Samsung vs Haier vs Hisense smart TV 2026: ఈ రోజుల్లో ఇల్లు అన్నాక ఒక మంచి స్మార్ట్ టీవీ ఉండటం కామన్ అయిపోయింది. ఓటీటీలో సినిమాలు చూడాలన్నా.. లైవ్ క్రికెట్ మ్యాచ్‌లు ఎంజాయ్ చేయాలన్నా ఒక పవర్‌ఫుల్ డిస్‌ప్లే, అదిరిపోయే సౌండ్ సిస్టమ్ ఉన్న టీవీ ఖచ్చితంగా కావాలి. ప్రస్తుతం మార్కెట్‌లో స్మార్ట్ టీవీ అనగానే మనకు ఎక్కువగా వినిపిస్తున్న బ్రాండ్లు శామ్‌సంగ్, హయ్యర్, హైసెన్స్. మరి ఈ మూడింటిలో దేని ఫీచర్లు బాగున్నాయి? ఏది తక్కువ ధరలో ఎక్కువ లైఫ్ ఇస్తుంది? మీ ఇంటికి ఏ బ్రాండ్ టీవీ పక్కాగా సెట్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
స్మార్ట్ టీవీల ప్రపంచంలో శామ్‌సంగ్ (Samsung) ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది.లేటెస్ట్ మోడల్స్‌లో శామ్‌సంగ్ తన క్రిస్టల్ 4K , ప్రీమియం మోడల్స్ కోసం QLED టెక్నాలజీని వాడుతోంది. వీటిలో డిస్‌ప్లే కలర్స్ చాలా నేచురల్‌గా, అద్భుతంగా ఉంటాయి. శామ్‌సంగ్ సొంత ‘టైజెన్ ఓఎస్’సాఫ్ట్‌వేర్ పరంగా చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. ల్యాగ్ అస్సలు ఉండదు. మీరు బ్రాండ్ వాల్యూ, లాంగ్ లైఫ్, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ కోరుకుంటే శామ్‌సంగ్ ఎప్పటికీ బెస్ట్ ఛాయిస్. కాకపోతే.. మిగిలిన బ్రాండ్లతో పోలిస్తే దీని ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది.
ఇక హయ్యర్ (Haier) బ్రాండ్ విషయానికి వస్తే.. వీరు ముఖ్యంగా మిడిల్ క్లాస్ యూజర్లను టార్గెట్ చేస్తూ రీజనబుల్ ధరల్లో అదిరిపోయే ఫీచర్లు ఇస్తున్నారు. ఈ ఏడాది వస్తున్న హయ్యర్ లేటెస్ట్ టీవీలు ‘గూగుల్ టీవీ’ప్లాట్‌ఫారమ్‌తో వస్తున్నాయి. దీనివల్ల మనకు నచ్చిన ఓటీటీ యాప్స్ వాడుకోవడం, వాయిస్ కమాండ్స్ ఇవ్వడం చాలా ఈజీగా మారుతుంది. దీని డిస్‌ప్లే, డాల్బీ ఆడియో సౌండ్ క్వాలిటీ నార్మల్ యూజర్లకు చాలా బాగా నచ్చుతాయి. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ స్క్రీన్ సైజ్ , ఈజీ సాఫ్ట్‌వేర్ కావాలనుకునే వారికి హయ్యర్ ఒక మంచి ఆప్షన్.
ప్రస్తుతం మార్కెట్‌లో ఫీచర్ల పరంగా దుమ్మురేపుతున్న బ్రాండ్ హైసెన్స్ . చాలా తక్కువ ధరలోనే క్వాంటం డాట్ డిస్‌ప్లే, డాల్బీ విజన్, గేమింగ్ కోసం హై రీఫ్రెష్ రేట్ వంటి ప్రీమియం ఫీచర్లను హైసెన్స్ అందిస్తోంది. సినిమా థియేటర్ లాంటి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా దీని బిల్ట్-ఇన్ స్పీకర్లు , సౌండ్ టెక్నాలజీని డిజైన్ చేశారు. స్మార్ట్ ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీ చాలా తక్కువ బడ్జెట్‌లోనే కావాలి అనుకునే టెక్ లవర్స్‌కు హైసెన్స్ పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది.
కనెక్టివిటీ పరంగా ఈ మూడు బ్రాండ్లు కూడా సరికొత్త వైఫై, బ్లూటూత్ , మల్టిపుల్ హెచ్‌డీఎమ్‌ఐ పోర్టులను ఇస్తున్నాయి. శామ్‌సంగ్ తన ఎకోసిస్టమ్‌తో గెలాక్సీ ఫోన్లను ఈజీగా కనెక్ట్ చేసుకునే సదుపాయం ఇస్తుండగా.. హయ్యర్ , హైసెన్స్ టీవీలలో ఇన్‌బిల్ట్ క్రోమ్‌కాస్ట్ సపోర్ట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నిరంతరాయంగా 4కే కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేసినా ఈ మూడు టీవీలలోని ప్రాసెసర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మూత్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి.
Also Read: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ. 20వేలలోపు పైసా వసూల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్స్!
మీ ఇంటికి ఏది బెస్ట్?
మీరు బడ్జెట్ గురించి ఆలోచించకుండా పక్కా బ్రాండ్ క్వాలిటీ, సూపర్ కలర్ అక్యూరసీ ,లాంగ్ లైఫ్ కావాలనుకుంటే.. శామ్‌సంగ్ వైపు వెళ్లడం మంచిది. అలా కాకుండా బడ్జెట్ లిమిట్‌లో ఉంటూ సింపుల్ గూగుల్ టీవీ ఇంటర్‌ఫేస్ కావాలంటే హయ్యర్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఒకవేళ తక్కువ ధరలోనే 4 కే క్యూఎల్ఈడీ, డాల్బీ విజన్ వంటి హై-ఎండ్ హోమ్ థియేటర్ ఫీచర్లు కావాలనుకుంటే మాత్రం కళ్ళు మూసుకుని హైసెన్స్ లేటెస్ట్ మోడల్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ అవసరాన్ని బట్టి స్మార్ట్ ఛాయిస్ తీసుకోండి.