BigTV English

Nio Phone 2: కార్ ఫంక్షన్‌లను కంట్రోల్ చేసే ఫీచర్లతో నియో కొత్త ఫోన్.. అన్నీ ఫోన్‌తోనే చేయొచ్చు..!

Nio Phone 2: కార్ ఫంక్షన్‌లను కంట్రోల్ చేసే ఫీచర్లతో నియో కొత్త ఫోన్.. అన్నీ ఫోన్‌తోనే చేయొచ్చు..!

Nio Phone 2: టెక్ బ్రాండ్ నియో నుంచి త్వరలో మరో ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో పరిచయం కావడానికి సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే నియో వైస్ ప్రెసిడెంట్ బై జియాన్ తన సెకండ్ జెన్ స్మార్ట్‌ఫోన్ ‘నియో ఫోన్ 2’ను నియో ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ డే సందర్భంగా జూలై 27న లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొత్త స్మార్ట్‌ఫోన్ అనేక అప్‌గ్రేడ్‌లతో వస్తుందిని తెలిపారు. Nio Phone 2 స్మార్ట్‌ఫోన్ AI ఫీచర్లతో వస్తుంది. ఇందులో Qualcomm Snapdragon 8 Gen 3ని అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.


ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ జెన్ 3 ఓవర్‌లాక్డ్ వెర్షన్‌ను కలిగి ఉండే అవకాశం కూడా ఉంది. అలాగే ఇది పనితీరును మెరుగుపరచడమే కాకుండా మరింత డిమాండ్ ఉన్న యాప్‌లు, ఫీచర్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవల చైనా 3C సర్టిఫికేషన్ ప్లాట్‌ఫారమ్‌లో కనిపించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంటుందని చెప్పబడింది. కాగా ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. అయితే ఖచ్చితమైన ఛార్జింగ్, బ్యాటరీ స్పెసిఫికేషన్‌లు వెల్లడించలేదు.

Also Read:  ఒప్పో నుంచి కెమెరా కింగ్ ఫోన్లు.. ఫీచర్లు అదుర్స్.. లాంచ్ ఎప్పుడంటే?


ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి Huawei, Xiaomi ప్రవేసించడంతో.. అదే మాదిరి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి నియో ప్రవేశించిందని తెలుస్తోంది. ఈ బ్రాండ్ తన వాహనాలతో అనుసంధానించే స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది. నియో ఎలక్ట్రిక్ వెహికల్ ఎకోసిస్టమ్‌తో మెరుగైన కనెక్టివిటీని కలిగి ఉంది. Nio Phone 2 వినియోగదారులకు వారి స్మార్ట్‌ఫోన్ నుండి నేరుగా అనేక కార్ ఫంక్షన్‌లను కంట్రోల్ చేసేలా ఫీచర్లను అందించింది. దీని ద్వారా మెరుగైన, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో అన్‌లాక్/లాకింగ్, వాహనాన్ని స్టార్ట్ చేయడం, సెట్టింగ్‌లను సర్దుబాటు చేయడం, కారు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను యాక్సెస్ చేయడం వంటివి ఉంటాయి.

నియో తన వినియోగదారులకు ప్రత్యేకమైన, మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. ఇందులో భాగంగానే వినియోగదారులకు ప్రత్యేకమైన ఫీచర్లను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. నియో తన మొదటి స్మార్ట్‌ఫోన్ నియో ఫోన్‌ను సెప్టెంబర్ 2023లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఓవర్‌లాక్డ్ 3.36GHz స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.81-అంగుళాల 2K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది 5,200mAh బ్యాటరీతో మార్కెట్‌లో రిలీజ్ అయింది.

Related News

Brain SuperComputer: మనిషి మెదడు లాంటి సూపర్ కంప్యూటర్.. చైనా అద్భుత సృష్టి

Call Transcribe Pixel: పాత పిక్సెల్ ఫోన్‌లలో కొత్త ఫీచర్.. కాల్ ట్రాన్స్‌క్రైబ్.. ఎలా చేయాలంటే?

Pixel 10 Pro Alternatives: పిక్సెల్ 10 ప్రో కంటే బెటర్? టాప్ కెమెరా ఫోన్లు ఇవే..

AI Security Robots: సెక్యూరిటీ రోబోలు.. ఇండియాలో వచ్చేస్తున్నాయ్.. మీరు కొనుగోలు చేస్తారా?

iPhone 17 Series: ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది.. ఇక ఈ 6 ఆపిల్ ప్రొడక్స్ కనిపించవా?

iphone 17 Price: ఐఫోన్ 17 సిరీస్ త్వరలోనే లాంచ్.. ఇండియాలో ధరలు ఇవే

Big Stories

×