E-Paper
Advertisement

ఫుడ్ లవర్స్‌కు ఊహించని షాక్.. హైదరాబాద్ స్థానమెంతో తెలుసా? FSSAI రిపోర్ట్‌లో కలవరపెడుతున్న అంశాలు

ఫుడ్ లవర్స్‌కు ఊహించని షాక్.. హైదరాబాద్ స్థానమెంతో తెలుసా?  FSSAI రిపోర్ట్‌లో కలవరపెడుతున్న అంశాలు
Advertisement

Hyderabad City: హైదరాబాద్ అంటే చాలామందికి గుర్తుకు వస్తుంది ఫుడ్. ఎందుకంటే భాగ్యనగరం రుచులు వేరని చెబుతుంటారు. చాలామంది ప్రత్యేకంగా ఇక్కడి రుచులను ఆస్వాదించడానికి వస్తున్నారు. ఇటీవల కాలంలో హోటళ్లలో ఫుడ్ సేఫ్ట్ అధికారులు అధికారులు చూస్తే షాక్ కావాల్సిందే. తాజాగా ఫుడ్ హైజీన్ రేటింగ్స్ చిట్టచివరి స్థానంలో నిలిచింది హైదరాబాద్.

ఫుడ్ లవర్స్‌కు ఊహించని షాక్.. హైదరాబాద్ స్థానమెంతో తెలుసా?

Advertisement

దేశంలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. రాజధాని ఢిల్లీలో దాదాపు 3,394 హైజీన్ సర్టిఫైడ్ హోటళ్లు కలిగి వున్నట్లు పేర్కొంది. దాని తర్వాత ప్లేస్‌లో బెంగళూరులో 2,200 హోటళ్లు ఆ తరహా రేటింగ్‌ కలిగి ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అహ్మదాబాద్, జైపూర్ వంటి ద్వితీయ శ్రేణి నగరాలు హైదరాబాద్ కంటే మెరుగ్గా ఉన్నాయి.

ఈ నివేదిక కాసేపు పక్కన బెడితే.. కొన్నాళ్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్ సిటీలో హోటల్స్, రెస్టారెంట్లపై దాడుల మీద దాడులు చేస్తున్నారు. కాలపరిమితి అయిపోయిన వస్తువులు ఆహారంలో ఉపయోగించినట్టు తేల్చారు. ఆహారం తయారు చేసే ప్రాంతంలో పరిశుభ్రత గురించి చెప్పనక్కర్లేదు. ఇవన్నీ గమనించిన హైదరాబాద్ సిటీ ప్రజలు చాలావరకు హోటళ్లకు దూరంగా ఉంటున్నారు.

Advertisement

FSSAI రిపోర్ట్ కలకలం.. పాకశాస్త్ర నిపుణులు ఏమంటున్నారు?

హోటళ్లు, రెస్టారెంట్ల ఓనర్లకు పరిశుభ్రత పట్ల ఆసక్తి లేకపోవడం ప్రధాన కారణమని దాడుల సమయంలో తేలింది. ఈ విషయాన్ని అధికారులు స్వయంగా చెప్పుకొచ్చారు. FSSAI రేటింగ్ విధానం ఆహారం తయారు చేసే పద్ధతులు, పరిశుభ్రత, నిల్వ ఉంచే వాతావరణం సహా పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత 1 టు 5 స్టార్ వరకు రేటింగ్స్ ఇస్తుంటాయి.

ప్రభుత్వాలు తప్పనిసరి చేయకపోవడంతో హైదరాబాద్‌లో హోటల్, రెస్టారెంట్స్ నిర్వాహకులు పెద్దగా పట్టించుకోలేదు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీల సమయంలో అవగాహన కల్పిస్తున్నా, వారం తర్వాత మళ్లీ మామూలే. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా-NRAI గతంలో పరిశుభ్రత రేటింగ్‌లను ప్రోత్సహించడానికి అవగాహన పెంచుతామని తెలిపింది.

ALSO READ: హైదరాబాద్‌‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో.. మిడ్‌నైట్ ఓ మహిళ ఎంట్రీ

ఆహార భద్రతా అధికారులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది, కానీ ఈ చొరవ నిరంతర ఊపందుకోవడంలో విఫలమైంది.క్షేత్రస్థాయిలో అమలు పరచడానికి ఆహార భద్రతా అధికారులు-పరిశ్రమ ప్రతినిధులు-ప్రజా సభ్యులతో కూడిన కమిటీల ప్రాంతాల వారీగా ఉండాలని చెబుతోంది.

హైదరాబాద్‌కు యునెస్కో సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీగా గుర్తింపు ఉందని ప్రపంచవ్యాప్త పాకశాస్త్ర ఖ్యాతిని నొక్కి చెబుతున్నారు. నగరంలో విస్తరిస్తున్న రెస్టారెంట్‌కు అనుగుణంగా ఆహార భద్రత-పరిశుభ్రత ప్రమాణాలు అభివృద్ధి చెందాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

Related News

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ!

డిప్యూటీ సీఎం శాఖలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ సంచలన ఆరోపణలు!

గద్వాల్ మున్సిపాలిటీలో.. ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ సస్పెన్షన్‌?

పోలీసులు మళ్లీ కొడతారనే భయంతో.. ఓ యువకుడు ఆత్మహత్య!

13 ఏళ్ల బాలుడిపై స్కూల్ టీచర్ లైంగిక దాడి!

ఓయో హోటల్‌లో మహిళ దారుణ హత్య.. పరారీలో యవకుడు!

దొంగ ఓట్లతోనే మోదీ, అమిషా అధికారంలోకి వచ్చారు.. ఆధారాలతో విరుచుకుపడ్డ రఘువీరా రెడ్డి!

ఆ ఛాంబర్ ముందు ఆంక్షలు ఎందుకు.. కాంగ్రెస్ సర్కార్‌పై ప్రభుత్వ ఉద్యోగులు ఫైర్!

Big Stories

Advertisement
×