E-Paper
Advertisement

ఏఐ ఫీచర్లు, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి ఐకూ సరికొత్త Lite మొబైల్!

ఏఐ ఫీచర్లు, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి ఐకూ సరికొత్త Lite మొబైల్!
Advertisement

iQOO Z11 Lite: సామాన్యులు సైతం కొనగలిగేలా బడ్జెట్ ధరలో మంచి మొబైల్స్‌ను అందుబాటులోకి తెచ్చే ఐకూ (iQOO) కంపెనీ నుంచి త్వరలోనే మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. ఐకూ Z సిరీస్‌లో భాగంగా iQOO Z11 Lite పేరుతో ఈ సరికొత్త ఫోన్ రానున్నట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జులై మధ్యలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు టెక్ వర్గాలు చెప్తున్నాయి. కొద్దిరోజుల క్రితమే ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్‌లో కూడా కనిపించడంతో, దీని లాంచ్ దాదాపు ఖాయమని తెలుస్తోంది.

ఆకట్టుకునే సరికొత్త ఫీచర్లు:

ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. గతంలో వచ్చిన ఐకూ Z10 లైట్ మోడల్‌లోనూ ఇదే ప్రాసెసర్‌ను వాడినప్పటికీ, ఈ కొత్త ఫోన్‌లో మిగిలిన ఫీచర్లను భారీగా అప్‌గ్రేడ్ చేశారు. ముఖ్యంగా ఈ ఫోన్ లేటెస్ట్ OriginOS 6 సాఫ్ట్‌వేర్‌తో పనిచేయనుంది. అంతేకాదు.. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా ఇందులో ఏఐ (AI) ఆధారిత క్రియేషన్, క్యాప్షనింగ్ ఫీచర్లను కూడా అందించబోతున్నారు.

Advertisement

Also Read: స్నాప్‌డ్రాగన్ కొత్త ప్రాసెసర్, 9000mAh భారీ బ్యాటరీ.. రెడ్‌మీ నుంచి మోస్ట్ పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్!

భారీ బ్యాటరీ.. ఫాస్ట్ చార్జింగ్:

ఐకూ Z11 లైట్ ఫోన్‌లో అన్నింటికంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని బ్యాటరీ గురించే. ఈ ఫోన్ ఏకంగా 6500mAh భారీ బ్యాటరీతో రానున్నట్లు లీకైన సమాచారం ద్వారా తెలుస్తోంది. గత మోడల్‌తో పోలిస్తే ఇది చాలా పెద్ద అప్‌గ్రేడ్ అని చెప్పాలి. కేవలం బ్యాటరీ సామర్థ్యమే కాకుండా, ఛార్జింగ్ స్పీడ్‌ను కూడా భారీగా పెంచారు. అలాగే దీనిలో 44 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను ఇస్తున్నారు. దీనివల్ల ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది.

ధర ఎంత ఉండొచ్చు?

Advertisement

ఈ ఫోన్ ధరపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఐకూ Z11x మోడల్ ధర రూ.22,999 నుంచి ప్రారంభమవుతోంది. కాబట్టి.. ఈ కొత్త లైట్ వేరియంట్ అంతకంటే తక్కువ ధరలోనే అంటే.. సుమారు రూ.20,000 లోపు బడ్జెట్లోనే లభించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మార్కెట్లో గట్టి పోటీ:

ప్రస్తుతం మార్కెట్లో రూ.20,000 లోపు ధరలో మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ల సంఖ్య కాస్త తగ్గింది. ఇలాంటి సమయంలో ఐకూ తీసుకొస్తున్న ఈ ఫోన్ లావా, పోకో, ఐటెల్ వంటి బ్రాండ్ల ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎక్కువ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి, రోజువారీ అవసరాల కోసం మంచి ఫోన్ చూసేవారికి ఈ ఐకూ Z11 లైట్ ఒక బెస్ట్ ఆప్షన్ కానుంది.

Also Read: ఇంత అద్భుతమైన డిజైన్‌కు.. ఆ ప్రైస్ ఏంటి సామీ? జూలై 7న నథింగ్ ఊచకోత ఖాయం!

Related News

సెప్టెంబర్ 4 నుంచి గూగుల్ అసిస్టెంట్ బంద్.. ఇకపై అంతా Gemini మయం!

సూపర్ ఆఫర్.. ‘గూగుల్ పిక్సెల్ 10’ పై ఏకంగా రూ. 24,000 తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో బంపర్ డీల్!

డెస్క్‌టాప్ vs ల్యాప్‌టాప్.. ఇంటి నుంచి వర్క్ చేయడానికి.. రెండింట్లో ఏది బెస్ట్?

నెట్ స్లోగా ఉందా? మీ ఏరియాలో 5G ఉందో లేదో ఇలా చెక్ చేయండి!

యూట్యూబ్ మోనిటైజేషన్ నిబంధనలు మార్పు.. కొత్త క్రియేటర్లకు మరిన్ని సవాళ్లు!

రూ.41,000 తగ్గింపు గురూ.. Amazon Freedom Saleలో మునుపెన్నడూ చూడని షాకింగ్ ఆఫర్లు!

ఏఐ టెక్నాలజీతో హైయర్ సరికొత్త వాషింగ్ మెషీన్.. బట్టలపై నూనె, టీ మరకలు క్షణాల్లో మాయం!

పాత ఫోన్ మార్చేయడానికి ఇదే సరైన టైమ్.. అమెజాన్ ఫ్రీడమ్ సేల్ టాప్ 5G డీల్స్!

Big Stories

Advertisement
×