Samsung Sale: స్వాతంత్ర దినోత్సవాన్ని (ఆగస్టు 15) పురస్కరించుకుని ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్.. భారతీయ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ‘ది బిగ్ బెస్పోక్ ఏఐ ఫెస్ట్’ పేరుతో ఆఫర్ల సేల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆగస్టు 6 నుండి 15 వరకు కొనసాగే ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా తమ ఏఐ ఆధారిత హోమ్ అప్లయెన్సెస్‌పై భారీ డిస్కౌంట్లు, సులభతర ఈఎంఐలు, పొడిగించిన వారంటీ ప్రయోజనాలను అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
ఈ ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా బెస్పోక్ ఏఐ శ్రేణికి చెందిన ఎంపిక చేసిన ఉత్పత్తులపై రూ. 19,470 వరకు గరిష్ట క్యాష్‌బ్యాక్ లభించనున్నట్లు శాంసంగ్ వర్గాలు ప్రకటించాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 సంవత్సరాన్ని సూచించేలా శాంసంగ్ ఈ గరిష్ట క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని రూ. 19,470గా నిర్ణయించడం విశేషం.
కస్టమర్ల నమ్మకాన్ని మరింత పెంచేందుకు ‘శాంసంగ్ కేర్+’ ఆఫర్లను కూడా ఈ ఇండిపెండెన్స్ డే సేల్ లో కంపెనీ ప్రకటించింది. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్లలో ఎంపిక చేసిన మోడళ్లపై సాధారణ వారంటీతో పాటు అదనంగా ఒక సంవత్సరం వారంటీ, దాంతో పాటు ఉచితంగా మరో రెండేళ్ల విస్తరించిన వారంటీ (Extended Warranty) కవరేజ్ ఇస్తోంది. అటు సింగిల్ డోర్ ఫ్రిజ్ కొనుగోలు చేసే వినియోగదారులు కేవలం రూ. 99 చెల్లించి ఒక సంవత్సరం అదనపు వారంటీని పొందే వెసులుబాటును కల్పిస్తోంది.
‘శాంసంగ్ ఫైనాన్స్+’ ద్వారా వస్తువులు కొనుగోలు చేసే వినియోగదారులకు జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ ఈ సేల్ లో అందుబాటులోకి తెచ్చింది. అంటే పైసా కట్టకుండా ప్రొడక్ట్స్ ను తీసుకెళ్లే వెసులుబాటును శాంసంగ్ కల్పిస్తోంది. వీటిపై ప్రతీ నెలా చెల్లించే ఈఎంఐ ప్రారంభ ధర రూ. 890 నుంచే మెుదలు కావడం విశేషం.
మరోవైపు ఈ సేల్ లో ’20/5 ఫైనాన్స్ స్కీమ్’ కింద 25 కేజీల వాషర్ డ్రైయర్ కాంబోను కొనుగోలు చేసే వారికి ఒక నెల ఈఎంఐ మినహాయింపును సైతం శాంసంగ్ ఆఫర్ చేస్తోంది. అంటే 20 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్ ఎంచుకున్నప్పుడు మొదటి నెలకు సంబంధించిన ఈఎంఐ భారాన్ని శాంసంగ్ సంస్థే భరించనుంది.
Also Read: ఏం గుండెరా వాడిది.. కిమ్ భార్యతోనే సెల్ఫీ.. షాకింగ్ వీడియో వైరల్!
ప్రస్తుతం ఆఫర్ నడుస్తున్న శాంసంగ్ బెస్పోక్ ఏఐ కేటగిరీలో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, వాషర్ డ్రైయర్ లు ఉన్నాయి. వీటి ప్రత్యేకతలకు వస్తే.. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో పనిచేస్తూ రోజువారీ ఇంటి పనులను, లాండ్రీని మరింత సులభతరం చేస్తాయని కంపెనీ చెబుతోంది. ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉండే ఈ ప్రత్యేక ఆఫర్లను శాంసంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్లతో పాటు భాగస్వామ్య రిటైల్ నెట్‌వర్క్‌ల ద్వారా వినియోగదారులు పొందవచ్చు.
Also Read: ఈ రోడ్లు ఉంటాయ్ భయ్యా.. నా భూతో నా భవిష్యత్.. లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!