E-Paper
Advertisement

ప్యారడైజ్ కోసం నాని రెమ్యూనరేషన్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

ప్యారడైజ్ కోసం నాని రెమ్యూనరేషన్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Advertisement

Nani Remuneration:ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లులు ఒక్కో సినిమాకి ఎంత పారితోషికం తీసుకుంటున్నారు వంటి విషయాలపై ఆడియన్స్ కి ఎక్కడ లేని క్యూరియాసిటీ ఉంటుందని చెప్పక్కర్లేదు.ఇక ఇదే క్రమంలో సెప్టెంబర్ 24న ప్యారడైజ్ సినిమా రిలీజ్ అవుతుండటం తో ఇందులో నటించేందుకు నాని ఎంత పుచ్చుకుని ఉంటాడా అంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారు మూవీ లవర్స్.మరి ప్యారడైజ్ కోసం నాని అందుకుంటున్న రెమ్యూనరేషన్ ఏంటో ఒకసారి చూసేద్దాం !

దాదాపు 35 కోట్ల వరకు

Advertisement

మొదట్లో అలా మొదలైంది, స్నేహితుడా, పిల్ల జమీందార్ అంటూ వరుసగా పక్కింటి కుర్రాడి పాత్రలో నటించి మెప్పించిన నాని ఇపుడు రూట్ మార్చాడు.దసరా , హిట్ 3 సినిమాలతో మాంచి మాస్ ఇమేజ్ కూడా సొంతం చేసుకున్న నాని ఇపుడు శ్రీకాంత్ ఓదేల సినిమా ప్యారడైజ్ తో మరోసారి ఆడియన్స్ ని పలకరించేందుకు రెడీ అయిపోయాడు.అయితే ఈ సినిమా కోసం నాని అందుకుంటున్న పారితోషికం విషయానికి వస్తే దాదాపు 35 కోట్ల వరకు ఈ సినిమా కోసం తీసుకుంటున్నాడన్న టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది.

కొంతకాలం వరకు పదికోట్ల వరకే

Advertisement

గత కొంతకాలం వరకు పదికోట్ల వరకే ఉండే నాని హయ్ నాన్న, దసరా. సరిపోదా శనివారం వంటి సినిమాలు సూపర్ హిట్ అవడంతో రేటు పెంచాడని తెలుస్తుంది.ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్న మరో టాక్ ప్రకారం కేవలం పారితోషికం మాత్రమే కాకుండా వచ్చే వాటాల్లో లాభాలు కూడా అందుకోబోతున్నాడని సోషల్ మీడియాలో వినిపిస్తుంది.నాని లాంటి ప్రామిసిగ్ హీరో దొరికే చాలు అనుకుంటున్న నిర్మాతలు అడిగినంత ఇచ్చుకుంటారు అనడంలో సందేహమే లేదు .ఆడియన్స్ లో నాని కున్న క్రేజ్ అలాంటిది మరి.

2026 మార్చి 26న వరల్డ్ వైడ్ విడుదల

ఇక సినిమా విషయానికి వస్తే ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో నాని తో పాటు సోనాలి కులకర్ణి,

మోహన్ బాబు, రాఘవ్ జుయల్,సంపూర్నేష్ బాబుప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఇక ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న వరల్డ్ వైడ్ విడుదల కానుందన్న సంగతి తెల్సిందే.చూడాలి మరి అంచనాలు ఒక రేంజ్ లో పెంచేస్తున్న ప్యారడైజ్ సినిమా ఆ అంచనాల్ని అందుకుంటుందా లేదా కాలమే డిసైడ్ చేయాల్సిందే

ALSO READ:ఫౌజీ రిలీజ్‌పై సస్పెన్స్.. జనవరి 26కి వస్తుందా?

Tags

Related News

కొత్త ఫోన్ కోసం క్యూ కట్టడం ఏంటీ? ఐ ఫోన్ లవర్స్ కు క్లాస్ పీకిన సోనూ సూద్!

అల్లు అర్జున్ కు సంబంధం లేదు.. భూ వివాదంపై మామ చంద్రశేఖర్ రెడ్డి క్లారిటీ!

రోజాని అలా చూసి చాలా హర్ట్ అయ్యా.. ఆమని కామెంట్స్ వైరల్!

జాంబీ రెడ్డి 2 నుండి ఉపేంద్ర ఫస్ట్ లుక్ రిలీజ్.. ప్రపంచమే తలకిందులు కాబోతోందా?

షూటింగ్లో గాయపడ్డ హీరో విశాల్.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే?

భాగ్యశ్రీతో రామ్ బ్రేకప్?

టాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమ.. ఎంగేజ్‌మెంట్.. ఇప్పుడు ఎవరి దారి వారిదే!

Big Stories

Advertisement
×