Women’s T20 World Cup 2026: టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Women’s T20 World Cup 2026) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంటులో ఇప్పటి వరకు 13 మ్యాచులు జరిగాయి. అయితే ఇందులో ఇప్పటికే టీమిండియా, దక్షిణాఫ్రికాతో తలపడిన పాకిస్తాన్ మహిళల జట్టు (Pakistan Women)… రెండింటిలో ఓడిపోయింది. మరో మూడు మ్యాచులు గ్రూప్ స్టేజ్ లో ఆడాల్సి ఉంది. ఇందులో పాకిస్తాన్ గెలవకపోతే… పెను ప్రమాదం పొంచి ఉంది. 2028 టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ (Women’s T20 World Cup 2028) ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని పాకిస్తాన్ కోల్పోనుంది. ఈ టోర్నమెంట్ ఫినిష్ అయ్యే లోపు పాయింట్ల పట్టికలో 8వ స్థానంలోపు పాకిస్తాన్ నిలవాలి. అలా జరుగకపోతే, వచ్చే ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ క్రికెటర్ల పై మరింత ఒత్తిడి పెరిగింది.
టి20 మహిళల ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ (Women’s T20 World Cup 2026) నేపథ్యంలో ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో పాకిస్తాన్ గెలిస్తేనే సెమీ ఫైనల్ అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఈ టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ దాదాపు ఎలిమినేట్ కావాల్సిందేనని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు. అయితే ఈ మ్యాచ్ లో గెలిచిన గెలవకపోయినా, టోర్నమెంట్ ముగిసే సమయం వరకు పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ ఎనిమిదవ స్థానంలో నిలవాల్సిన పరిస్థితి నెలకొంది. అలా 8వ స్థానంలో పాకిస్తాన్ కనుక నిలవకుండా, అంతకు మించి దిగజారితే… టి20 మహిళల ప్రపంచకప్ 2028 టోర్నమెంట్ ఆతిథ్యం ఇచ్చే అవకాశాలను కోల్పోతారు. అంటే 2028 ప్రపంచ కప్ టోర్నమెంట్ ఆతిథ్య హక్కులను మరో దేశం దక్కించుకుంటుంది. అదే జరిగితే వచ్చే వరల్డ్ కప్ లో ఆడాలంటే, క్వాలిఫైయర్ మ్యాచ్ లను పాకిస్తాన్ జట్టు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. దీంతో పాకిస్తాన్ క్రికెటర్లపై ఇప్పుడు మరింత ఒత్తిడి పెరిగింది. ఈ తరుణంలోనే బంగ్లాదేశ్ పై ఎలాగైనా గెలవాలన్న కసితో ఇవాళ బరిలోకి దిగుతున్నారు పాకిస్తాన్ మహిళ క్రికెటర్లు.
టీ20 మహిళల ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు. ఈ క్రమంలో గ్రూప్ A లో ఇండియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నెదర్లాండ్స్ ఉన్నాయి. టీమిండియా అలాగే దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్, ఈ గ్రూప్ A లో ఐదో స్థానంలో నిలిచింది. మరో మ్యాచ్ ఓడిపోతే మరింత దిగజారుతుంది. అలాగే వరుస ఓటములు ఎదురైతే మాత్రం… పాకిస్తాన్ చేతిలో నుంచి టి20 మహిళల ప్రపంచకప్ 2028 ఆతిథ్య హక్కులు పోనున్నాయి.
🚨 WOMEN’S T20 WORLD CUP MATCH DAY 🚨 🏏🔥
🧨 “Pakistan’s crucial World Cup match today 🇵🇰🔥”
📌 Today’s Fixtures:
🇵🇰 Pakistan women's national cricket team vs Bangladesh women's national cricket team🇦🇺 Australia women's national cricket team vs Netherlands women's national… pic.twitter.com/wDztn87Exo
— Clutch Sports (@Hammad1326025) June 20, 2026