E-Paper
Advertisement

ఎట్టకేలకు శాంసంగ్ లవర్స్ కల నెరవేరింది.. క్రేజీ కెమెరా, భారీ బ్యాటరీతో వస్తోన్న Galaxy S27 Ultra!

ఎట్టకేలకు శాంసంగ్ లవర్స్ కల నెరవేరింది.. క్రేజీ కెమెరా, భారీ బ్యాటరీతో వస్తోన్న Galaxy S27 Ultra!
Advertisement

Galaxy S27 Ultra: శాంసంగ్ ప్రతి ఏటా తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లతో మార్కెట్లో కొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఇటీవల వచ్చిన గెలాక్సీ S26 అల్ట్రా అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకోగా.. ఇప్పుడు అందరి దృష్టి తదుపరి మోడల్ గెలాక్సీ S27 అల్ట్రాపై పడింది. తాజాగా లీకైన సమాచారం ప్రకారం చూస్తే.. ఈ కొత్త ఫోన్ మునుపటి కంటే చాలా భిన్నంగా, సరికొత్త టెక్నాలజీతో రాబోతోంది. ఈ క్రమంలో ఈ ఫోన్‌లో వినియోగదారులు ఆశించదగిన ఆ 5 ప్రధాన మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కొత్త డిజైన్, కెమెరా బార్:

ఇప్పటివరకు శాంసంగ్ అల్ట్రా ఫోన్లలో విడివిడిగా ఉండే కెమెరా రింగ్స్ చూశాం. కానీ ఈసారి గెలాక్సీ S27 అల్ట్రాలో గూగుల్ పిక్సెల్ ఫోన్ల తరహాలో అడ్డంగా ఉండే ‘హారిజాంటల్ కెమెరా బార్’ డిజైన్‌ను తీసుకురావచ్చని తెలుస్తోంది. దీంతో ఫోన్‌ను టేబుల్‌పై పెట్టినప్పుడు అటుఇటు ఊగకుండా స్థిరంగా ఉంటుంది. అలాగే కెమెరా సెటప్‌లో కూడా ఒక పెద్ద మార్పు జరగనుంది. ఎప్పటినుంచో వస్తున్న 3x టెలిఫోటో లెన్స్‌ను తొలగించి, మెరుగైన 200MP ప్రైమరీ కెమెరాను శాంసంగ్ వాడనుంది. ఈ కొత్త సెన్సార్ ద్వారానే క్వాలిటీ తగ్గకుండా 3x జూమ్ ఫొటోలను తీసుకునేలా సాఫ్ట్‌వేర్‌ను డిజైన్ చేయనున్నారు.

Advertisement

Also Read: ఐఫోన్ కంటే తక్కువ బరువు.. బ్యాటరీ మాత్రం 14000mAh, హానర్ సంచలన నిర్ణయం!

భారీ బ్యాటరీ సామర్థ్యం:

చాలా కాలంగా శాంసంగ్ అల్ట్రా మోడల్స్ 5000mah బ్యాటరీతోనే వస్తున్నాయి. అయితే గెలాక్సీ S27 అల్ట్రాతో ఈ నిరీక్షణకు తెరపడనుంది. కంపెనీ దీనిలో సరికొత్త సిలికాన్-కార్బన్ బ్యాటరీ టెక్నాలజీని వాడబోతున్నట్లు సమాచారం. కెమెరా లెన్స్ తగ్గడం వల్ల లోపల దొరికే స్థలాన్ని ఉపయోగించుకుని, ఏకంగా 5500mah నుండి 6000mah సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చనున్నారు. ఇది ఫోన్ బ్యాకప్‌ను భారీగా పెంచుతుంది.

నెక్స్ట్ జనరేషన్ పవర్ఫుల్ ప్రాసెసర్:

Advertisement

పెర్ఫార్మెన్స్ పరంగా ఈ ఫోన్ మరో మెట్టు ఎక్కనుంది. గెలాక్సీ S26 అల్ట్రాలో ఉన్న చిప్‌సెట్ కంటే ఎంతో శక్తివంతమైన, 2 నానోమీటర్ ప్రక్రియపై తయారయ్యే ‘స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో’ ప్రాసెసర్‌ను దీనిలో వాడనున్నారు. దీనికి తోడు సరికొత్త ఎల్‌పిడిడిఆర్6 ర్యామ్, యూఎఫ్ఎస్ 5.0 స్టోరేజ్ టెక్నాలజీలను జత చేయడం వల్ల ఫోన్ వేగం ఊహించని రేంజ్‌లో ఉంటుంది. హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్, ఆన్-డివైజ్ ఏఐ పనులను ఇది సులువుగా చేయగలదు.

అయస్కాంత ఛార్జింగ్ సపోర్ట్:

శాంసంగ్ వినియోగదారులు ఎప్పటి నుంచో కోరుకుంటున్న క్యూఐ2 మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ ఫీచర్ ఎట్టకేలకు ఈ మోడల్‌లో రానుంది. ఐఫోన్లలో ఉండే మ్యాగ్‌సేఫ్ తరహాలోనే ఈ ఫోన్ వెనుక భాగంలో కూడా ఇన్‌బిల్ట్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. దీనివల్ల ఎలాంటి ప్రత్యేకమైన కేస్ అవసరం లేకుండానే నేరుగా మ్యాగ్నెటిక్ ఛార్జర్లు, పవర్ బ్యాంకులు, వాలెట్లను ఫోన్‌కు సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. రాబోయే వన్ యూఐ 9 అప్‌డేట్, సరికొత్త ఏఐ ఫీచర్లు ఈ ఫోన్‌ను మరింత స్పెషల్‌గా మార్చనున్నాయి.

Also Read: గోల్డెన్ ఛాన్స్ భయ్యా.. ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై మతిపోయే డిస్కౌంట్స్.. సేల్ ఎప్పటి నుంచో తెలుసా?

Related News

ప్రతీ రోజూ 1.5GB డేటా ఇచ్చే.. రూ.330 లోపు జియో ప్లాన్స్.. ఇంకా బోలెడన్ని బెనిఫిట్స్ ఫ్రీ!

6500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్.. Vivo X300 FE కొత్త వేరియంట్ ధర, ఆఫర్ల పూర్తి వివరాలు!

BSNL బిగ్ ధమాకా ప్లాన్.. రూ. 319 కే 65 రోజుల వ్యాలిడిటీ.. ఇదేం ఆఫర్ బాబోయ్!

అమెజాన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న..హైయర్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ!

షాకింగ్ ప్రైస్ డ్రాప్.. ఏకంగా రూ.45,000 తగ్గిన Galaxy S25 Edge, ఆఫర్ ఎలా పొందాలంటే?

మార్కెట్‌లో ఫుల్ క్రేజ్ ఉన్న ఇయర్‌బడ్స్..ఇప్పుడు ఆఫర్‌‌లో !

Whatsapp Webలో అదిరిపోయే అప్‌డేట్.. ఇకపై బ్రౌజర్‌ నుంచే గ్రూప్ వీడియో కాల్స్!

ఫోన్ వెనుక మరో డిస్‌ప్లేనా? టెక్నో నుంచి మైండ్ బ్లోయింగ్ 5G ఫోన్.. లాంచ్ డేట్ ఫిక్స్!

Big Stories

Advertisement
×