E-Paper
Advertisement

నాయిస్ ఐకాన్ బజ్ స్మార్ట్‌వాచ్‌పై భారీ డిస్కౌంట్..వెంటనే కొనేయండి

నాయిస్ ఐకాన్ బజ్ స్మార్ట్‌వాచ్‌పై భారీ డిస్కౌంట్..వెంటనే కొనేయండి
Advertisement

Noise Icon Buzz smartwatch: ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ వాచ్‌లు కేవలం టైం చూడటానికే కాకుండా, ఆరోగ్యాన్ని , ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మార్కెట్లో.. అందుబాటులో ఉన్న అనేక బ్రాండ్లలో ‘నాయిస్’ (Noise) సంస్థ తన వినూత్న ఉత్పత్తులతో కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.వారి బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని నాయిస్ సంస్థ ప్రముఖంగా తీసుకొచ్చిన ‘నాయిస్ ఐకాన్ బజ్’ (Noise Icon Buzz) స్మార్ట్‌వాచ్ ప్రస్తుతం మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. 1.69 అంగుళాల పెద్ద డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, వాయిస్ అసిస్టెంట్ వంటి లేటెస్ట్ ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్‌వాచ్‌పై ప్రస్తుతం ఈ-కామర్స్ వేదికలపై భారీ ఆఫర్ నడుస్తోంది. ఏకంగా 74% డిస్కౌంట్ పోను ఇది కేవలం రూ.1,299 ధరకే ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ వాచ్‌కు సంబంధించిన పూర్తి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1.డిస్‌ప్లే:

ఈ స్మార్ట్‌వాచ్ 1.69 అంగుళాల (1.69″) స్పష్టమైన టచ్ డిస్‌ప్లేతో వస్తుంది. దీని స్క్రీన్ డిజైన్ చాలా సన్నని బెజెల్స్‌తో కూడి ఉండి, చేతికి చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఎడిషన్ మోడరన్ లుక్‌ను ఇస్తుంది. వాచ్‌తో పాటు వచ్చే.. సిలికాన్ స్ట్రాప్స్ చాలా మృదువుగా ఉండి, రోజంతా వాచ్‌ వల్ల  ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాయి. అంతే కాకుండా స్క్రీన్ బ్రైట్‌నెస్ బాగుండటం వల్ల ఎండలో కూడా డిస్‌ప్లే స్పష్టంగా కనిపిస్తుంది.

2.బ్లూటూత్ కాలింగ్, వాయిస్ అసిస్టెంట్:

Advertisement

ఈ బడ్జెట్ ధరలో లభించే అత్యంత ముఖ్యమైన ఫీచర్ బ్లూటూత్ కాలింగ్. ఫోన్ చేతిలో.. లేనప్పటికీ, వాచ్‌లోనే.. ఇన్‌కమింగ్ కాల్స్‌ను మాట్లాడే , రిసీవ్ చేసుకునే అవకాశం ఇందులో ఉంది. అలాగే  స్పీకర్, మైక్రోఫోన్ సహాయంతో.. వాయిస్ అసిస్టెంట్‌ను ఈజీగా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా చిన్నపాటి పనులను సింపుల్ గా చేసుకోవచ్చు. కాల్స్ మాట్లాడే సమయంలో.. ఆడియో క్లారిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

3.ఫిట్‌నెట్ ట్రాకింగ్:

ఆరోగ్య స్పృహ ఉన్నవారికి ఈ స్మార్ట్‌వాచ్ బెస్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇందులో హార్ట్ రేట్ మానిటర్, SpO2 (రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను) గుర్తించే సెన్సార్, స్లీప్ మానిటర్ (నిద్ర తీరును చెక్ చేసే ఫీచర్) వంటివి ఉన్నాయి. ఇవి రోజు వారీ ఆరోగ్య సమాచారాన్ని.. మన మొబైల్ యాప్‌కు అందిస్తాయి. అంతేకాకుండా.. వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్, స్టెప్ ట్రాకర్ వంటివి ఫిట్‌నెస్ లవర్స్ కు డైలీ వర్కౌట్లలో బాగా ఉపయోగపడతాయి.

4.బ్యాటరీ బ్యాకప్:

Advertisement

ఈ స్మార్ట్‌ వాచ్‌లో బెస్ట్ బ్యాటరీ ఉంటుంది. అందుకే ఒక్క సారి.. పూర్తి ఛార్జ్ చేస్తే.. సాధారణ వాడకంలో ఇది సుమారు 7 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. అలాగే దీనికి వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ ఉండటం వల్ల.. వర్షంలో లేదా చెమట పట్టినప్పుడు వాచ్ పాడైపోతుందనే టెన్షన్ ఉండదు. ఇందులో చిన్నపాటి బిల్ట్-ఇన్ గేమ్స్ కూడా అందించడం విశేషం.

రూ. 5,000లకు పైగా అసలు ధర కలిగిన ఈ ప్రీమియం ఫీచర్ల స్మార్ట్‌వాచ్‌ను.. కేవలం రూ. 1,299 ధరకే సొంతం చేసుకోవడానికి ఇదే సరియైన టైం. బడ్జెట్ ధరలో గొప్ప ఫీచర్లు, స్టైలిష్ లుక్ కోరుకునే వారికి ఇది నూటికి నూరుశాతం బెస్ట్ ఛాయిస్.

Related News

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

Big Stories

Advertisement
×