E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

పాకిస్తాన్ కు జ‌రిగిన అవ‌మాన‌మే, టీమిండియాకు జ‌రిగేలా..అల్లాను ప్రార్థించండి !

పాకిస్తాన్ కు జ‌రిగిన అవ‌మాన‌మే, టీమిండియాకు జ‌రిగేలా..అల్లాను ప్రార్థించండి !
Advertisement

Rashid Latif : మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (2026 Women’s World Cup tournament) నుంచి పాకిస్తాన్ ఉమెన్స్ జ‌ట్టు (Pakistan women’s team) ఎలిమినేట్ అయింది. వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోయిన పాకిస్తాన్ మహిళల జట్టు, తాజాగా మరో మ్యాచ్ లో కూడా చేతులెత్తేసింది. ఆస్ట్రేలియా చేతిలో ఏకంగా 113 పరుగుల తేడాతో దారుణ ఓటమి చవి చూసింది. అయితే పాకిస్తాన్ ఓడిపోయిన నేపథ్యంలో ఆ జట్టును తీవ్ర స్థాయిలో మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు. కొంచెం కూడా బుద్ధి లేదా ? పాకిస్తాన్ పరువు గంగలో కలుపుతున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ (Rashid Latif) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మనం ఓడిపోయాం సరే.. టీమిండియా కూడా ఇంటి దారి పట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఈ టోర్నమెంట్ నుంచి గ్రూప్ స్టేజ్ లోనే టీమిండియా ఎలిమినేట్ అయ్యేలా, అల్లాకు ప్రార్థనలు చేయాలంటూ బాంబు పేల్చారు. మనకు జరిగిన అవమానమే, టీమిండియా జట్టుకు జరగాలంటూ వ్యాఖ్యానించారు. అప్పటి వరకు ఎవరు నిద్రపోవద్దని రషీద్ లతీఫ్ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో లతీఫ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Daryll Cullinan has ra ised public concern over Vaibhav Sooryavanshi: ఈ లేత వ‌య‌స్సులో వేగంగా బ్యాటింగ్ చేసి, ప్రాణాల‌పైకి తెచ్చుకోవ‌ద్దు ? వైభ‌వ్ కు డారిల్ హెచ్చ‌రిక‌లు

పాకిస్తాన్ కు జ‌రిగిన అవ‌మాన‌మే, టీమిండియాకు జ‌రగాలి

Advertisement

ఉమెన్స్ మహిళల టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు ఎలిమినేట్ అయింది. దీంతో పాకిస్తాన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కానీ పాకిస్తాన్ మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ మాత్రం వాళ్లను మెచ్చుకుంటున్నారు. ఓడిపోయామని బాధ పడకండి… తర్వాతి టోర్నమెంట్ లో బాగా ఆడేలా ప్రయత్నించాలని కోరారు. అయితే పాకిస్తాన్ కు జరిగిన అవమానం.. టీమిండియా కు కూడా జరిగేలా అల్లాను ప్రార్థించండి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ స్టేజిలో టీమిండియా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని… ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోతే వాళ్ల పని కూడా అంతేనంటూ వ్యాఖ్యానించారు. టీమిండియా కూడా ఎలిమినేట్ అయితే, మనం హ్యాపీగా ఉండవచ్చని పేర్కొన్నారు. ఆ దిశగా అల్లాను ప్రార్థించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రషీద్ లతీఫ్.

ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోతే టీమిండియా ఇంటికేనా ?

టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో వరుసగా రెండు మ్యాచ్ ల‌లో విజయం సాధించిన టీమిండియా.. మొన్న దక్షిణాఫ్రికా చేతిలో మాత్రం ఓడిపోయింది. దీంతో సెమిస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఈ టోర్నమెంట్ లో ఆస్ట్రేలియా పైన టీమిండియా గెలిస్తేనే సెమిస్ అవకాశాలు ఉంటాయి. లేకపోతే మహిళల టీమ్ ఇండియా కూడా ఇంటి దారి పట్టాలి. అప్పుడు పాకిస్తాన్ పైన గెలిచిన ఆనందం కూడా టీమిండియా కు మిగలదు. ఇదే విషయాన్ని రషీద్ లతీఫ్ పేర్కొన్నారు.

Advertisement

 

Also Read:  Jemimah Rodrigues ICC Women’s T20 World Cup 2026: వరల్డ్ కప్ లో 33 యాడ్స్.. కానీ చేసింది 32 పరుగులే, జెమిమాను తీసేయండి అంటూ ట్రోల్స్‌

 

Related News

Rizwan: ఓడిపోవ‌డం మ‌న‌కు అల‌వాటే, ఆత్మ‌హ‌**త్య‌లు లాంటివి చేసుకోవ‌ద్దు

మొగుడితో రొమాన్స్ చేస్తూ, ఇంగ్లండ్ లో పాక్‌ ప్లేయ‌ర్ షికార్లు..PCBకి ఫిర్యాదు చేసిన స‌నా

ఢిల్లీ క్యాపిట‌ల్స్ లోకి రిష‌బ్ పంత్..కొంచెమైనా సిగ్గుండాలంటూ వార్న‌ర్ వివాద‌స్ప‌ద పోస్ట్!

వైభవ్ ను మొదటి బంతికే డకౌట్ చేస్తా..అత‌ని వికెట్ తీసే మొన‌గాడిని నేనొక్కడినే

వరుసగా 4 మ్యాచ్ ల‌లో పాక్ ఓటమి…ఇప్పుడు సమోసా, బజ్జీలు ఆర్డర్ చేయండి అంటూ ట్రోల్స్

యువతితో సహజీవనం, ప్రెగ్నెంట్ అయ్యాక హ్యాండ్.. ఐపీఎల్ ప్లేయ‌ర్ అరెస్ట్ ?

పాకిస్తాన్ క్రికెట్ ను గాడిలో పెట్టేందుకు త్రిముఖ వ్యూహాం..అంద‌రి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

Big Stories

×