జరిగింది. శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్ లో 200 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అద్భుతంగా రాణించి ఆరు వికెట్ల తేడాతో టీమిండియా లక్ష్యాన్ని చేదించింది. ఈ మ్యాచ్ లో మొహమ్మద్ సిరాజ్ 15 బంతుల్లో 32 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సిక్సర్లు ఓ బౌండరీ ఉంది.

Virender Sehwag On 2027 Odi World Cup: బుమ్రాను ప‌క్క‌కు పెట్టి.. ష‌మీ, సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్ ల‌ను తీసుకోండి

 

Related News

రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ అభిమానుల‌కు మోడీ స‌ర్కార్ బిగ్ షాక్ !

ఉస్మాన్ తారిక్ కు మరో అవ‌మానం…బౌలింగ్ ఇవ్వ‌కుండా ప‌రువు తీసిన కెప్టెన్

గాయాల పేరుతో డ్రామాలు చేసే వాళ్ల జీతాలు క‌ట్ చేయండి !

ఐపీఎల్ ఆడి, టీమిండియా ప్లేయర్ల ర‌హ‌స్యాలు రాబ‌ట్టాను

మ‌రో వివాదంలో రిష‌బ్ పంత్..బంతిని ఫుట్ బాల్ లాగా త‌న్ని మ‌రీ

బుమ్రాను ప‌క్క‌కు పెట్టి.. ష‌మీ, సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్ ల‌ను తీసుకోండి

రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శ‌క్తి, టీమిండియాకు లేదు

Big Stories

Advertisement
×