E-Paper
Advertisement

రూ.599కే ఇయర్ బడ్స్.. గేమింగ్,మ్యూజిక్ లవర్స్‌కు బెస్ట్ తెలుసా ?

రూ.599కే ఇయర్ బడ్స్.. గేమింగ్,మ్యూజిక్ లవర్స్‌కు బెస్ట్ తెలుసా ?
Advertisement

Portronics Harmonics Twins S13: తక్కువ బడ్జెట్‌లో.. అదిరిపోయే, సౌండ్ క్వాలిటీ ఇచ్చే ఇయర్ బడ్స్ కోసం వెతుకుతున్నారా ? అయితే మీకోసమే పోర్ట్రానిక్స్ (Portronics) సంస్థ నుంచి సరి కొత్త ‘హార్మోనిక్స్ ట్విన్స్ S13’ మార్కెట్లోకి వచ్చేశాయి. కేవలం రూ.599 ధరకే లభిస్తున్న ఈ ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్, స్టైలిష్ లుక్‌తో పాటు.. అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నాయి. 24 గంటల బ్యాటరీ బ్యాకప్, ప్రత్యేకమైన గేమింగ్ మోడ్‌తో వస్తున్న ఈ ట్రెండీ గార్జెట్ విశేషాలు ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

హార్మోనిక్స్ ట్విన్స్ S13 ఫీచర్లు:

1.డిజైన్:

ప్రస్తుత రోజుల్లో వైర్‌లెస్ ఇయర్ బడ్స్ లేని.. ఫోన్ వాడకం లేదనే చెప్పాలి. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్, ఆఫీస్ ఉద్యోగులు అందరూ.. ఇయర్ బడ్స్‌నే ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో సామాన్యులకు సైతం అందుబాటు ధరలో ప్రీమియం ఫీల్ పంచేందుకు ‘పోర్ట్రానిక్స్’ కంపెనీ తన హార్మోనిక్స్ సిరీస్‌లో ‘ట్విన్స్ S13’ మోడల్‌ను పరిచయం చేసింది. ఈ ఇయర్ బడ్స్ బ్లాక్ కలర్‌లో చాలా ఆకర్షణీయంగా ఉండి, చెవిలో సౌకర్యంగా ఇమిడిపోతాయి.

2.సౌండ్ క్వాలిటీ, కనెక్టివిటీ:

Advertisement

ఈ బడ్జెట్ ఇయర్ బడ్స్ సైజు చిన్నగా ఉన్నప్పటికీ.. సౌండ్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఇందులో.. శక్తివంతమైన డ్రైవర్లను అమర్చడం వల్ల పాటలు వింటున్నప్పుడు క్లియర్ బేస్ , ట్రిబుల్ ఆస్వాదించవచ్చు. అలాగే ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ 5.3 (BT 5.3v) టెక్నాలజీని వాడారు. దీని వల్ల మీ స్మార్ట్‌ఫోన్‌కు ఇయర్ బడ్స్ క్షణాల్లో.. కనెక్ట్ అవుతాయి. అంతే కాకుండా మధ్యలో కనెక్షన్ కట్ అయ్యే సమస్య ఉండదు.

3.గేమింగ్, మ్యూజిక్ మోడ్:

మ్యూజిక్ లవర్స్‌తో.. పాటు గేమర్స్‌ను ఆకట్టుకునేలా ఇందులో ప్రత్యేకంగా ‘గేమ్/మ్యూజిక్ మోడ్’ఇవ్వబడింది. మీరు గేమ్‌లు ఆడే సమయంలో.. లో-లాటెన్సీ సపోర్ట్ ద్వారా ఆడియో, వీడియో సింక్‌లో ఉండి అద్భుతమైన గేమింగ్ అనుభవాన్ని ఇస్తుంది. అలాగే కాల్స్ మాట్లాడుకునేటప్పుడు.. మైక్ పనితీరు కూడా చాలా స్పష్టంగా ఉంటుంది.

Also Read: నూనె వాడకం తగ్గించాలా? రూ.2,999కే ఈ అద్భుతమైన ఎయిర్ ఫ్రైయర్!

4. బ్యాటరీ బ్యాకప్:

Advertisement

తక్కువ ధరలో లభించినప్పటికీ.. బ్యాటరీ పర్ఫార్మెన్స్ విషయంలో ఈ ఇయర్ బడ్స్ అదుర్స్ అనిపిస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి ఇది మొత్తం 24 గంటల పాటు నాన్‌ స్టాప్ ప్లేటైమ్‌ను అందిస్తుంది. ఒకసారి.. ఫుల్ ఛార్జ్ చేస్తే రోజంతా ఎలాంటి టెన్షన్ లేకుండా.. మ్యూజిక్ లేదా కాల్స్ ఎంజాయ్ చేయవచ్చు.

5.ధర:

అన్ని లేటెస్ట్ ఫీచర్లు కలిగిన ఈ పోర్ట్రానిక్స్ హార్మోనిక్స్ ట్విన్స్ S13 ఇయర్ బడ్స్ మార్కెట్లో.. అద్భుతమైన ఆఫర్ కింద కేవలం రూ.599 ధరకే అందుబాటులో ఉన్నాయి.రూ. 600 లోపు బడ్జెట్‌లో ఇంత మంచి ఫీచర్లు ఉన్న గార్జెట్ దొరకడం నిజంగా గొప్ప విషయమే.

తక్కువ బడ్జెట్‌లో మంచి లుక్, ఎక్కువ బ్యాటరీ లైఫ్ , గేమింగ్ ఫీచర్లు కోరుకునే వారికి పోర్ట్రానిక్స్ హార్మోనిక్స్ ట్విన్స్ S13 ఒక పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ ఛాయిస్. మీరు కూడా తక్కువ ధరలో.. మంచి ఇయర్ బడ్స్ కొనాలనుకుంటే ఇది మీకు చక్కటి ఆప్షన్ అవుతుంది.

Related News

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Big Stories

Advertisement
×