Flipkart GOAT Sale 2026: యాపిల్ లవర్స్‌కు ఫ్లిప్‌కార్ట్ సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ప్రారంభం కాబోయే GOAT Saleలో ఐఫోన్ 17 సిరీస్‌పై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఈ సేల్‌లో iPhone 17 బేస్ మోడల్‌తో పాటు ప్రో మోడల్స్‌పై ఏకంగా రూ.22,000 వరకు డిస్కౌంట్ లభించనుంది. జూలై 4 నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చే ఈ సేల్.. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్లకు జూలై 3 నుంచే ముందస్తుగా అందుబాటులోకి రానుంది. కేవలం ధర తగ్గింపు మాత్రమే కాకుండా.. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, నో-కాస్ట్ ఈఎంఐ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.
లాంచ్ సమయంలో రూ.82,900గా ఉన్న iPhone 17 బేస్ వేరియంట్ ధర.. ఈ సేల్‌లో రూ.70,900కే లభించనుంది. అలాగే iPhone 17 Pro మోడల్స్ కొనుగోలు చేయాలనుకునే వారికి మరింత భారీగా ఆదా అవుతుంది. ఈ సేల్‌లో iPhone 17 Pro ధర రూ.1,12,900గాను, iPhone 17 Pro Max ధర రూ.1,27,900 గాను ఉండనుంది. ఎంచుకున్న బ్యాంక్ కార్డులపై అదనంగా 10 శాతం వరకు డిస్కౌంట్ పొందే అవకాశం కూడా ఉంది.
యాపిల్ సంస్థ ఇటీవల భారతదేశంలో తమ ఇతర ప్రొడక్ట్స్ ధరలను పెంచుతూ వస్తోంది. త్వరలోనే ఐఫోన్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఎలాంటి ధరల పెరుగుదల లేకుండా iPhone 17 సిరీస్‌ను తక్కువ ధరకు సొంతం చేసుకోవడానికి ఈ సేల్ ఒక మంచి అవకాశం. అయితే, అమెజాన్ ప్రైమ్ డే వంటి రాబోయే ఇతర సేల్స్‌తో ధరలను పోల్చి చూసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Also Read: యాపిల్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. మార్కెట్లోకి ఫస్ట్ Foldable iPhone, డిజైన్ చూస్తే ఫ్లాట్ అయిపోతారు!
ఈ ఏడాది సెప్టెంబర్‌లో రాబోయే iPhone 18 Pro సిరీస్ ధరలు భారీగా ఉండనున్నాయని లీక్స్ సమాచారం. కొత్త A20 ప్రో చిప్, 12GB ర్యామ్, అప్‌గ్రేడెడ్ ఏఐ ఫీచర్లు, సరికొత్త కెమెరా సిస్టమ్ వల్ల దీని తయారీ ఖర్చు పెరిగింది. ఫలితంగా iPhone 18 Pro మోడల్స్ భారత మార్కెట్లో రూ.1,19,900 నుంచి రూ.1,59,900 వరకు ఉండే అవకాశం ఉంది. అంతేకాదు.. సరికొత్త Foldable iPhone Ultra కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
బడ్జెట్‌లో మంచి వాల్యూ ఉన్న ఐఫోన్ కోరుకుంటే.. ప్రస్తుతం భారీ డిస్కౌంట్‌తో లభిస్తున్న iPhone 17 సిరీస్‌ను కొనుగోలు చేయడం ఉత్తమం. దీనివల్ల డబ్బు ఆదా అవ్వడమే కాకుండా.. తదుపరి ధరల పెరుగుదల నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ డబ్బుతో సంబంధం లేకుండా లేటెస్ట్ ఏఐ ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ కెమెరా కావాలనుకుంటే మాత్రం iPhone 18 సిరీస్ కోసం వేచి చూడవచ్చు. అయితే, కొత్త మోడల్స్ ప్రారంభంలో స్టాక్ కొరత ఉండే అవకాశం కూడా ఉందని గుర్తుంచుకోవాలి.
Also Read: ధరలు పెరుగుతున్న వేళ.. Lava Agni 4పై ఊహించని డిస్కౌంట్.. ఆఫర్ కొద్దిరోజులే!