E-Paper
Advertisement

అధికారులను బెదిరిస్తే ఊరుకోం.. చెవిరెడ్డికి పిచ్చి ముదిరిందన్న ఈశ్వర్ రెడ్డి!

అధికారులను బెదిరిస్తే ఊరుకోం.. చెవిరెడ్డికి పిచ్చి ముదిరిందన్న ఈశ్వర్ రెడ్డి!
Advertisement

Eswar Reddy: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబంపై తెలుగుదేశం పార్టీ (TDP) సీనియర్ నేత ఈశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చెవిరెడ్డి కుటుంబం చేసిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, త్వరలోనే తండ్రీకొడుకులు జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

డైవర్షన్ పాలిటిక్స్.. మతిభ్రమించిన చెవిరెడ్డి

Advertisement

నియోజకవర్గంలో ఇటీవల జరిగిన కూటమి సభ సక్సెస్ కావడాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని ఈశ్వర్ రెడ్డి విమర్శించారు. తనపల్లి నుంచి జాతీయ రహదారికి నూతన రోడ్లు వేయడం, కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రారంభించడం వంటి అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. ఎస్ఐఆర్ (SIR) వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికే చెవిరెడ్డి సోషల్ మీడియా వేదికగా భూకబ్జా డ్రామాలను తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. అసలు అవిలాలలో 150 కోట్ల రూపాయల స్థలం ఎక్కడ ఉందో చూపించాలని సవాల్ విసిరారు. చెవిరెడ్డికి పూర్తిగా మతిభ్రమించిందని, అందుకే కలెక్టర్‌పై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, చంద్రగిరి ఎమ్మార్వోను బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు.

Also Read: 858 హాట్ స్పాట్స్, 40 వేల ‘ఈగల్ క్లబ్స్’.. గంజాయిపై కూటమి సర్కార్ ఉక్కుపాదం!

Advertisement

తుడా అవినీతి.. సొంత తమ్ముడికే ద్రోహం

చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక, చెవిరెడ్డి కుటుంబం గతంలో ఎమ్మెల్యేగా, తుడా (TUDA) చైర్మన్‌గా ఉన్నప్పుడు చేసిన అధికార దుర్వినియోగాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని ఈశ్వర్ రెడ్డి ఆరోపించారు. తుడా పరిధిలో వారు చేసిన అవినీతి అంతా త్వరలోనే బయటపడుతుందన్నారు. చివరకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తన సొంత తమ్ముడు హర్షిత్ రెడ్డి రాజకీయంగా పైకి రాకుండా అడ్డుపడుతున్నాడంటూ కుటుంబ అంతర్గత రాజకీయాలను ప్రస్తావించారు.

కోవర్టు రాజకీయం.. పురుషోత్తం నాయుడు గుట్టుమట్లు

బీజేపీ నేత పురుషోత్తం నాయుడు ఒక వైసీపీ కోవర్టు అని ఈశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పురుషోత్తం నాయుడు అనాధీనం భూములను కబ్జా చేశాడని, ఆ కబ్జాకు ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే సహకరించలేదనే కక్షతోనే ఎమ్మెల్యేపై బురదజల్లుతున్నాడని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ‘పురుషోత్తం నాయుడు నా దగ్గర అప్పు తీసుకుని వడ్డీ కూడా చెల్లించలేదు. నా దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తి నాకు తిరిగి ఇవ్వకపోవడమేంటి? నేరుగా ఆయన ఇంటికి వెళ్ళి నా ఆర్థిక లావాదేవీలను తేల్చుకుంటాను’ అంటూ ఈశ్వర్ రెడ్డి హెచ్చరించారు.

Also Read: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్తత.. 12 గ్రామాల్లో ‘SIR’ ప్రక్రియ బహిష్కరణ!

Related News

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, హైదరాబాద్‌లో అయితే..

లారీని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 30 మంది, ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

ఏపీ రాజకీయాల్లో కొత్త అంకం.. అలర్టయిన కూటమి ప్రభుత్వం, మూడు పార్టీల సంయుక్త ప్రకటన

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. SSD టోకెన్లు రద్దు, కాకపోతే నేరుగా దర్శనం

దటీజ్ డిప్యూటీ సీఎం.. పవన్ దెబ్బకి మారిపోయిన రోడ్డు.. వాహనదారుల ప్రశంసలు!

డీఎస్సీ నిర్వహణపై రోజా తీవ్ర విమర్శలు.. సీబీఐ విచారణకు డిమాండ్!

వైసీపీ నేత విజయప్రసాద్ గుట్టు బయటకు.. చిట్టా విప్పిన ఈడీ, ఆనాటి నుంచి అజ్ఞాతంలో

చిక్కుల్లో బిగ్‌బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్.. విశాఖ పోలీసులు కేసు నమోదు, యువతి వ్యవహారమే..

Big Stories

Advertisement
×