Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో నామినేషన్స్ అనేవి చాలా డిఫరెంట్‌గా మారిపోయాయి. మామూలుగా నామినేషన్స్ అంటే ఒక కంటెస్టెంట్ మరో ఇద్దరు కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేయాలి. కానీ బిగ్ బాస్ 8లో గత కొన్ని వారాలుగా కేవలం ఒక కంటెస్టెంట్‌ను మాత్రమే నామినేట్ చేసే అవకాశం ఇస్తున్నారు బిగ్ బాస్. అలా ఈసారి నామినేషన్స్‌లో ముందుగా కంటెస్టెంట్.. తమ నామినేషన్‌కు గల కారణాలను చెప్పిన తర్వాత నామినేట్ అయిన కంటెస్టెంట్ వచ్చి తమ పాయింట్స్ చెప్పుకోవాలి. బిగ్ బాస్ 8 లేటెస్ట్ నామినేషన్స్‌కు సంబంధించిన రెండో ప్రోమో తాజాగా విడుదలయ్యింది. అందులో గౌతమ్ – పృథ్వి, యష్మీ – టేస్టీ తేజ మధ్య హాట్ చర్చలు జరిగాయి.
నేను భయపడను
గార్డెన్ ఏరియాలో ఒక పెయింట్ బ్రష్ పెట్టి ఉంటుంది. ఆ బ్రష్‌ను బజర్ వచ్చినప్పుడు ముందుగా ఎవరైతే వెళ్లి పట్టుకుంటారో.. వారికే నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ముందుగా ఆ బ్రష్.. గౌతమ్ చేతికి వెళ్లింది. అందుకే పృథ్విని నామినేట్ చేశాడు. ‘‘తనకు జరిగినప్పుడు తప్పు. వేరేవాళ్లకు జరిగినప్పుడు తప్పు కాదు అనేది ఏదైతే భావన ఉందో అదే పెద్ద తప్పు’’ అంటూ కారణం చెప్పాడు గౌతమ్. అలా నామినేట్ చేసి యాక్షన్ ఏరియా నుండి బయటికి రాగానే పృథ్వి వచ్చి గౌతమ్‌తో గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ‘‘నువ్వు చెప్పే మాటలకు వేరేవాళ్లు భయపడతారేమో. నేను భయపడను’’ అంటూ తిరిగి కౌంటర్ ఇచ్చాడు గౌతమ్.
Also Read: పాపం టేస్టీ తేజ.. మీద పడ్డ కన్నడ బ్యాచ్..!
ఏంటా గొడవ
ఇక టేస్టీ తేజ, యష్మీ మధ్య మళ్లీ గత వారం గురించి గొడవ మొదలయ్యింది. టేస్టీ తేజ వెళ్లి యష్మీని నామినేట్ చేశాడు. దానికి యష్మీ రివర్స్ అయ్యింది. ‘‘నేను చేసింది తప్పు అనుకుంటావో ఒప్పు అనుకుంటావో నీ ఇష్టం’’ అని యష్మీ అనగానే ఆ మాట వినకుండానే తప్పే అది అనేశాడు తేజ. తేజ ఇచ్చే కౌంటర్లు నచ్చక యష్మీ అరవడం మొదలుపెట్టింది. దీంతో తేజ కూడా వ్యంగ్యంగా రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టాడు. చిరాకు పడింది యష్మీ. తేజకు కూడా కోపమొచ్చింది. నీది తప్పంటే నీది తప్పు అని అరుచుకున్నారు. గత వారం జరిగిన టాస్కులో తేజతో పాటు యష్మీది కూడా తప్పున్నా అందరూ తేజనే టార్గెట్ చేశారు. అందుకే ఈ నామినేషన్స్‌లో యష్మీ, తేజ గొడవై హైలెట్ అవుతుంది.
ఓవరాక్షన్ తగ్గనుందా
ఇప్పటికే బిగ్ బాస్ 8 హౌస్‌లో కన్నడ బ్యాచ్ ఓవరాక్షన్ ఉందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. స్పెషల్‌గా ఈ ప్రోమోలో మాత్రం కన్నడ బ్యాచ్ అయిన యష్మీ, పృథ్విని గౌతమ్, టేస్టీ తేజ ఎదిరించడం ఆడియన్స్‌ను తృప్తిపరుస్తోంది. కన్నడ బ్యాచ్ అయిన నిఖిల్, పృథ్వి, యష్మీ, ప్రేరణ ఓవరాక్షన్ ఎక్కువయిపోయింది. ఏదైనా టాస్కులు వచ్చినప్పుడు, మెగా చీఫ్ టాస్క్ జరుగుతున్నప్పుడు ఈ నలుగురు కలిసి మరొక కంటెస్టెంట్‌ను ముందుకు రానివ్వడం లేదు. అదే విషయంలో ఈసారి నామినేషన్స్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయనున్నాయని తెలుస్తోంది.