BigTV English

OPPO Find X8 series Launch Date : ఒప్పో టైమ్ ఆగయా.. Find X8, Find X8 Pro ఇండియా లాంఛ్ డేట్ ఫిక్స్

OPPO Find X8 series Launch Date : ఒప్పో టైమ్ ఆగయా.. Find X8, Find X8 Pro ఇండియా లాంఛ్ డేట్ ఫిక్స్

OPPO Find X8 series Launch Date : ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ తో కొత్త మొబైల్స్ ను తీసుకొస్తున్న ప్రముఖ స్మార్ట్ తయారీ సంస్థ ఒప్పో త్వరలోనే రెండు కొత్త ఫోన్స్ ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒప్పో నుంచి ఒప్పో ఫైండ్​ ఎక్స్ 8 సిరీస్ రాబోతుందని తెలిసినప్పటి నుంచి టెక్ వర్గాలు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూశాయి ఈ నేపథ్యంలో ఈ రెండు మెుబైల్స్ లాంఛ్ డేట్ ను ఒప్పో ప్రకటించింది.


చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో… ఒప్పో ఫైండ్​ ఎక్స్ 8 సిరీస్​ను తీసుకురానుంది. ఈ సిరీస్ లో  Find X8,  Find X8 Pro ఉన్నాయి. ఇప్పటికే లీకైన ఫీచర్స్ తో ఈ మెుబైల్స్ ఎప్పుడెప్పుడు లాంఛ్ అవుతాయా అంటూ టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరందరికీ ఒప్పో గుడ్ న్యూస్ చెప్పేసింది. తన ఫ్లాగ్‌షిప్ Find X8 సిరీస్‌ను నవంబర్ 21న భారత్ లో లాంఛ్ చేయనున్నట్లు తెలిపింది.

 Oppo Find X8, Find X8 Pro తాజాగా చైనాలో లాంఛ్ అయ్యాయి. ఇక ఈ సిరీస్​ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ సైతం అదిరిపోయే రీతిలో ఉన్నాయి.


ప్రాసెసర్ –

Oppo Find X 8, Oppo Find X8 pro మెుబైల్స్ మీడియా టెక్​ డైమన్సిటీ 9400 ఎస్​ఓసీతో పని చేస్తాయి.

డిస్ ప్లే –

Oppo Find X8లో 6.59 అంగుళాల ప్లాట్ అమోలెడ్​ స్క్రీన్​, 1.5K రిజల్యూషన్, 120 HZ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఇక ప్రో మోడల్ లో 6.78 అంగుళాల స్క్రీన్, 2K మైక్రో కర్వ్​డ్​ అమోలెడ్​ స్క్రీన్​, 120 HZ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్స్ డిస్​ ప్లే అత్యాధునిక ఎల్​టీపీఓ టెక్నాలజీని కలిగి ఉంది.

బ్యాటరీ, ఛార్జింగ్ –

100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ కు​, 50W వైర్​లెస్​ ఛార్జింగ్​కు సపోర్ట్ చేస్తాయి. అయితే ప్రో మోడల్ బ్యాటరీ 5910mah గా రాబోతుంది. ఇది స్టాండర్డ్​ వేరియంట్ 5630mah తో పోలిస్తే కాస్త పెద్దదనే చెప్పాలి.

కెమెరా –

ఒప్పో Find X8 Pro మోడల్​లో ఓఐఓ సపోర్ట్​తో 50 మెగా పిక్సల్​ సోనీ ఎల్​వైటీ 800 ప్రైమరీ సెన్సార్​ ఉంది. ఇక 50 మెగా పిక్స్​ల్​ అల్ట్రా వైడ్​ లెన్స్​తో పాటు 50 మెగా పిక్సల్​ టెలిఫొటో పెరిస్కోప్ లెన్స్​​ కూడా ఉన్నాయి. ఈ ఎక్స్ 8 ప్రో మోడల్​లో 4 రియల్ కెమెరాస్​ కూడా ఉన్నాయి. టెలిఫొటో షూటర్​, పెరిస్కోప్ లెన్స్ తో ఈ మెుబైల్ రాబోతుంది. ఇక ఎక్స్​ 8 మోడల్​లో స్టాండర్డ్ ట్రిపుల్ కమెరా సెటప్ ఉంది. 50 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా, 50 మెగా పిక్సల్​ టెలిఫొటో, 50 మెగా పిక్సల్​ అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. మొత్తంగా ఈ ఎక్స్ 8 సిరీస్​లో 32 మెగా పిక్స్​ల్​ సెల్ఫీ కెమెరా సైతం ఉంది.

ఇంకా ఈ ఫైండ్ ఎక్స్​ 8 సిరీస్​ అండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్​ 15తో నడుస్తుంది. ఈ మెుబైల్స్ ధర విషయానికి వస్తే…  ఎక్స్​ 8 సిరీస్​ ధర రూ.54,250 నుంచి ప్రారంభం కావొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ALSO READ : వావ్.. రూ. 599కే హై స్పీడ్ ఇంటర్నెట్, 12 OTT ప్లాట్‌ఫారమ్స్, 800కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్

 

 

Related News

Google Pixel 9 vs Pixel 10: పిక్సెల్ 10 కంటే పిక్సిల్ 9 బెటర్.. ఎందుకంటే?

Grok Imagine AI: ఇప్పుడు ఏఐ వీడియో, ఇమేజ్‌‌లు చేయడం అంతా ఫ్రీ.. అందరికీ అందుబాటులో గ్రోక్ ఇమేజిన్

Lava Play Ultra 5G: కేవలం రూ.14999కే సూపర్ గేమింగ్ ఫోన్.. 64MP కెమెరా, భారీ బ్యాటరీతో లాంచ్

Google Pixel 10 Series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఇండియాలో విడుదల.. అద్భుత కెమెరా, పవర్ ఫుల్ ఏఐ ఫీచర్లు

Vivo V60: 50MP కెమెరా, పెద్ద బ్యాటరీ.. వివో ఫ్లాగ్ షిప్ ఫోన్ పై భారీ డిస్కౌంట్

ChatGPT Free vs ChatGPT Go vs ChatGPT Plus: ఏ ప్లాన్ బెటర్.. మీరు ఏది ఎంచుకోవాలి?

Big Stories

×