E-Paper
Advertisement

ఒప్పో షాకింగ్ నిర్ణయం.. ఆ ప్రీమియం ఫోన్‌పై ఏకంగా రూ.64,000 తగ్గింపు, ఎక్కడ కొనుగోలు చేయాలంటే?

ఒప్పో షాకింగ్ నిర్ణయం.. ఆ ప్రీమియం ఫోన్‌పై ఏకంగా రూ.64,000 తగ్గింపు, ఎక్కడ కొనుగోలు చేయాలంటే?
Advertisement

Oppo Find X9s: ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఒప్పో Find X9s స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకునేందుకు ఒక మంచి అవకాశం వచ్చింది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన ఈ ప్రీమియం ఫోన్‌ను లాంచ్ ధర కంటే చాలా తక్కువకే కొనుగోలు చేయవచ్చు.

43 శాతం డిస్కౌంట్:

ఒప్పో సంస్థ తమ Find X9s మోడల్‌లోని 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.1,39,999 MRPతో మార్కెట్లోకి తెచ్చింది. కానీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ఏకంగా 43 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.79,999 లకే లిస్ట్ అయింది. అంటే నేరుగా రూ.60 వేల వరకు తగ్గింపు లభిస్తోంది.

బ్యాంక్ ఆఫర్లతో అదనపు లాభం:

Advertisement

రూ.79,999కే అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించి మరింత తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేస్తే.. మరో రూ.4,000 వరకు అదనపు డిస్కౌంట్ వస్తుంది. దీనివల్ల ఈ ఫోన్ మరింత చీప్‌గా లభిస్తుంది.

Also Read:

అద్భుతమైన కెమెరా, డిస్‌ప్లే ఫీచర్లు:

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. దీనిలో 6.59 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 3600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీనికి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉంది. ఇక కెమెరా పరంగా చూసుకుంటే.. వెనుక వైపు OIS సపోర్టుతో 50MP ప్రధాన కెమెరాతో పాటు మరో రెండు 50MP కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ముందు వైపు 32MP కెమెరాను అమర్చారు.

పవర్‌ఫుల్ బ్యాటరీ, కలర్ ఓఎస్:

ఈ ఫోన్ కలర్ ఓఎస్ 16 ఆధారిత ఆండ్రాయిడ్ 16పై పనిచేస్తుంది. దీనిలో ఏకంగా 7025mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఇచ్చారు. ఇది 80W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇన్-డిస్‌ప్లే 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ రేటింగ్స్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఈ ఫోన్ సొంతం.

Also Read:

Related News

iPhone 18లో ఊహించని మార్పులు..చిన్నదైన డైనమిక్ ఐలాండ్, భారీగా ర్యామ్ పెరిగే ఛాన్స్!

ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షనా? బడ్జెట్‌లోనే.. పాకెట్ ఫ్రెండ్లీ పవర్ బ్యాంక్

ప్రతీ రోజూ 1.5GB డేటా ఇచ్చే.. రూ.330 లోపు జియో ప్లాన్స్.. ఇంకా బోలెడన్ని బెనిఫిట్స్ ఫ్రీ!

6500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్.. Vivo X300 FE కొత్త వేరియంట్ ధర, ఆఫర్ల పూర్తి వివరాలు!

BSNL బిగ్ ధమాకా ప్లాన్.. రూ. 319 కే 65 రోజుల వ్యాలిడిటీ.. ఇదేం ఆఫర్ బాబోయ్!

అమెజాన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న..హైయర్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ!

షాకింగ్ ప్రైస్ డ్రాప్.. ఏకంగా రూ.45,000 తగ్గిన Galaxy S25 Edge, ఆఫర్ ఎలా పొందాలంటే?

మార్కెట్‌లో ఫుల్ క్రేజ్ ఉన్న ఇయర్‌బడ్స్..ఇప్పుడు ఆఫర్‌‌లో !

Big Stories

Advertisement
×