E-Paper
Advertisement

శాంసంగ్ ప్రియులకు బిగ్ సర్‌ప్రైజ్.. Samsung Galaxy S24 ధర ఊహించని విధంగా తగ్గింది!

శాంసంగ్ ప్రియులకు బిగ్ సర్‌ప్రైజ్.. Samsung Galaxy S24 ధర ఊహించని విధంగా తగ్గింది!
Advertisement

Flipkart GOAT Sale: తక్కువ ధరలో మంచి ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకొక అద్భుతమైన అవకాశం. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ గెలాక్సీ S24 5G ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ గోట్ (GOAT) సేల్‌లో ఊహించని రేటుకు లభిస్తోంది. మెరుగైన పనితీరు, ప్రో లెవెల్ కెమెరాలతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ధర ఇప్పుడు భారీగా తగ్గింది.

లాంచ్ ధర కంటే తక్కువకే..

భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 లాంచ్ అయినప్పుడు దీని ప్రారంభ ధర రూ.79,999గా ఉండేది. కానీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఫోన్ 256GB వేరియంట్‌పై ఏకంగా 30 శాతం తగ్గింపు లభిస్తోంది. దీంతో ఈ ప్రీమియం ఫోన్‌ను కేవలం రూ.55,999కే సొంతం చేసుకోవచ్చు.

బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు:

Advertisement

ఈ తగ్గింపు ధరతో పాటు అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఎస్‌బీఐ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేస్తే తక్షణమే రూ.2,800 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు.. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా దాని కండిషన్‌ను బట్టి గరిష్టంగా రూ.38,300 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది.

Also Read: ఫ్రిడ్జ్ నుంచి వాటర్ లీక్ అవ్వడానికి ఈ 4 తప్పులే కారణం.. ఐదు నిమిషాల్లో ఫిక్స్ చేసుకోండిలా!

అద్భుతమైన పెర్ఫార్మెన్స్:

Advertisement

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. దీనిలో 6.2 అంగుళాల ఎల్‌టీపీఓ డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేను అందించారు. దీనికి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ ఉంటుంది కాబట్టి.. స్క్రాచెస్ పడతాయనే భయం ఉండదు. ఇక ఇండియన్ వేరియంట్‌లో అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

బ్యాటరీ సామర్థ్యం ఎంతంటే?

ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్‌లో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. అందులో 50MP ప్రధాన కెమెరా, 10MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. అలాగే రోజంతా ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేసేందుకు ఇందులో 4,000mAh బ్యాటరీని అందించారు. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Also Read: ఏఐ ఫీచర్లు, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి ఐకూ సరికొత్త Lite మొబైల్!

Related News

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

వాషింగ్ మెషీన్ వాడుతున్నారా? మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే!

ఫోన్ వేడిగా ఉన్నప్పుడు పొరపాటున కూడా..ఈ పనులు చేయొద్దు!

Big Stories

Advertisement
×