E-Paper
Advertisement

భారత E20 పెట్రోల్‌కు భూటాన్ నో.. కారణం ఏంటో తెలుసా?

భారత E20 పెట్రోల్‌కు భూటాన్ నో.. కారణం ఏంటో తెలుసా?
Advertisement

Bhutan Rejects India’s E20 Petrol: భారత్ ఇథనాల్ మిక్సింగ్ ప్యూయల్ వినియోగాన్ని వేగంగా పెంచుతోంది. ఇందులో భాగంగా పెట్రోల్‌ లో 20 శాతం ఇథనాల్ కలిపి E20 పెట్రోల్‌ ను దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఇదే పెట్రోల్ ను పొరుగు దేశమైన భూటాన్‌ కు సరఫరా చేయాలన్న ప్రతిపాదనకు అక్కడి ప్రభుత్వం నో చెప్పింది. ఇండియన్ ఆయిల్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) లాంటి భారతీయ ఆయిల్ కంపెనీలు భూటాన్‌ కు E20 పెట్రోల్ సరఫరా చేయాలని ప్రతిపాదించాయి. అయితే, ప్రస్తుతం తాము సాధారణ పెట్రోల్‌ ను మాత్రమే దిగుమతి చేసుకుంటామని భూటాన్ స్పష్టం చేసింది.

భూటాన్ నిర్ణయం వెనుక కారణం ఏంటంటే?

భూటాన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి పలు కారణాలు ఉన్నాయి. ఆ దేశంలో ఈ ఇంధనాన్ని నిల్వే చేసే మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే తేమను చాలా వేగంగా పీల్చుకుంటుంది. నిల్వ ట్యాంకుల్లోకి నీరు చేరితే ఇంధన నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. భూటాన్‌ లో ఉన్న చాలా భూగర్భ ఇంధన నిల్వ ట్యాంకులు పాతవి. అంతేకాకుండా, దేశం మొత్తం ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో ఉండటంతో భూగర్భ జలాలు, తేమ ట్యాంకుల్లోకి చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో E20 పెట్రోల్‌ను నిల్వ చేస్తే కలుషితమయ్యే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇంధనంలో నీరు కలిస్తే ఇంజిన్ పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీని వల్ల ఫ్యూయల్ సిస్టమ్ దెబ్బతినడం, వాహనం పనితీరు తగ్గడం లేదా నిర్వహణ ఖర్చులు పెరగడం వంటి సమస్యలు తలెత్తవచ్చని భూటాన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పూర్తిగా E20 పెట్రోల్‌ ను నిషేధించినట్లేనా?

Advertisement

భూటాన్ E20 పెట్రోల్‌ ను శాశ్వతంగా తిరస్కరించలేదు. ముందుగా తమ ఇంధన నిల్వ వ్యవస్థలను ఆధునీకరించుకునే అవకాశం ఇవ్వాలని మాత్రమే కోరుతోంది. కొత్త లీక్ ప్రూఫ్ స్టోరేజ్ ట్యాంకులు ఏర్పాటు చేయడం, డిపోలను అప్‌ గ్రేడ్ చేయడం, రవాణా వ్యవస్థను మెరుగుపరచడం లాంటి పనులు పూర్తయ్యాక మాత్రమే ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని పరిశీలిస్తామని తెలిపింది. భూటాన్‌ లోని ప్రముఖ ఇంధన సరఫరా సంస్థలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో E20 పెట్రోల్‌ను సురక్షితంగా నిల్వ చేయడం తమకు సాధ్యం కాదని వెల్లడించాయి.మరో కారణంగా అక్కడి భౌగోళిక పరిస్థితులను కూడా అధికారులు ప్రస్తావించారు. కొండ ప్రాంతాల్లో వాహనాలు ఎక్కువ శక్తితో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇథనాల్‌ లో సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే శక్తి సాంద్రత కొంత తక్కువగా ఉండటంతో, ఇలాంటి ప్రాంతాల్లో పనితీరుపై ప్రభావం ఉండొచ్చని వారు భావిస్తున్నారు.

Read Also: వాగన్ ఆర్ ఫేస్‌ లిఫ్ట్ వచ్చేసింది.. కొత్త లుక్ చూస్తే మతిపోవాల్సిందే!

Related News

డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు.. డ్రైవర్ ప్రాణాలు కాపాడిన టెస్లా ఫీచర్లు!

వాగన్ ఆర్ ఫేస్‌ లిఫ్ట్ వచ్చేసింది.. కొత్త లుక్ చూస్తే మతిపోవాల్సిందే!

హోండా SP125 స్పెషల్ ఎడిషన్‌ కు గుడ్‌ బై.. వెబ్‌ సైట్ నుంచి మాయం!

కొత్త స్టైల్.. సరికొత్త కలర్స్.. రివోల్ట్ RVX వచ్చేసింది!

రూ.10.99 లక్షలకే క్రెటా ఎలక్ట్రిక్.. హ్యుందాయ్ షాకింగ్ ఆఫర్!

టాటా సియెర్రా ఈవీ vs MG విండ్సర్ ఈవీ.. రెండింటిలో ఏ SUV బెస్ట్ అంటే..?

180 కి.మీ రేంజ్.. రిమూవబుల్ బ్యాటరీ.. కీవే క్రేజీ స్కూటర్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×