Samsung Galaxy S26 Ultra: సాధారణంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలనుకునేవాళ్లు ధర విషయంలో పెద్దగా రాజీపడరు. అయితే మంచి ఫోన్‌తో పాటు మంచి డీల్ కూడా దొరికితే మాత్రం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం Samsung Galaxy S26 Ultra విషయంలో అలాంటి అవకాశమే కనిపిస్తోంది. ప్రీమియం ఫీచర్లు, టాప్ క్లాస్ కెమెరాలు, శక్తివంతమైన పనితీరుతో వచ్చిన ఈ ఫోన్‌పై Samsung నుంచి ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
దీంతో భారీ బడ్జెట్ పెట్టి ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలనుకునేవారికి S26 Ultra ఇప్పుడు మరింత ఆసక్తికరమైన ఆప్షన్‌గా మారింది. అసలు ఈ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తోంది? కొనుగోలు చేస్తే ఎంత వరకు ఆదా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
రూ.26,500 కంటే ఎక్కువ ఆదా..
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా అసలు ధర రూ.1,39,999 కాగా.. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.23,000 తక్కువకే రూ.1,17,000 వద్ద లభిస్తోంది. బ్యాంక్ కార్డు ఆఫర్ల ద్వారా మరో రూ.3,510 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చు. అంటే దాదాపు రూ.1,12,000లకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. అలాగే నెలకు రూ.4,113 నుండి ప్రారంభమయ్యే EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో ఊహించని ఆఫర్.. Oppo Find X9పై ఏకంగా రూ. 22,220 డిస్కౌంట్!
పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.34,100 వరకు అదనపు వ్యాల్యూ పొందవచ్చు. పాత ఫోన్ కండిషన్, మోడల్‌ను బట్టి ఈ ఆఫర్ వర్తిస్తుంది. కావాలనుకుంటే అదనంగా చెల్లించి 1 ఇయర్ శాంసంగ్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా తీసుకోవచ్చు.
ఈ ఫోన్‌లో 6.9 అంగుళాల డైనమిక్ మోడ్ AMOLED 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. స్క్రీన్ రక్షణ కోసం గొరిల్లా ఆర్మర్ 2 వాడారు. ప్రైవసీ డిస్‌ప్లే దీని ప్రత్యేకత. అలాగే ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇందులో 5,000mAh బ్యాటరీ, 60W వైర్డ్ చార్జింగ్, S-పెన్ సపోర్ట్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.
ఫోన్ వెనుక వైపు 200MP ప్రధాన కెమెరాతో పాటు 50MP అల్ట్రావైడ్, 50MP టెలిఫోటో, 10MP మరో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 12MP కెమెరా ఇచ్చారు. ఇది 8K వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఏడేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు రావడం ఈ ఫోన్ అతిపెద్ద ప్లస్ పాయింట్.
Also Read: ఫ్రిడ్జ్ కొనేముందు ఇవి తెలియకపోతే తప్పులో కాలేసినట్లే.. రూ.30,000 లోపు బెస్ట్ మోడల్స్ ఇవే!