HOPPUP AirDoze ARC: ప్రస్తుత రోజుల్లో వైర్ లెస్ ఇయర్ బడ్స్ కేవలం అవసరం మాత్రమే కాదు..ట్రెండ్‌గా మారిపోయాయి. అయితే.. మంచి ఫీచర్లు ఉన్న ఇయర్ బడ్స్ కొనాలంటే.. వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ అపోహను పటా పంచలు చేస్తూ.. హోప్‌అప్ సంస్థ అత్యంత బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీల్ అందించేలా ‘HOPPUP AirDoze ARC’ ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. బడ్జెట్ ధరలో బెస్ట్ మోడల్స్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు. ఈ మోడల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఇయర్ బడ్స్ మెయిన్ హైలైట్ ప్రత్యేకత వీటి డిజైన్. ఇవి సాంప్రదాయ ఇయర్ బడ్స్‌లా చెవి లోపలికి వెళ్లకుండా.. చెవికి క్లిప్ లాగా.. తగిలించుకునే.. ‘OWS’ డిజైన్‌తో వస్తాయి. దీని వల్ల ఎక్కువ గంటలు వాడినప్పటికీ.. చెవులకు ఎలాంటి నొప్పి ఉండదు. రన్నింగ్ చేసేటప్పుడు.. వ్యాయామం చేసే టప్పుడు లేదా ఆఫీసులో.. పని చేసేటప్పుడు ఇవి చెవుల నుంచి జారి పోకుండా ఉంటాయి.
ఈ ధరలో ఇలాంటి ఫీచర్ లభించడం నిజంగా విశేషం. సింగిల్ చార్జ్‌తో ఇవి ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి మొత్తం 60 గంటల పాటు నిరంతరం మ్యూజిక్ ఆస్వాదించవచ్చు లేదా కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఒక్క సారి చార్జ్ చేస్తే.. రోజంతా చార్జింగ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఇందులో లేటెస్ట్ బ్లూ టూత్ 6.0 వెర్షన్‌ను అందించారు. దీని వల్ల స్మార్ట్ ఫోన్‌తో.. కనెక్షన్ చాలా వేగంగా, స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆడియో లాగ్ లేదా కనెక్షన్ కట్ అయ్యే సమస్యలు అసలు ఉండవు. గేమింగ్ ఆడేటప్పుడు.. లేదా సినిమా చూసేటప్పుడు పర్ఫెక్ట్ సింక్ లభిస్తుంది.
చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ.. ఇందులో పవర్ ఫుల్ 12mm డ్రైవర్లను అమర్చారు. దీని వల్ల బేస్ చాలా స్పష్టంగా, క్రిస్టల్ క్లియర్ సౌండ్ ఎక్స్ పీరియన్స్ లభిస్తుంది. పాటలు వినే టప్పుడు ప్రతి బీట్ స్పష్టంగా వినిపిస్తుంది.
Also Read: రూ.1,500లోపు బెస్ట్ ఇయర్‌బడ్స్..బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ సౌండ్
బయట రద్దీగా ఉండే.. ప్రదేశాలలో.. లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు కాల్ మాట్లాడటం ఇబ్బందిగా మారుతుంది. అయితే.. దీనిలో ఉన్న ఏఐ ఈఎన్‌సీ టెక్నాలజీ చుట్టు పక్కల ఉండే.. అనవసరమైన సౌండ్ తగ్గించి.. మీ గొంతును అవతలి వారికి స్పష్టంగా వినిపించేలా.. చేస్తుంది. వైట్ కలర్, వేరియంట్‌లో లభించే ఈ ఇయర్ బడ్స్ లుక్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
కేవలం రూ. 999 ధరకే.. లభిస్తున్న ఈ హోప్‌అప్ ఎయిర్ డోజ్ ఏఆర్‌సి ఇయర్ బడ్స్, బడ్జెట్ యూజర్లకు.. ఒక పర్ ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. స్టైలిష్ లుక్, లాంగ్ బ్యాటరీ లైఫ్, మోడ్రన్ ఫీచర్లు కోరుకునే.. వారికి ఇది బెస్ట్ ఆప్షన్.