E-Paper
Advertisement

ఫ్రిడ్జ్ నుంచి వాటర్ లీక్ అవ్వడానికి ఈ 4 తప్పులే కారణం.. ఐదు నిమిషాల్లో ఫిక్స్ చేసుకోండిలా!

ఫ్రిడ్జ్ నుంచి వాటర్ లీక్ అవ్వడానికి ఈ 4 తప్పులే కారణం.. ఐదు నిమిషాల్లో ఫిక్స్ చేసుకోండిలా!
Advertisement

Refrigerator: ఇంట్లో నిరంతరం నడిచే ఏకైక ఎలక్ట్రానిక్ వస్తువు రిఫ్రిజిరేటర్. అయితే చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏంటంటే.. ఫ్రిడ్జ్ కింద నీరు చేరడం. ముఖ్యంగా ఎండాకాలం, వర్షాకాలంలో వాతావరణ మార్పుల వల్ల ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. దీనికోసం వెంటనే మెకానిక్‌ను పిలిచి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న చిట్కాలతో ఇంట్లోనే ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.

డ్రైన్ పైపు బ్లాక్ కావడం:

ఫ్రిడ్జ్ లోపల కూలింగ్ ప్రక్రియ వల్ల ఏర్పడే అదనపు నీరు బయటకు వెళ్లడానికి ఒక చిన్న డ్రైన్ పైపు ఉంటుంది. కొన్నిసార్లు ఆహార పదార్థాల ముక్కలు లేదా ఐస్ గడ్డకట్టడం వల్ల ఈ పైపు మూసుకుపోతుంది. అలాంటప్పుడు నీరు బయటకు పోలేక ఫ్రిడ్జ్ కిందకు చేరి లీకవుతుంది. దీనికోసం ఫ్రిడ్జ్‌ను కొన్ని గంటల పాటు బంద్ చేస్తే లోపల ఉన్న ఐస్ కరిగిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీటిని ఆ పైపులో పోసి, ఒక సన్నటి వైర్‌తో మెల్లగా లోపలి వ్యర్థాలను క్లీన్ చేస్తే సమస్య తీరిపోతుంది.

ఫ్రిడ్జ్ ఉంచే స్థలం సరిగ్గా లేకపోవడం:

Advertisement

చాలామంది ఫ్రిడ్జ్ పెట్టే స్థలాన్ని పెద్దగా పట్టించుకోరు. దీంతో ఫ్రిడ్జ్ సమాంతరంగా (లెవెల్‌గా) లేకపోతే లోపల నీటి ప్రవాహానికి అంతరాయం కలిగి లీకేజీ స్టార్ట్ అవుతుంది. అందుకే ఫ్రిడ్జ్ ముందు భాగం వెనుక భాగం కంటే కొద్దిగా ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల నీరు డ్రైనేజీ ట్రే వైపు సులభంగా వెళ్తుంది. అలాగే ఫ్రిడ్జ్‌ను గోడకు మరీ దగ్గరగా పెట్టకుండా.. కొద్దిగా గ్యాప్ ఉండేలా, గాలి బాగా ఆడేలా చూసుకోవాలి.

ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోవడం:

ఫ్రీజర్‌లో అవసరానికి మించి ఐస్ పేరుకుపోయినప్పుడు, అది కరిగే క్రమంలో ఎక్కువ నీరు ఉత్పత్తి అవుతుంది. ఆటోమేటిక్ డీఫ్రాస్ట్ సిస్టమ్ సరిగ్గా పని చేయనప్పుడు లేదా ఫ్రీజర్‌లో వస్తువులను ఎక్కువగా కుక్కినప్పుడు ఇలా జరుగుతుంది. ఈ సమస్య పోవాలంటే వారానికి ఒకసారైనా ఫ్రిడ్జ్‌ను కాసేపు ఆఫ్ చేసి సహజంగా ఐస్ కరిగేలా చూడాలి. అలాగే ఫ్రీజర్‌లో గాలి ఆడేలా వస్తువులను సర్దుకోవడం అలవాటు చేసుకోవాలి.

మెకానిక్‌ను ఎప్పుడు పిలవాలంటే?

Advertisement

పైన చెప్పుకున్న చిన్న చిన్న చిట్కాలు పాటించినా కూడా నీటి లీకేజీ ఆగకపోతే, లోపల ఏదైనా సాంకేతిక లోపం ఉందని అర్థం చేసుకోవాలి. అలాంటి సమయంలో సొంత ప్రయోగాలు చేయకుండా మంచి సర్వీస్ టెక్నీషియన్‌ను పిలవడం మంచిది. ఒకవేళ మీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ చాలా పాతదైపోయి తరచూ ఇలాంటి ఇబ్బందులు పెడుతుంటే, మంచి డ్రైనేజీ సిస్టమ్ ఉన్న కొత్త స్టార్ రేటెడ్ ఫ్రిడ్జ్‌ను కొనుగోలు చేయడం ద్వారా కరెంట్ బిల్లును, రిపేర్ ఖర్చులను ఆదా చేసుకోవచ్చు.

Related News

సెప్టెంబర్ 4 నుంచి గూగుల్ అసిస్టెంట్ బంద్.. ఇకపై అంతా Gemini మయం!

సూపర్ ఆఫర్.. ‘గూగుల్ పిక్సెల్ 10’ పై ఏకంగా రూ. 24,000 తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో బంపర్ డీల్!

డెస్క్‌టాప్ vs ల్యాప్‌టాప్.. ఇంటి నుంచి వర్క్ చేయడానికి.. రెండింట్లో ఏది బెస్ట్?

నెట్ స్లోగా ఉందా? మీ ఏరియాలో 5G ఉందో లేదో ఇలా చెక్ చేయండి!

యూట్యూబ్ మోనిటైజేషన్ నిబంధనలు మార్పు.. కొత్త క్రియేటర్లకు మరిన్ని సవాళ్లు!

రూ.41,000 తగ్గింపు గురూ.. Amazon Freedom Saleలో మునుపెన్నడూ చూడని షాకింగ్ ఆఫర్లు!

ఏఐ టెక్నాలజీతో హైయర్ సరికొత్త వాషింగ్ మెషీన్.. బట్టలపై నూనె, టీ మరకలు క్షణాల్లో మాయం!

పాత ఫోన్ మార్చేయడానికి ఇదే సరైన టైమ్.. అమెజాన్ ఫ్రీడమ్ సేల్ టాప్ 5G డీల్స్!

Big Stories

Advertisement
×