Rishabh Pant seeks Uttarakhand CM Help: శ్రీలంక టూర్ లో ఉన్న టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) అర్ధరాత్రి సంచలన ట్వీట్ చేశాడు. ఏకంగా ఉత్తరాంఖడ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని (Pushkar Singh Dhami) ట్యాగ్ చేస్తూ రిషబ్ పంత్ అర్ధరాత్రి చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సొంత రాష్ట్రంలో ఇల్లు కట్టుకునేందుకు ల్యాండ్ దొరకడం లేదంటూ.. ఏకంగా ముఖ్యమంత్రినే నిలదీసే ప్రయత్నం చేశాడు రిషబ్ పంత్. తనకు ల్యాండ్ కావాల్సిందేనని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని బెదిరించినట్లుగానే పోస్ట్ పెట్టాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. దీనిపై భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి.
శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా ( Sri Lanka vs India ) మధ్య టెస్ట్ సిరీస్ ప్రస్తుతం జరుగుతోంది. మొదటి టెస్ట్ కంటే ముందు వార్మప్ మ్యాచ్ లో ఇండియన్ క్రికెటర్స్ పాల్గొంటున్నారు. అయితే ఈ సిరీస్ కు సెలెక్ట్ అయిన రిషబ్ పంత్ కూడా.. శ్రీలంకలోనే క్రికెట్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఏమైందో తెలియదు కానీ నిన్న అర్ధరాత్రి తనకు ఓ ల్యాండ్ కావాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఉత్తరాంఖడ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని ట్యాగ్ చేస్తూ ఈ పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ అయింది.
Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భయ్యా…కోహ్లీని, నన్ను బండబూతులు తిట్టాడు
హలో సర్ గత మూడు సంవత్సరాలుగా సొంత రాష్ట్రంలో ఇల్లు కట్టుకునేందుకు భూమి దొరకడం లేదని ఇందులో పేర్కొన్నాడు. ఈ విషయంలో ప్రభుత్వం సహాయం తనకు కావాలి.. ప్రభుత్వం ఇస్తానన్న భూమి కూడా తనకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. గిఫ్ట్ గా ఇస్తే బాగుంటుంది… లేదా కొనడానికి అనుమతి అయినా ఇవ్వండి అని రిషబ్ పంత్ వెల్లడించారు. ఈ పోస్టు వైరల్ అయిన నేపథ్యంలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజంగానే రిషబ్ పంత్ పోస్ట్ పెట్టాడా ? లేక అతని అకౌంట్ హ్యాక్ అయిందా ? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు క్రికెట్ అభిమానులు.
తన ఇంటి కోసం ల్యాండ్ గిఫ్ట్ గా ఇవ్వాలని ఉత్తరాంఖడ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని కోరుతూ అర్ధరాత్రి రిషబ్ పంత్ చేసిన పోస్ట్ పై దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. తాగిన మత్తులో రిషబ్ పంత్ ఈ పోస్టు పెట్టాడని దారుణంగా ఆడుకుంటున్నారు. తాగిన మత్తులోనే ఈ పోస్టు పెట్టాడు కాబట్టి స్పెల్లింగ్ లో కూడా మిస్టేక్స్ ఉన్నాయని స్క్రీన్ షాట్స్ వైరల్ చేస్తున్నారు. ఉత్తరాంఖడ్ రాష్ట్రంలో హైయెస్ట్ టాక్స్ పేయర్ అయిన రిషబ్ పంత్ సొంతంగా ల్యాండ్ కొనుక్కోలేడా ? అని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ప్రాక్టీస్ మానేసి, ఈ భూమి పంచాయితీ ఏంటి అని మరి కొంతమంది నిలదీస్తున్నారు.
@pushkardhami hello sir how’s you ??? It’s a long time for me especially being local from Uttrakhand . I have been trying to buy land to shift my base from Delhi to Uttrakhand and I couldn’t find anything facilitating and big to live here I love my Uttrakhand. My humble request…
— Rishabh Pant (@RishabhPant17) August 7, 2026