E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో లగ్జరీ లుక్.. నాయిస్ నుంచి అదిరిపోయే ఉమెన్స్ స్మార్ట్‌వాచ్!

బడ్జెట్ ధరలో లగ్జరీ లుక్.. నాయిస్ నుంచి అదిరిపోయే ఉమెన్స్ స్మార్ట్‌వాచ్!
Advertisement

Noise Diva Araya smartwatch: ప్రస్తుత ట్రెండ్‌లో స్మార్ట్‌ వాచ్‌లు కేవలం టెక్ గాడ్జెట్‌గా మాత్రమే కాకుండా.. ఫ్యాషన్ యాక్సెసరీస్‌గా కూడా మారిపోయాయి. ముఖ్యంగా మహిళలు తమ ట్రెండీ ఔట్‌ ఫిట్స్‌కి సరి పోయేలా స్టైలిష్‌గా ఉండే స్మార్ట్‌ వాచ్‌లను ఇష్టపడుతున్నారు. వారి అంచనాలను అందుకునేలా ప్రముఖ వేరబుల్ బ్రాండ్ ‘నాయిస్’మార్కెట్లోకి తెచ్చిన అద్భుతమైన మోడల్ ‘Noise Diva Araya’.కేవలం రూ.7,999 ధర కేటగిరీలో లభిస్తున్న ఈ స్మార్ట్‌ వాచ్ డిజైన్, ఫీచర్ల పరంగా మార్కెట్‌లో హాట్ టాపిక్ అవుతోంది. అసలు ఈ గాడ్జెట్ ప్రత్యేకతలు ఏంటో వివరంగా చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

ప్రీమియం డిజైన్ , అమేజింగ్ డిస్‌ప్లే:

ఈ స్మార్ట్‌వాచ్ ప్లస్ పాయింట్ దీని డిజైన్. సాధారణ స్మార్ట్‌ వాచ్‌లలా రెక్టాంగిల్ లేదా రౌండ్ బాక్సులా కాకుండా.. ఇది చాలా ఆకర్షణీయమైన జ్యువెల్లరీ-ఇన్‌స్పైర్డ్ లుక్‌లో వస్తుంది. చేతికి పెట్టుకుంటే.. ఒక ఖరీదైన వాచ్ లేదా బ్రా స్‌లెట్ లా కనిపిస్తుంది. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇందులో అద్భుతమైన అమెలోడ్ డిస్‌ప్లేను అందించారు. దీని వల్ల ఎండలో బయట తిరిగినప్పటికీ స్క్రీన్ చాలా స్పష్టంగా, బ్రైట్‌గా కనిపిస్తుంది. ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే సపోర్ట్ కూడా దీనికి ఉండటం విశేషం.

హెల్త్ ఫీచర్స్:

Advertisement

ఈ రోజుల్లో హెల్త్ ట్రాకింగ్ చాలా ముఖ్యం. నాయిస్ దివా ఆరయాలో మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకమైన ఫీచర్లను పొందుపరిచారు.

పీరియడ్ ట్రాకర్: మహిళల పీరియడ్స్ కచ్చితంగా ట్రాక్ చేసి ముందస్తు హెచ్చరికలు ఇస్తుంది.

Advertisement

హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ (SpO2) లెవెల్స్, నిద్రపోయే విధానాన్ని పర్ఫెక్ట్‌గా అంచనా వేస్తుంది.

ఒత్తిడిని తగ్గించడానికి.. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.

స్మార్ట్ ఫీచర్లు, కనెక్టివిటీ:

బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉండటం వల్ల, ఫోన్ చేతిలో లేకపోయినా వాచ్‌ ద్వారానే నేరుగా కాల్స్ మాట్లాడొచ్చు. దీని బిల్ట్-ఇన్ మైక్రోఫోన్ స్పీకర్ క్వాలిటీ చాలా స్పష్టంగా ఉంటుంది. అలాగే.. వాట్సాప్, ఇన్‌స్టా, టెక్స్ట్ మెసేజ్‌లు , ఇతర యాప్ నోటిఫికేషన్‌లను నేరుగా వాచ్‌లోనే చూసుకోవచ్చు. వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.

Also Read: యూత్ కోసం నాయిస్ సరికొత్త ప్రయోగం! ఈ ట్రెండీ ఇయర్‌బడ్స్ చూశారా?

బ్యాటరీ లైఫ్, బిల్డ్ క్వాలిటీ:

ఎక్కువ రోజులు ఛార్జింగ్ రాకపోతే ఏ స్మార్ట్‌ వాచ్‌ అయినా ఇబ్బందే. నాయిస్ దివా ఆరయా సాధారణ వాడకంలో.. మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల తక్కువ సమయంలోనే.. పూర్తిగా ఛార్జ్ అవుతుంది. అలాగే ఇది వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌తో వస్తుంది కాబట్టి వర్షంలో తడిచినా లేదా వర్కవుట్ చేసే సమయంలో చెమట పట్టినా ఎలాంటి ఇబ్బంది ఉండదు.

రూ.7,999 బడ్జెట్‌లో స్టైల్, లగ్జరీ లుక్ , లేటెస్ట్ స్మార్ట్ ఫీచర్లు అన్నీ కోరుకునే మహిళలకు ‘Noise Diva Araya’ ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పవచ్చు. మీ పర్సనాలిటీని మరింత ట్రెండీగా మార్చుకోవడానికి ఈ స్మార్ట్‌ వాచ్ కచ్చితంగా సూట్ అవుతుంది.

Related News

టాప్ 5 ఏఐ టూల్స్..ఈ ట్రిక్స్ తెలిస్తే వర్క్ చిటికెలో అయిపోతుంది!

ల్యాప్‌టాప్ వెబ్‌క్యామ్ పక్కన ఈ చిన్న హొల్స్‌ ఎందుకు ఉంటాయో తెలుసా?

యూత్ కోసం నాయిస్ సరికొత్త ప్రయోగం! ఈ ట్రెండీ ఇయర్‌బడ్స్ చూశారా?

గూగుల్ డ్రైవ్‌లో ఫైల్స్ అప్లోడింగ్ చాలా స్లోగా ఉందా? ఈ సింపుల్ ట్రిక్స్ ట్రై చూసి చూడండి!

కొత్త ఫోన్ కొనడానికి ముందు ఈ 5 విషయాలు చూడకపోతే నష్టపోవడం ఖాయం!

ఫోన్ కెమెరాలో HDR ఆన్ చేస్తే ఏమవుతుంది? చాలా మంది చేసే పొరపాటు ఇదే!

ఆన్‌లైన్ మోసాల బారిన పడి డబ్బులు పోయాయా? ఇలా చేస్తే రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది!

Big Stories

Advertisement
×