E-Paper
Advertisement

చిన్న పిల్లల్ని ఎక్స్పరిమెంట్ కు వాడుకునే పాడు స్కామ్… కిర్రాక్ తమిళ థ్రిల్లర్

చిన్న పిల్లల్ని ఎక్స్పరిమెంట్ కు వాడుకునే పాడు స్కామ్… కిర్రాక్ తమిళ థ్రిల్లర్
Advertisement

Medical Crime Thriller : స్కామ్స్ ఎన్నో రకాలుగా జరుగుతూ ఉంటాయి. అన్నింటిలోనూ పేద, మధ్యతరగతి వాళ్ళే బలైపోతుంటారు. అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ మెడికల్ థ్రిల్లరే ఈరోజు మన మూవీ సజెషన్. ఆ మూవీ పేరు ‘అదర్స్’ (Others). మెడికల్ స్కామ్‌ పై సాగే షాకింగ్ క్రైమ్ థ్రిల్లర్. 2025 నవంబర్ 7న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ తమిళ చిత్రానికి అబిన్ హరిహరన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంతానలేమి సమస్యలు, IVF ట్రీట్‌మెంట్స్ వెనుక దాగి ఉన్న భారీ మెడికల్ స్కామ్‌ ను ధైర్యంగా ఎండగడుతుంది. ఆదిత్య మాధవన్, గౌరీ జి. కిషన్, అంజు కురియన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

కథలోకి వెళ్తే…

ఒక అనాథాశ్రమానికి చెందిన కొందరు అంధులైన మహిళలు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవుతుంది. అదే సమయంలో నగరంలోని కొన్ని ఫెర్టిలిటీ క్లినిక్‌ లలో IVF ద్వారా పుట్టిన పసిపిల్లలు రోగాల బారిన పడుతుంటారు. వింతైన, ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఈ రెండు సంఘటనల మధ్య ఉన్న లింక్‌ ను కనిపెట్టడానికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాధవ్ (ఆదిత్య మాధవన్) బాధ్యత తీసుకుంటాడు. దర్యాప్తు లోతుగా సాగుతుండగా దిగ్భ్రాంతికరమైన విషయాలు బయట పడతాయి.

Advertisement

మాధవ్ కాబోయే భార్య డాక్టర్ మధు (గౌరీ జి. కిషన్) ఒక ఫెర్టిలిటీ క్లినిక్‌ లో పని చేస్తుంటుంది. ఆమె ల్యాబ్ రిపోర్టులు ట్యాంపర్ అవుతున్నాయని, సిస్టమ్స్ హ్యాక్ అయ్యాయని గుర్తిస్తుంది. ఇక్కడి నుంచి కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. పిల్లలు కావాలని ఆశపడే అమాయక దంపతుల బలహీనతను కొందరు స్వార్థపరులు ఎలా దోపిడీ చేస్తున్నారో ఈ విచారణలో బయట పడుతుంది.

అండాల దొంగతనం, నకిలీ డోనర్లు, నిషేధించబడిన స్టెరాయిడ్స్, ల్యాబ్ రిపోర్టుల తారుమారు… ఇవన్నీ ఒక పెద్ద అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్‌కు లింక్ అయి ఉంటాయి. అనాథాశ్రమాలు, ఫెర్టిలిటీ క్లినిక్‌ లు మధ్య ఉన్న రహస్య సంబంధం కూడా ఈ కేసులో కీలకంగా మారుతుంది. మాధవ్ ఈ భారీ మెడికల్ మాఫియాను ఎలా ఎదుర్కొంటాడు ? అనే ఉత్కంఠ సినిమా మొత్తాన్ని ఆసక్తికరంగా నడిపిస్తుంది.

Advertisement

ఆదిత్య మాధవన్ తన మొదటి సినిమాలోనే బలమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించాడు. గౌరీ జి. కిషన్ డాక్టర్ మధుగా ఎమోషనల్ డెప్త్ ఇచ్చింది. అంజు కురియన్ కీలక పాత్రలో బాగా నటించింది. మునిష్కాంత్, హరీష్ పేరడి సహాయ నటులుగా మంచి మార్క్ వేశారు. అబిన్ హరిహరన్ దర్శకత్వం, జిబ్రాన్ సంగీతం బాగున్నాయి. మెడికల్ సీన్స్, హాస్పిటల్ లొకేషన్స్, దర్యాప్తు సన్నివేశాలు అన్నీ రియలిస్టిక్‌గా ఉన్నాయి. సమాజంలో వైద్య రంగంలో జరిగే దోపిడీ, నైతిక విలువల క్షీణతను ఈ చిత్రంలో చూపించారు. మూవీ Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : మిస్టీరియస్ డెత్స్… రోడ్డుపైకి రాగానే మృత్యు ఒడిలోకి… సీట్ ఎడ్జ్ సస్పెన్స్

Related News

ఓటీటీలోకి రాబోతున్న ‘హృదయం మురళి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

సైలెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న రష్మిక ‘కాక్ టెయిల్ 2’ మూవీ!

Weekend OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీ మూవీస్..ఆ రెండు మస్ట్ వాచ్..

1775 నుంచి 2050 వరకు వెంటాడిన శాపం… ఓటీటీలో ఈ హారర్ మూవీ చూశారా?

గతం మర్చిపోయిన ఫైటర్… నెట్‌ఫ్లిక్స్‌లో అదిరిపోయే యాక్షన్ సిరీస్

విద్యార్థులను రాక్షసులుగా మార్చే శాపం… నెట్‌ఫ్లిక్స్‌లో ఈ హారర్ సిరీస్ చూశారా?

నవ్వుతో చంపే వైరస్… బ్యాట్‌మ్యాన్‌కు జోకర్ షాక్… క్లైమాక్స్ చూస్తే గూస్‌బంప్స్

దేశం కోసం కుటుంబాన్నే రిస్క్‌లో పెట్టిన మహిళ… సీజన్ 3లో షాకింగ్ ట్విస్టులు

Big Stories

Advertisement
×